ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు.. శ్రీరామ భక్త శ్రీ ఆంజనేయ స్వామి వారు , శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్ణేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు జన్మదినోత్సవాలు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నా ఆత్మీయులకు శుభాభినందనలు మరియు శుభాశీస్సులు తెలియచేస్తూ..💐*
_*మంచి మనసుతో చేసిన సాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికి వృధా కాదు..!!*_
_*కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి, అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతంగా కూడా చేస్తాయి,,*_
_*ఈ సమాజంలో నిజాయితీగా ఉన్న వాళ్ళకి న్యాయం జరగటం కొంచం సమయం పట్టవచ్చు, కానీ ఎప్పటికైనా నిజాయితీనే గెలుస్తుంది, గెలిచి తీరుతుంది,, ఇది సత్యం,,*_
_*ఒక ఆడపిల్ల జీవితంలో ఆదరించే అమ్మనాన్న అయినా ఉండాలి, లేదంటే ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి, లేకపోతే ఆ జీవితం నరకం తో సమానం అనేది గతం, నేడు పరిస్థితులు మారి ఆడవారు కూడ ఆర్థికంగా ఉన్నత స్థానం లో ఉంటూ.. తాము అబల కాదు సబలా అని నిరూపించుకుంటున్నారు*_
_*సంస్కారం ఉంటే.. సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగుతుంది, సంపదలు ఉండి సంస్కారం లేకపోతే బ్రతుకు వ్యర్థంగా మారుతుంది,,*_
......🖊️🤝💐
No comments:
Post a Comment