*_జీవితమంటేనే అనుభవాల పుట్ట. పడుతూ లేస్తూ చాలా నేర్చుకుంటాం..._*
*_మచ్చుకి కొన్ని... మన చుట్టూ మన వాళ్లే ఉన్నారని పొరబడడం... మనతో మాట్లాడే అందరూ మన మంచి కోరే వారే అని సంబరపడడం ప్రేమగా మాటలు చెబుతుంటే మురిసిపోవడం..._*
*_క్షణక్షణం విచారిస్తుంటే ధైర్యం చెప్పటం అప్పుడు మనకంటే అదృష్టవంతులు ఇంకెవరిని మనసుతో మాటిమాటికీ గర్వంగా చెప్పడం... కానీ,_*
*_మనకు తెలియనిది, తెలుసుకోలేనిది ఏంటంటే మనతో ఆవరసం ఉన్నంత వరకే ఇవన్నీ ఉంటాయి అనీ._*
*_అది తెలియక కలల గూడు కట్టుకుంటాం. మనతో అవసరం తీరాక జరిగే చిన్న చిన్న మార్పులకు మన మనసు పడే వేదన నరకం చూసీ చూడనట్టు చూపులు మనదే తప్పంటూ ప్రచారాలు._*
*_పలకరించడానికి సైతం పనికిరాని మనం పాపాత్ములైపోవడం... అందుకే... ఈ కలికాలంలో కలిసి ఉండి మోసపోవడం కంటే అలాంటి వారిని దూరం పెట్టడమే శ్రేయస్కరం._*
*_మనకు మనమే ఉన్నామంటూ ఒంటరిగా ఉంటూ పొగరుబోతుగా మిగిలిపోవడమే ఆనందం... కాబట్టి అలాంటివారితో తస్మాత్ జాగ్రత్త.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🌸🌸 🍃🙇♂️🍃 🌸🌸🌸
No comments:
Post a Comment