Saturday, April 12, 2025

 *_మార్కులు, ర్యాంకులు తేవడం వేరు - తెలివితేటలు వేరు_*
*!!!!!!!!!!!🤪😜!!!!!!!!!!!*

*ఇంటర్ లో 99% మార్కులు తెచ్చుకుని, ఐ.ఐ.టి ఢిల్లీలో సీట్ కొట్టి.....,*
*ఆ జిల్లాలోనే తెలివైన కుర్రోడిగా పేరు తెచ్చుకున్నాడు సుందరం కొడుకు. ఆ తర్వాత ఎక్కడికన్నా టూర్ తీసుకెళ్లమని వాళ్ళ నాన్నతో ఒకటే గోల.*

*కొడుకు బాధ పడలేక ఎక్కడకి తీసుకెళ్ళాలో  చెప్పమన్నాడు సుందరం.* 

*"మంచి చలికాలం.. ఒక రాత్రిపూట లంబసింగిలో టెంట్ వేసుకుని పడుకుంటే, ఎంతో బాగుంటుందట" అన్నాడా అబ్బాయి.* 

*అనుకున్న విధంగానే టెంట్ ఒకటి కొన్నారు. శనివారం ఉదయం బయలుదేరి సాయంత్రానికి లంబసింగి చేరుకున్నారు. అక్కడ వెతికి వెతికి మంచి ప్లేస్ ఒకటి పట్టుకుని, టెంటు వేసుకుని పడుకున్నారు ఆ తండ్రీ కొడుకులు.* 
*
*
*మంచి నిద్రలో ఉండగా మధ్య రాత్రిలో   కొడుకుని లేపి ఆకాశంలోకి చూడమన్నాడు సుందరం.* 

*కప్పుకున్న రగ్గు ముఖంమీద వరకూ తొలగించి, పైకి చూశాడు కొడుకు......* 

*"ఏమి  కనపడుతుందిరా?" అడిగాడు సుందరం.* 

*"నక్షత్రాలు!" అన్నాడు కొడుకు.*

*"అవి చూస్తూంటే... నీకేం అర్ధం అయింది" అనడిగాడు సుందరం.* 
*"జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే శుక్రుడు మకరరాశిలోకి వెళ్తున్నాడు.* 

*జీవ శాస్త్రం ప్రకారం చూస్తే జీవం ఉన్న ఏకైక గ్రహం మీద మనమున్నాం.* 

*అంతరిక్ష శాస్త్రం ప్రకారం చూస్తే ఈ విశ్వము అనంతమైనది.* 

*భౌతిక శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుడు తన గురుత్వాకర్షణ శక్తితో భూమిని, దాని మీద ఉన్న మనల్ని తిప్పుకుంటున్నాడు.* 

*రసాయన శాస్త్రం ప్రకారం చూస్తే, ఈ విశ్వములో ఉదజని 99 శాతం ఉంది" అన్నాడా కొడుకు.*

*ఇంతలా అడుగుతున్నావు, _"ఇంతకీ నీకేమర్థమయింది నాన్నా?"_ అనడిగాడా అబ్బాయి,*
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
*"మన టెంట్ ఎవడో దొబ్బుకెళ్ళాడ్రా నిద్రమోహమోడా-"* 
*అని తిట్టాడాయన ఐ.ఐ.టి లో సీట్ తెచ్చుకున్న కొడుకుని.* 😌

*అందుకే చెప్పేది....*
*కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, లోకజ్ఞానం కూడా నేర్పండి అని...*
*పాత కథే అయినా మళ్లీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి కథనం.*
*^^^^^^^^^^^^^^^^^^^^^*
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు 🙏}_*
_______🌹🪷🌹_______

No comments:

Post a Comment