*ఒక రోజు క్లాస్ లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి ఈ రోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది.*
*(ఆ అమ్మాయికి పెళ్లి అయి ఆరు నెలల కొడుకు ఉన్నాడు)*
*నీ లైఫ్ లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డ్ మీద రాయమని చెప్పింది లెక్చరర్.*
*తను ఫ్యామిలీ మెంబర్లు.. బంధువులు.. స్నేహితుల పేర్లను వ్రాసింది.*
*వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని ముగ్గురు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్.*
*తను బోర్డ్ పైన వ్రాసిన వాటిలో ముగ్గురు స్నేహితుల పేర్లను తుడిచివేసింది.*
*నీ లైఫ్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5గురి పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్.*
*తను ఐదుగురు బంధువుల పేర్లను తుడిచివేసింది.*
*అలా చెరుపుకుంటు పోగా చివరకు బోర్డ్ మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ నలుగురి పేర్లు మిగిలాయి.*
*క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.*
*ఇది ఆట కాదని అపుడు అర్దయింది అందరికి.*
*ఇపుడు మరో రెండు పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్..*
*ఇది చాలా కష్టమైన పని అని తనకు అర్థమైంది..*
*చాలా బాధ పడుతూ అమ్మా, నాన్నల పేర్లను చెరిపింది తను.*
*మిగిలిన రెండింటిలో మరోకటి చెరపమని చెప్పింది లెక్చరర్.*
*తనకు కళ్ళవెంట నీళ్లు కారసాగాయి.. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకు పేరును చెరిపింది ఏడుస్తూ..*
*వెళ్లి నీ సీట్ లో కూర్చోమని చెప్పింది లెక్చరర్..*
*తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది..*
*నీకు జన్మనిచ్చిన తల్లి దండ్రులను కాదని.. నువు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, బయటి వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు..?*
*క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది..*
*తను ఏమి చెపుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరు.*
*తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది..*
*ఎదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు.. చదువు కానివ్వండి బిజినెస్ కానివ్వండి ఎదో ఒకరకంగా నా కొడుకు కూడా నాకు దూరమవ్వక తప్పదు.*
*కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే...*
No comments:
Post a Comment