Wednesday, November 6, 2024

 పాత బట్టలు కొంటాం - ప్లాస్టిక్ సామాను ఇస్తాం !
.
పిలుపు విని బాల్కనీ లో నుండి పిలిచింది సుందరి
.
ప్లాస్టిక్ సామాను తలమీద పెట్టుకున్న అతడు లోపలికి వచ్చి వరండాలో తన నెత్తిమీద ఉన్న మూటను దించాడు .
.
ఏమేమి ఉన్నాయి ? అడిగింది సుందరి
.
“బక్కెట్లు , బిందెలు , మగ్గులు , జల్లెడలు , చాటలు చాలా రకాలు ఉన్నాయండి . మీరు ఇచ్చే దాన్ని బట్టి మీకు ఏది కావాలో చెబితే అది ఇస్తానండి “ అన్నాడు అతను
.
.
లోపలికి వెళ్లి బీరువా తెరిచి రెండు చీరలు తీసుకు వచ్చింది . ఈ రెండు చీరలకీ ఏమిటిస్తావు ?
.
రెండు చీరలు అంటే ఏమొస్తుందండి? ఇంకో చీర కూడా ఇవ్వండి . ఈ బకెట్ తీసుకోండి .
.
అదేమిటయ్యా ? అలా అంటావూ ? ఒక్కొక్క చీర ఆరు వందలు పైన కొన్నాను . రెండే రెండు సార్లు కట్టుకున్నాను . ఇంకా కొత్తదనం కూడా పోలేదు వీటికి . పన్నెండు వందల రూపాయల చీరలు కి ఈ బకెట్ ఇవ్వవా ?
.
అమ్మా ! ఈ చీర మీరు కొన్న ఖరీదు ఎక్కువే ! కానీ నా దగ్గర వంద రూపాయలకి కూడా ఎవరూ కొనరమ్మా! ఇంకో చీర కూడా ఉంటె ఇవ్వండి . బకెట్ తీసుకోండి .
.
.
ఆ చీరలు ఇలాంటివి అనుకుంటున్నావయ్యా ? ఫారిన్ చీరలు .
.
నా దగ్గర ఎవరూ కొనరమ్మా
.
ఇలా బేరం సాగుతోంది . గుమ్మం లో ఎవరో ఒకామె . శరీరం లో కొంత భాగమే కప్పుతున్న చిరుగుల చీరతో కనబడింది .
.
కొంచెం లోపలికి వచ్చి “ అమ్మా ! కొంచెం అన్నం ఉంటె పెట్టరా “ అడిగింది .
.
ఆమె కట్టుకున్న చీర చిరుగులు కనబడకుండా ముడులు వేసి ఉంది . కుచ్చిళ్ళు పెట్టుకునేంత పొడవు లేదేమో చుట్టబెట్టినట్టు ఉంది . పమిట పూర్తిగా వెనక్కి తిరిగేంత పొడవు లేదేమో ... మెడకు ముడి వేసింది .
.
ఆమె వైపు చూడగానే జాలి వేసింది సుందరికి . ఉదయం భర్త ఉప్మా బాగోలేదని వదిలేశాడు అనే విషయం గుర్తుకు వచ్చింది . లోపలికి వెళ్లి ఆ ఉప్మా చిన్న పేపర్ ప్లేట్ లో పెట్టి ఆ అమ్మాయికి ఇచ్చింది . ఆమె వెళ్లి పోయింది .
.
“ఏమయ్యా ? ఎంతకీ తేల్చవేం? ఆ బకెట్ ఇస్తావా ? ఇవ్వవా ?”
.
తీసుకోండి అమ్మగారూ !
.
.
విజయగర్వంతో బకెట్ తీసుకుని రెండు చీరలూ ఇచ్చింది .
.
.
అతను గబగబా వాటిని బుట్టలో పెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు
.
.
బకెట్ ఇంట్లో పెట్టి నీళ్ళు పట్టింది సుందరి ఒక వేళ కారిపోతోందేమో చూద్దామని
.
.
అయ్యో తలుపు వెయ్యలేదు అనుకుంటూ వెనక్కు వచ్చి వీధిలోకి తోంగి చూసిన సుందరి అవాక్కయింది
.
.
అతడు ఆ బిచ్చగత్తెకు తన చీరను ఇస్తున్నాడు . ఆమె అతడి కాళ్ళకు నమస్కరిస్తోంది

No comments:

Post a Comment