Tuesday, November 19, 2024

 శ్రీమద్రామాయణము.

(244 వ ఎపిసోడ్),,

""కరభ దోహన న్యాయము""

 మానవుని గుణహీనతలను బేరీజుు చేసుకోవాలంటే  ఈ సూక్తిని అన్వయించుకొంటే విషయము తెలిసి వస్తుంది. అసలు ఏమిటీ కంబ దోహన  న్యాయము. ఇంట్లో మనకి  ఆవు మరియు గాడిద రెండు యున్ననూ కేవలము గాడిద పాలు మాత్రమే పితికి త్రాగటమనేది మూఢత్వమనిపించుకుంటుంది.
 ఇట్టి గుణహీనత కలిగి యుంటే ప్రజలు భ్రష్టులై ఇక్కట్ల పాలగుట తథ్యము . ఈ విషయాన్ని మారీచుడు తన హితవు వినక రెండవసారి తనవద్దకు వచ్చిన రావణాసురినికి ఈ విధముగ హితవు పలుకుతాడు.ఓ రావణా పాలకుడైన రాజు గుణవంతుడైనచో మంత్రులందరు ధర్మమార్గమును ఆశ్రయించి ఆరోగ్యవంతులు ఆయుష్మంతులై ఐశ్వర్యాలతో వర్ధిల్లుదరు. అట్లుగాక

"" విపర్యయే తు తత్సర్వం వ్యర్ధం భవతి రావణ,
   వ్యసనం స్వామివైగుణ్యాత్ ప్రాప్నువంతీతరే జనాః.." [రామాయణం అరణ్యకాండ41వసర్గ9వశ్లో.]

ఆ పరిపాలకుడైన  రాజు గుణహీనుడైనచో కేవలము సచివులేకాక దేశప్రజలు కూడ సర్వపురుషార్ధములు పాటించియు కూడ భ్రష్టులై నశించెదరు" అని చెప్పి సక్రమ మార్గములో నడవమని హెచ్చరిస్తాడు.

రావణాసురుడు మారీచుని మాటలు పెడచెవిన పెట్డడముతో చేయునది లేక తనలో తాను ఇలా అనుకుంటాడు,

""" మాం నిహత్య తు రామశ్చ నచిరాత్ త్వాం వధిష్యతి,
అనేన కృతకృత్యో~స్మి మ్రియే యదరిణా హతః||, (41-17),

ఓ అన్నా ! ఎంత పిచ్చివాడివి. రాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్నును చంపితీరును.  కనుక నీ శతృవైన రాముని చేతిలో మరణించుట వల్ల నా జన్న తరించగలదు.

కనుక మనకున్న వనరులను సద్వినియోగ పరచుకుంటు సచివులు చెప్పే మంచి సలహాలు పాటిస్తు  సుగుణవంతులై మెలిగి సరియైన ఆలోచనలతో  ఆయుష్కాములై జీవించమని రామాయణము మనలని హెచ్చరిస్తున్నది.

జై శ్రీరామ్,  జై  జై  శ్రీరామ్.

No comments:

Post a Comment