Wednesday, November 6, 2024

 *🍁కష్టాలు వచ్చాయని, దేవుడు పట్టించుకోవట్లేదని భగవంతుడిని నిందించేవారంతా తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్నలు 🍁:*
* భగవంతుడు ప్రపంచంలో కోటానుకోట్ల జీవరాసుల్ని, మానవుల్ని సృష్టించాడు. వారందరినీ పక్కనపెట్టి కేవలం నిన్నే పనికట్టుకొని పట్టించుకొనేంత ప్రత్యేకత నీలో ఏముంది?
* *నీకు నచ్చినట్టు ఎదుటివారు ఉండకపోవడం, నీకు నచ్చినట్టుగా పరిస్థితులు లేకపోవడానికి, కావాలనుకున్నవి దొరకకపోవడానికి కారణం దేవుడా? నువ్వా? ఐనా దేవుడు నీగురించే ఎందుకు ఆలోచించాలి? అడిగినవన్నీ ఎందుకివ్వాలి?
* *నీకు కావల్సినవన్నీ ఆయనను అడుగుతున్నావు, మరి ఆయనకు నచ్చేటట్టు కొంతైనా పవిత్రంగా,భక్తిగా,నిజాయితీగా,ఆయనపై పూర్తినమ్మకంతో ఉంటున్నావా?
* *నిన్ను పుట్టించినందుకు నీకేది కావాలనుకొంటే అది అందివ్వాలా? అది ఆయన బాధ్యతా? అయినా, అత్యున్నతమైన మానవజన్మ ఇచ్చాడు చాలదా?
*నీకు అడిగినవన్నీ వెంటనే ఇచ్చేసాడనుకో, ఇక భూమిపై నువ్వు చేసేదేముంది?
బంధుమిత్రులారా, అమిత శక్తిశాలి, అనంత ప్రేమామయుడూ ఐన పరమాత్మ మన స్వయంకృషికే సంతోషిస్తాడు. మనకి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎంత, ఏది కావాలో మనకంటే ఆయనకే ఎక్కువ తెలుసు. ఆయన మనజీవితంలో ఏది ఎలా జరగాలో ముందే నిర్ణయించిఉంచాడు. కనుక మీరనుకున్నది అవ్వలేదని దైవాన్ని నిందించకుండా, మీ ప్రయత్నం మీరుచేసి తద్వారా పరమాత్మకు ప్రీతిపాత్రులుకండి.🍁

    మీ
మురళీ మోహన్

No comments:

Post a Comment