☘️☘️☘️
*మాంసాహారం వద్దు*
*శాకాహారమే ముద్దు*
*పారిస్: మాంసాహారం వద్దు.. శాకాహారమే ముద్దు.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకుల నినాదం ఇదే. కర్బన ఉద్గారాల కట్టడే లక్ష్యంగా ఒలిం పిక్స్ అథ్లెట్లకు ఎక్కువ శాతం శాకాహారం వంటకాలను అందించేందుకు నిర్వాహ కులు ప్రయత్నిస్తున్నారు. మాంసాహార వంటకాలను తగ్గించారు. మాంసాహారం తినడం వల్ల కర్బన ఉద్గారాలు ఎలా వెలువడతాయనే ప్రశ్న రావడం సహజం. అయితే ఆహారం కోసం జంతువులను పెంచే క్రమంలో 15 శాతం గ్రీన్హౌస్ ఉద్గారాలు వెలువడుతు న్నాయి. ఈ జంతువులను రవాణా చేసినప్పుడూ కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే మొక్కల నుంచి తయారు చేసే ఆహారాన్ని తీసుకుంటే ఈ ఉద్గారాలను నియంత్రించవచ్చని ఒలింపిక్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విశ్వ క్రీడల సమయంలో క్రీడా గ్రామంలో సుమారు కోటి 30 లక్షల భోజనాలు, స్నాక్స్ ఏర్పాటు చేస్తారని అంచనా. ఇందులో 60 శాతం మొక్కల నుంచి వచ్చిన ఆహారమే ఉంటుందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. ఒక్క భోజ నానికి ఒక కిలో కార్బన్ డై ఆక్సైడ్ వెలువడేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే ఎక్కువ మొత్తంలో పళ్లు, కూరగాయలను భోజనంలో భాగం చేస్తున్నారు. సాధారణంగా అయితే ఫ్రాన్స్ ప్రజలు మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ప్రపంచ మాంసాహార తలసరి వినియోగం 28.1 కిలోలు, అదే ఫ్రాన్స్లో అయితే ఏకంగా 83.5 కిలోలుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి మారుతోంది. ఒలింపిక్స్లో నూ పారిస్ అదే ఒరవడి కొనసాగిస్తోంది. టోక్యో ఒలింపిక్స్లో 19.6 లక్షల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. పారిస్లో దీన్ని 15.8 లక్షల మెట్రిక్ టన్ను లకే పరిమితం చేయాలని చూస్తున్నారు.*
No comments:
Post a Comment