Tuesday, November 19, 2024

 😃😃😃నవ్వు తో ఎవరినైనా గెలవచ్చు 
మీకు తెలుసా విచ్చుకున్న మీ పెదాలుమీ మొఖ సౌందర్యాన్ని పెంచుతాయని.
మీ చిరునవ్వు వలన మీకు బిపి కంట్రోల్ లో ఉంటుందని
అది చూసినవారికి మీరంటే ఒక మంచి అభిప్రాయం కలుగుతుందని అంతేకాదు మీతో మాట కలపడానికి ఇష్టపడతారని
 మీ చిరునవ్వుతో ఎదుటివారిని ఒప్పించి నొప్పించకుండా మీ పనులు చేసుకోవచ్చని
 ఎప్పుడూ నవ్వు ముఖం తో ఉండేవాళ్ళ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నవ్వు తో ఉన్న ముఖాన్ని చూసినప్పుడు మీరు కోపపడే పనిచేసినా కూడ మిమ్మల్ని గట్టిగ తిట్టలేరు. ఆడవాళ్ళకి చిరునవ్వు ఒక వరమని చెప్పచ్చు ఆలా నవ్వు మొఖం తో చూసేసరికి ఆఫీస్ లో మీ బాస్ మీ కొలిగ్స్ మిమ్మల్ని బాగా ఇఇష్టపడతారు
 మీ ఆయన మీరు ఆయనకీ కోపం తెప్పించే పనులు చేసినా కోప్పడరు సరికదా సర్దుకుపోతారు. మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. నిద్రలో కూడా కొద్దిగా నవ్వుతుంటే ఆరోగ్యమైన కలలు కంటున్నారనుకోవచ్చు. 
గట్టిగ చెప్పవలసిన విషయాన్ని అరచి నలుగురికి వినబడేటట్లు చెబితే మొట్టమొదట పాడయ్యేది మీ ఆరోగ్యమే అని తెలుసుకుంటే మీరు గట్టిగ అరవడం మానేస్తారు
అదే కాస్త నిదానంగా చెబితే వినేవాళ్లకు మీమీద గౌరవం పెరిగి మీ మాటకు విలువిచ్చి మీరు చెప్పిమట్లు వినే అవకాశం ఉంటుంది. 
ప్రముఖ దర్శకుడు శ్రీ జంధ్యాల గారు కుటుంబమంతా ఆనందంగా నవ్వుకునే సినిమాలు తీసి అనతి కాలంలోనే ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయారు. నవ్వడం ఒక భోగం నవ్వకపోతే ఒక రోగం అన్నారు అంతేకాదు నవ్వు నవ్వించు అని కూడా అన్నారు 
రోజు కనీసం ఐదు నిముషాలు బిగ్గరగా ఏ అలొచనలు లేకుండా ప్రశాంతంగా నవ్వగలిగితే మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా పాజిటివ్ థింకింగ్ కూడా అలవడుతుంది. 
శత్రువులు పెరగకుండా ఉండాలన్న ఉన్న శత్రువులు తగ్గాలన్న చిరునవ్వు మంచి ఉపాయం. ఒక స్నేహానికి నాందిగా చిరునవ్వును చెప్పుకోవచ్చు. 
నవ్వమని చెప్పానని సమయం సందర్భం లేకుండా నవ్వితే అబాసుపాలవక తప్పదు 
ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు చెడు వార్త విన్నప్పుడు అందరు కష్టాల్లోనూ భాదల్లోనూ వున్నప్పుడు మనం అసలు నవ్వకూడదు. నవ్వొచ్చిన కంట్రోల్ చేసుకోవాలి. అతిగా నవ్వేవాళ్ళని పిచ్చివాళ్లనుకుంటారు. అన్నింటికి పెద్ద శబ్దం చేస్తూ నవ్వితే జనాలు మీరంటే భయపడి మీదగ్గరకి ఎవ్వరురారు
 సందర్భాన్ని బట్టి నువ్వు నాలుగు విధాల చేటు అనే సామెత కూడా గుర్తుపెట్టుకోవాలి 
నవ్వు అనేది భగవంతుడు మానవులకిచ్చిన వరం. మానవునికి తప్ప మరే జీవికి నవ్వే అదృష్టం లేదు. కాబట్టి హాయిగా నవ్వుతూ బతికేస్తు నవ్వుతూ.......
నవ్వుతూ....... సంతోష మస్తూ 
బి మల్లికార్జున దీక్షిత్ 
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ 
సెల్ 9133320425

No comments:

Post a Comment