🙏2-11-2024-శనివారము- శుభమస్తు🙏
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
మనిషి తనను తాను గమనించుకోవటమే ఆధ్యాత్మికత. ఈ గమనికలో మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న అందరితో ఎలా వుంటున్నాము
అన్నది నిజాయితీగా చూసుకుంటూ - ఏమాత్రం కొంచెం చెడుగా వున్నా దానిని సరి చేసుకోవటమే సాధన. నేను - శరీరము అన్న పరిమిత భావన - స్వార్ధమై చెడుకు కారణం అవుతుంది.మనం బాధ పడటం - పక్కవారిని బాధ పెట్టడం రెండూ పరిమిత అహంకారం యొక్క భావనలే.............
మంచి అంటే అందరితో కలసిపోవటం - అంగీకరించటం - అర్ధం చేసుకోవటం - సర్దుకోవటం - సాయం చేయటం - క్షమించటం - భరించటం - అందరూ నాలాంటి వారే అన్న భావన విశాలమవ్వటం..........................
అంతరంగములో మంచి పెరుగుతూ వ్యాపిస్తుంది........................................
చెడు - స్వార్ధముతో ముడుచుకుపోతూ ఉంటుంది......................................
అనంతమువరకు విశాలమవ్వటమే ఆధ్యాత్మికత. అది అందరి మధ్య అనేక అవసరాల కొరకు ప్రయత్నిస్తూ - అందరితో కలసి మెలసి జీవిస్తేనే వస్తుంది. అందుకే ఈ శరీరం - జీవితం - బంధాలు, బాంధవ్యాలు - అవసరాలు - కోరికలు. జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో????? - ఇప్పుడే సరిగా జీవించు.ఏది ఎలా ఉన్నా నువ్వు మాత్రం మంచిగానే ఉండు . మంచి మొక్షానికి దారి. మోక్షం జీవిత అంతిమం.
🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹
29
19
divine planet - Designing lives with divinity.
23 hours ago (edited)
1 - 11 - 2024 - శుక్రవారము. శుభమస్తు🙏
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
జన్మించిన ప్రతి జీవి జీవించటం అనే ప్రక్రియలో సాగటమే జీవితము. అది తప్పనిసరిగా దానంతట అది జరిగే సహజ క్రియ. ఈ ప్రక్రియ - క్రియనే మొత్తముగా మనము సృష్టి, ప్రకృతి, విశ్వము అనే పేర్లతో పిలుచుకుంటున్నాము.మొత్తముగా ఈ వ్యవస్థ అంతా నిర్ధారించబడి సాగుతున్నది.
అందులోనే మనిషి అనే మనము కలిసి వున్నాము........................................
నిర్ధారించబడి సాగుతున్న ఈ వ్యవస్థలో మనిషికున్న ఏకైక స్వేచ్ఛ....................
మంచిగా ఉండటం - చెడ్డగా ఉండటం.....
అయితే ఇది సంపూర్ణ స్వేచ్ఛ కాదు, వీటికి కర్మ ఫలాలు వున్నాయి. కర్మ చేయటం - కర్మ ఫలాలు అనుభవించటమే జీవితం...........
ఇంతే... ఎలా జీవించినా సృష్టి వ్యవస్థలో , జీవిత ముగింపుతో సహా అన్నీ నిర్ధారించబడి వున్నవి .............................
ఈ లోపుగా - నేను, నావి, నావారు - అని
ఏర్పర్చుకున్న పరిమిత భావనల వ్యక్తిగత , కుటుంబ, సుఖ దుఃఖ భావనల జీవితము
ఎవరికి వారు తయారు చేసుకుంటున్న పరిమిత సృష్టి.......................................
ప్రకృతి, విశ్వము, సృష్టి అనే అనంతములో
మనము భావించుకుంటూ, తయారుచేసుకుంటున్న చిన్న సృష్టి - మన కుటుంబ జీవితము..............................
ఇక్కడ మంచితో జీవించేవారు - తెలిసో, తెలియకో మొత్తము విశ్వపు వ్యవస్థకు అనుగుణముగా సాగుతున్నవారు. అంటే నిర్ధారించబడి సాగుతున్న విశ్వ వ్యవస్థకు అనుకూలముగా కలిసి సాగుతున్నవారు.....
చెడు చేసే వారు - ఈ వ్యవస్థకు వ్యతిరేకముగా సాగుతున్నవారు...............
దాని పరిణామాలే దుఖాలు....................
వ్యతిరేకముగా సాగటం ఎన్నటికీ వీలుకాని విషయము అని సంపూర్ణముగా గ్రహించగలగటమే జ్ఞానము.ఈ జ్ఞాన ఎరుకతో మంచిగా జీవించటం ఆధ్యాత్మికత. అంటే విశ్వ నడకలో నడక కలిపి సాగటం...................................
కేవలం మంచిగా మాత్రమే జీవించటం విశ్వముతో కలిసిపోయి సాగే మోక్ష నడక. సంపూర్ణ జీవనముక్త జీవితపు నడక........
🙏🌹🌹🌹 god bless you 🌹🌹🌹🙏
72
52
divine planet - Designing lives with divinity.
3 days ago (edited)
30-10-2024-బుధవారము - శుభమస్తు..
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
జీవితము యొక్క నిజము ప్రస్తుతమే. ఇందులో గాఢ అనుభూతిని కలిగిస్తూ నేను అనిపించే శరీరముతోనే జీవించాలి అనేది నూటికి నూరుపాళ్ళు సత్యము వాస్తవము.
ఈ శరీరానికి అవసరమైన ధన సంపాదన - కుటుంబము అన్నీ అత్యవసరాలు..........
దేనిని అశ్రద్ధ చేయకూడదు. ధర్మముగా వీలైనంత స్వప్రయత్నముతో అన్నిరకములుగా సుఖముగా, సంతోషముగా, శాంతిగా జీవించే ప్రయత్నం ఎప్పుడు చేయాలి...............................
ఈ ప్రయత్నలోపాలు - అశ్రద్దలు - అడ్డదారులు - అధర్మాలు మనను, మన కుటుంబాన్ని ఇబ్బందుల వైపు నెడతాయి..
ఇలా ఇబ్బంది, బాధ, దుఃఖము, భయము, అశాంతి లేకుండా జీవించటానికి అనువైన విషయాలను, అనేక విధములుగా విడమరచి మనుషులకు చెప్పే ప్రయత్నం అనుభవశీలురైన మనుషులే చేసారు.....
ఆ ప్రయత్నమే జ్ఞానము............
ఈ జ్ఞానానుభవములో - శరీరమునకు ఆధారముగా శక్తి వున్నది అన్న సత్యాన్ని అనుభూతి చెంది - మరల ఆ జ్ఞానాన్నిఅనేక రకాలుగా సామాన్య మనిషికి అర్ధమయ్యేలా తెలియచేసే ప్రయత్నం చేశారు.......
ఆ ప్రయత్నమే ఆధ్యాత్మికము.................
ఎన్ని రకాలుగా ఎంత మంది ఎన్ని చెప్పినా - మనము ఎన్ని రకాలుగా వాటిని తెలుసుకొని,అర్ధం చేసుకొని, ఆచరించే ప్రయత్నం చేస్తున్నా అది శరీరముతోనే - ఇప్పుడే,ఇక్కడే,ఈ జీవితములోనే చేయాలి.
దీనినే సాధన అన్నారు.....................
జ్ఞానము,ఆధ్యాత్మికత, సాధన జీవితానికి భిన్నమైనవి కావు......................
నిత్య జీవితములోనే ప్రతి విషయములో వీటిని ఉపయోగిస్తూ - కుటుంబ జీవితం సక్రమముగా శరీరము ఉన్నంత వరకు జీవించాలి.................................
దీనినే తపస్సు అంటారు..................
ఇలా అందరితో, అందరి మధ్యలో సంతోషముగా, శాంతిగా జీవించగలిగితే
వారిని జీవన్ముక్తులు అంటారు....
ఇదే మోక్షము.......................
ఇదే ఒక మనిషి చేరగలిగిన, పొందగలిగిన అంతిమ స్థితి.............................
ఇక్కడితో జీవితపు ఆట పూర్తి అవుతుంది.
ఆట ఎలా ఆడుతారు అన్నది - ఎవరిష్టం వారిది. ఎవరి ఆట వారిది...
🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹
No comments:
Post a Comment