Saturday, November 23, 2024

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
నాడీ విజ్ఞానం - శరీరంలో గల సూక్ష్మ నాడులు.

📚🖊️ భట్టాచార్య

      మానవ శరీరంలో కోట్లాది నాడులలో, 72000 నాడులు ముఖ్యమైనవి. వాటిలో మరల మరికొన్ని నాడులు ముఖ్యమైనవి. కొద్ది కాలం క్రితం...ఇడా, పింగళా, సుషుమ్న నాడులపై కొంత అవగాహన ఇచ్చాను. అలాగే వజ్రా, చిత్రా నాడులపై కూడా మరికొంత అవగాహనను ఇచ్చాను. ఇవి కాకుండా మరి కొన్ని సూక్ష్మ నాడులపై అవగాహనను ఇస్తున్నాను. పఠించి, యోగ మహా విజ్ఞానాన్ని తెలుసుకోగలరు.

    నాడి అనగా ప్రవాహమని అర్థం. ఏ ప్రవాహము? చైతన్య ప్రవాహము. శక్తి ప్రవాహము. నాడులనేవి, కేవలం శరీరంలో ఉండే మాంసలమైన నాడులు కావు. అవి చైతన్యాన్ని, శరీరమంతా ప్రవహింజేసే శక్తి వాహినులు. ప్రాణ శక్తి, మనో శక్తి ఈ నాడీ వాహినులద్వారానే ప్రవహిస్తాయి. కొన్ని నాడులు మనోశక్తిని ప్రవహింపజేసే నాడులైతే, మరికొన్ని ప్రాణ శక్తిని, వైశ్విక చైతన్యాన్ని కూడా ప్రవహింపజేసే నాడులు.

1. గాంధారి నాడి : ఎడమ కన్ను యొక్క ఒక మూల నుండి, ఉదర ప్రాంతం వైపు ప్రవహిస్తూ, ఎడమ కాలి బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ నాడి, ఇడా నాడికి వెనుక వైపున ఉంటూ...కొన్ని పనులు చేస్తోంది. ఈ గాంధారి నాడి, శరీరం యొక్క క్రింది భాగాల నుండి...మనో శక్తిని...ఆజ్ఞా చక్రం వైపు తీసుకు వెళుతుంది. దీనియొక్క పరి పూరక నాడి "హస్తి జిహ్వ " నాడి.

2. హస్తి జిహ్వ నాడి : ఈ నాడి ఏనుగు నాలుక లాంటి స్వభావము గల నాడి. ఈ నాడి కుడి కన్ను యొక్క ఒక మూల నుండి ప్రారంభమై...నాభి ప్రాంతం వరకు ప్రవహిస్తూ, కుడి పాదము యొక్క బొటన వ్రేలి వద్ద అంతమౌతుంది. ఈ హస్తి జిహ్వ నాడి, శరీరము యొక్క క్రింది ప్రాంతాల నుండి మనో శక్తిని ఆజ్ఞా చక్రం వైపు తీసుకుని వెళ్తుంది. దీని యొక్క పరి పూరక నాడి గాంధారి నాడి. అంటే గాంధారి నాడి, హస్తి జిహ్వ నాడి ఒక దానికొకటి పరి పూరకాలు.

3. యశస్విని నాడి : యశస్విని నాడి అనే ఈ అద్భుతమైన నాడి....కుడి పాదం యొక్క బొటన వ్రేలు నుండి ప్రారంభమై...ఎడమ చెవి వద్ద అంతం అవుతుంది. ఈ యశస్విని నాడి యొక్క పరి పూరక నాడి "పూషా నాడి".

4. పూషా నాడి : ఈ పూషా నాడి పోష కర్త నాడి. ఈ నాడి పోషణ చేస్తుంది. ఈ నాడి ఎడమ కాలి బొటన వ్రేలు నుండి, నాభి వరకు వ్యాపిస్తూ...కుడి చెవి వద్ద అంతం అవుతుంది. దీని పరిపూరక నాడి "యశస్విని నాడి".

5. అలంబుస నాడి :  ఈ నాడి శక్తివంతమైన నాడి. ఈ నాడి మార్మికంగా ఉంటుంది. మనిషి యొక్క ముడ్డి ప్రాంతంలో ప్రారంభమై ...నాభి ద్వారా వెళుతూ...నోటి కుహరం వద్ద అంతం అవుతుంది.

6. కుహు నాడి : ఈ నాడి పున్నమి చంద్రుడు ఎంత శక్తివంతమైన వాడో...ఈ నాడి అంత శక్తి వంతమైనది. ఈ నాడి గొంతు వద్ద ప్రారంభమై...జననేంద్రియాల ప్రాంతంలో...అంతమౌతుంది. తంత్ర సాధనల్లో, ఉన్నతమైన లైంగిక శక్తి, బిందువు (శుక్రము)...ఈ జననేంద్రియ ప్రాంతం నుండి ఉత్పత్తి జరిగి, సోమ చక్రము వైపు ప్రవహిస్తుంది. అలా జరగడం వలన ఒక యోగి "ఊర్థ్వ రేతస్కుడు" అవుతున్నాడు. అంటే...లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మారుస్తున్నాడన్నమాట. అందుకే బ్రహ్మచర్య పాలన శ్రేయస్కరం అంటారు, యోగి జనులు. ఈ నాడి మల దోషాలను కూడా నియంత్రణ చేస్తుంది.

7. శంఖిణి నాడి : ఈ నాడి గొంతులో ప్రారంభమై...పురీషము యొక్క ప్రాంతంలో అంతం అవుతుంది. దీని శక్తి సరస్వతీ నాడి - గాంధారి నాడుల మధ్య ప్రవహిస్తుంది. అశ్వనీ ముద్రల సతత అభ్యాసం ద్వారా ఈ నాడిని చైతన్య వంతం చేయవచ్చును. ఈ నాడి, మనం తినే ఆహార సారాన్ని ప్రవహింపజేస్తుంది కూడా.....

8. సరస్వతి నాడి : సరస్వతి నాడి, మానవుడి నాలుకలో ఉంటుంది. ఎవరైననూ... చక్కగా భాషించేవారికి, మంచి పాండిత్యం గలవారికి ఈ సరస్వతి నాడి చైతన్యవంతంగా ఉంటుంది.

9. పయస్విని నాడి : ఈ పయస్విని నాడి, పూషా మరియూ సరస్వతి నాడులకు కుడి వైపున ప్రవహిస్తుంది. ఒకరకమైన యోగ మార్గంలో ఉన్న యోగులు, తమ చెవులకు పెద్దవైన చెవి పోగులు ధరించడం ద్వారా...ఈ పయస్విని నాడిని చైతన్యవంతం చేస్తారు.

10. విశ్వోదరి నాడి : ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల్ గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.

11. కౌశికి నాడి : ఈ నాడి రెండు పాదాల బొటన వ్రేళ్ళ వద్ద అంతం అవుతుంది.

12. కౌశికి నాడి : ఈ నాడి రెండు పాదాల బొటన వ్రేళ్ళ వద్ద అంతం అవుతుంది.

13. విశ్వోదరి నాడి : ఈ విశ్వోదరి నాడి నాభి ప్రాంతంలో వసిస్తూ ఉండి, కుహూ నాడి - హస్తి జిహ్వ నాడుల మధ్య ప్రవహిస్తుంది. ఇది అడ్రినల గ్రంథులతో సంబంధం కలిగియుంటుంది.

14. కూర్మ నాడి : ఈ నాడి శరీరానికి, మనస్సుకి మధ్య  సమన్వయం చేస్తూ...ఆయా సంబంధాలను స్థిరీకరిస్తుంది.

15. రాకా నాడి : ఈ నాడి ఆకలిని, దాహాన్ని కలిగిస్తూ, శ్లేష్మాన్ని  గ్రహిస్తుంది.

16. సురా నాడి : ఈ నాడి రెండు కను బొమల మధ్య ఉంటుంది.

17. వారుణి నాడి : ఈ వారుణీ నాడి కటి ప్రాంతం యొక్క క్రింది భాగంలో, కుహు నాడితో కలసి...ఈ ప్రాంతపు మల దోషాలను శుభ్రం చేస్తుంది. ఈ నాడి శరీరమంతా ప్రవహిస్తుంది. ఈ నాడి మూత్ర విసర్జనకు సహాయ పడుతుంది. ఇది ముడ్డి ప్రాంతంలో అంతం అవుతుంది. బస్తి మొదలగు క్రియల ద్వారా ఈ నాడి చైతన్యవంతం అవుతుంది. ఈ నాడి యశస్విని - కుహు నాడుల మధ్య ఉంటుంది.

18. విజ్ఞాన నాడి : ఈ నాడి చైతన్య ప్రవాహ నాడి.

19. పురీతతి నాడి : మనస్సు ఈ పురీతతి నాడిలో ప్రవేశిస్తే...మనిషి గాఢమైన నిద్ర పోతాడు.         

No comments:

Post a Comment