Saturday, November 2, 2024

****పాప పుణ్యాలు.._* *_శ్రీరమణ మహర్షి

 *_✨ పాప పుణ్యాలు.._*
      *_శ్రీరమణ మహర్షి  ✨_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_✨ మనసు ఉన్నంత వరకు పాప పుణ్యాలు ఉంటాయి. మనసు లేని వారు ఇద్దరే. ఒకరు జ్ఞాని మరొకరు శవం._*

*_పాపపుణ్యాలకు మనసే కారణం. బయటికి అనక పోయినా మనసులో ఒకరిని తిట్టుకొన్న కర్మే. ఈ పాప పుణ్యాలకు తోడు, ప్రతి దాంట్లో లేని తీరని కోరికలు. ఈవన్నీ దాటుకుని సద్గురువులను చేరాలంటే ఆషామాషీ కాదు. ప్రపంచంలో ఏ అవకాశాలు లేనపుడే  గతంలో అక్కడక్కడ మహనీయులు లభిస్తా వచ్చారు. ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నా కూడ గురువులు కరువైపోయారు._* 

*_ఇది మాయ ప్రభావమా లేక మన ప్రాప్తమా లేక కాల పరిస్థితా లేక మన స్వయంకృతపరాధమా. సుఖాలు కావాలంటే జన్మలు కావాలి. జన్మలు ఉండాలంటే దానం, నిస్వార్ధం, ధర్మం ఉండాలి. ఒక వేళ ఇవన్ని ఉన్నా, ఏదో ఒక జన్మలో మాత్రమే అన్ని అనుభవిస్తాం. కానీ మరుజన్మలో అవి ఏవి వుంటాయి అనే నమ్మకం లేదు. అంటే ప్రతిజన్మలో పుణ్యం_* 
*_మనం చేస్తుండాలి. అలా చేయలేము. మాయ అలా చేయనీయదు._*

*_కోరికల భక్తి ఏజన్మకు శాంతి నివ్వదు. చిన్న ఒకకొరిక ఉన్న, చిన్న ఒక ఋణం ఉన్నా కూడా జన్మకు రావాలసిందే._*
*_గతజన్మల కోరికలు, ఈ జన్మ కోరికలు. మన పుణ్యాన్ని బట్టి ఏ జన్మ కోరిక ఏ జన్మలో తిరుతుందో తెలియదు._* 

*_జన్మలకు,కర్మలకు,కోరికలకు అంతం లేదు. అలాగే మన చావు పుట్టుకలకు అంతంలేదు. కోరికలతో కర్మలు చేస్తూ ఉండే పూజ, పుణ్యం ఎందుకో, ఎవరి కోసమో దేని కోసమో, తెలుసుకోలేక ఉన్నాము. వస్తువుల కోసం, సుఖాల కోసం, కోరికల కోసం ప్రతిజన్మలో చేసిన పుణ్యం కోల్పోతున్నాము._*

*_అదే సత్యం కోసం, దైవం కోసం పుణ్యం చేయి ఏదో ఒకజన్మలో సత్పురుషుల సహవాసం లబిస్తుంది. అప్పుడు జీవితానికి అర్థం పరమార్థం లబిస్తుంది, తరించిపోవచ్చు._* 

*_అందుకే మహర్షి గురు సాంగత్యం లభిస్తే ఏ నియమాలు అవసరంలేదు అన్నారు. చేతిలో డబ్బుకు కోదవలేకపోతే  కోరిన వస్తువుకు కొదవ ఉండదు. ఇతరులకు సహాయపడచ్చు. అలాగే చేతిలో శక్తి లేనివారు వాండ్లు మేలు పొందలేరు. ఇతరులను కూడా అదుకోలేరు._*

 *_బౌతిక ప్రపంచంలో లావాదేవీలు జరిపేవారు, దైవ ప్రభుత్వంలో ప్రవేశించలేరు. ప్రవేశించలేని వారికి దైవకృప లభించదు. కృప లభించని వారికి జ్ఞాని లభించడు. లభించని వారు గురువు కాలేడు. కానీ అటు వంటి గురువు లభిస్తే ఇతరులకు ముక్తి సులభం._* 

*_కానీ ఒకేఒక్క జ్ఞాని తప్ప, అందరూ ఎవరి ప్రారబ్ధం వారు గత జన్మలో తగిలించుకొన్నదే !!_*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment