Saturday, November 2, 2024

 🙏2-11-2024-శనివారము- శుభమస్తు🙏
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹 మనిషి తనను తాను గమనించుకోవటమే ఆధ్యాత్మికత. ఈ గమనికలో మన ప్రవర్తన మన చుట్టూ ఉన్న అందరితో ఎలా వుంటున్నాము అన్నది నిజాయితీగా చూసుకుంటూ - ఏమాత్రం కొంచెం చెడుగా వున్నా దానిని సరి చేసుకోవటమే సాధన. నేను - శరీరము అన్న పరిమిత భావన - స్వార్ధమై చెడుకు కారణం అవుతుంది.మనం బాధ పడటం - పక్కవారిని బాధ పెట్టడం రెండూ పరిమిత అహంకారం యొక్క భావనలే............. మంచి అంటే అందరితో కలసిపోవటం - అంగీకరించటం - అర్ధం చేసుకోవటం - సర్దుకోవటం - సాయం చేయటం - క్షమించటం - భరించటం - అందరూ నాలాంటి వారే అన్న భావన విశాలమవ్వటం.......................... అంతరంగములో మంచి పెరుగుతూ వ్యాపిస్తుంది........................................ చెడు - స్వార్ధముతో ముడుచుకుపోతూ ఉంటుంది...................................... అనంతమువరకు విశాలమవ్వటమే ఆధ్యాత్మికత. అది అందరి మధ్య అనేక అవసరాల కొరకు ప్రయత్నిస్తూ - అందరితో కలసి మెలసి జీవిస్తేనే వస్తుంది. అందుకే ఈ శరీరం - జీవితం - బంధాలు, బాంధవ్యాలు - అవసరాలు - కోరికలు. జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో????? - ఇప్పుడే సరిగా జీవించు.ఏది ఎలా ఉన్నా నువ్వు మాత్రం మంచిగానే ఉండు . మంచి మొక్షానికి దారి. మోక్షం జీవిత అంతిమం. 🌹🌹🌹🌹 god bless you 🌹🌹🌹🌹

No comments:

Post a Comment