Friday, April 25, 2025

****#ఆమె.! (ఇప్పటికే భర్తలయిన నాలాంటివాళ్లకోసం, ఇంకా భర్తలు కావాల్సిన మీలాంటివాళ్లకోసం ఇది.)

 #ఆమె.!
(ఇప్పటికే భర్తలయిన నాలాంటివాళ్లకోసం, 
ఇంకా భర్తలు కావాల్సిన మీలాంటివాళ్లకోసం ఇది.)

*ఖుషీ పాటలో ఆమె అడిగింది,
పసిఫిక్ సాగరం ఈదుతావా?
ఎవరెస్టు ఎక్కిస్తావా ?అని,
అందుకోసం నువ్వు 
స్వర్గాన్ని సృష్టిచేసి, 
కైలాసాన్ని దించక్కర్లేదు.
ఎందుకంటే ఆమెఅవి అడగదు,
నువ్వివి ఇవ్వలేవు.

*ఆమె వండితే, నువ్వు తోము,
ఆమె ఉతికితే, నువ్వు మడతెట్టు,
*ఆమె తుడిస్తే, నువ్వు తడిగుడ్డపెట్టు,
ఆమె పెడితే, నువ్వు తిని బాగుందని ఒక మాటను,
నువ్వు తినేముందు, ఆమెని తిన్నావా అని అడుగు.
*రొక్కం పది ఉంటే రోజాకొను,
అదే పదిలక్షలుంటే పసిడి కొను,
ఆమెకి రెండూ ఇష్టమే,

*ఆమె అలసిపోతే కాళ్లు పట్టు,
అలక వస్తే కన్నీళ్లు తుడు,
ఆమెకివింకా ఇష్టం.

*ఆమెకోసం ఏదైనా నేర్చుకో,
దాన్నొక సర్ప్రైజ్గా ఇచ్చుకో.
ఆమె కోపం వెనక కారణం తెల్సుకో,
చెప్పలేదని మిన్నకుండటం మానుకో.

*కండఉందని ఆమెని కొట్టేవు,
ఆ కండలవెనక నీ గుండె ఒక బండయ్యేను,

*నాలుకుందని ఆమెని తిట్టేవు,
నరకానికది ద్వారం తెరిచేను.
నీకోరిక తీర్చేందుకు ఆమె లేదు,
అదే కోరిక తీరినాక ఆమెని పక్కకి తొయ్యకు,

*అడిగి ముందడుగువెయ్యు,
మురిపెం పంచి ముద్దించు.
మంచం ఇద్దరిదీ అని మదిలో ఉంచు.

*ఆమెకున్న, ఆమెకి నువ్విచ్చిన గౌరవం నీకు నువ్విచ్చుకునేది,
నీకున్నది, నువ్వెప్పుడూ పిలవనిది ఆమె తగిలించుకోవాల్సిన 

*అవసరం లేనిది నీ ఇంటిపేరు,
ఆమె అస్తిత్వమే, నీ పేరు ప్రతిష్ట,
ఆమె స్వేచ్ఛే, నీ స్వాతంత్ర్యం. 

*ఆమె తెచ్చుకున్న రూపాయి నీదనుకోకు,
ఇస్తే కాదనకు, 
కాదంటే ఇంకెవ్వరికీ ఇవ్వకు,
అడిగి తీసుకుంటే మళ్లీ ఇచ్చెయ్యి,

*అర్థం, అర్ధం రెండూ ఆమే అని గుర్తించు.
కుచ్చిళ్లు సర్దు,
కుర్చీలు సర్దు,
చెవి దిద్దులు మెచ్చు,
చేతిసాయం పంచు.

❤❤❤❤❤❤❤

No comments:

Post a Comment