టీ టైం.. ఇద్దరు.. -- రజనీకాంత్ versus కమల్ హాసన్ ---- 1) రజనీకాంత్(75) అసలు పేరు శివాజీరావు గైక్వాడ్.. కర్నాటకలో స్థిరపడ్డ మహరాష్ట్రియన్.. -- కమల్ హాసన్ (71) అసలుపేరు పార్థసారథి శ్రీనివాసన్.. స్సస్థలం పరంకుడి (తమిళనాడు).. 2) రజనీ మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్ధి.. తొలిచిత్రం అపూర్వ రాగంగళ్.. పరిచయం చేసిన దర్శకుడు కె బాలచందర్.. ఏడు భాషల్లో నటించిన చిత్రాల సంఖ్య 140 పైచిలుకు.. -- కమల్ నాలుగేళ్ల వయసులో బాలనటుడిగా రంగప్రవేశం.. హీరోగా తొలి చిత్రం అరంగేట్రం.. నటించిన చిత్రాల సంఖ్య 222.. 3) ఆసియాలో జాకీచాన్ తరువాత అత్యంత అధిక పారితోషికం (28 కోట్లు-2007) తీసుకున్న నటుడిగా రజనీకాంత్ పేరు నమోదు.. -- ఐదు భారతీయ భాషలలో నటించి 24 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న తొలి భారతీయ నటుడిగా కమల్ హాసన్ పేరు నమోదు.. కోటి రూపాయలు పారితోషికం (1994) అందుకున్న తొలి భారతీయ నటుడిగా మరో రికార్డు.. 4) గుప్త దానాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే నటుడు రజనీ.. -- మద్రాసు మెడికల్ కాలేజీకి తన అవయవాల దానం ప్రకటించిన నటుడు కమల్.. 5) మితభాషి, ఓ పట్టాన అర్ధంకాని వ్యక్తిత్వం రజనీ ది.. మీడియా ఇంటర్వ్యూ లకు దూరం.. -- వెంటనే స్పందించే నైజం, మీడియాకి అందుబాటులో ఉండే నటుడు కమల్.. షేక్స్పియర్ కోట్స్ అస్తమానం ఉదహరించే నైజం.. 6) రజనీకాంత్ కి దేవుడిపై నమ్మకం జాస్తి.. ఆధ్యాత్మిక ఆలోచనలు మెండు.. అమర్ జ్యోతి మహరాజ్ ఫాలోయర్.. -- కమల్ హాసన్ నాస్తికుడు.. 7) రజనీకాంత్ ఫైట్స్ లలో నెంబర్ వన్.. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ.. -- కమల్ హాసన్ నృత్యాలు డాన్సులలో నెంబర్ వన్.. లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ.. ఇక ఇద్దరిలో కామన్ అంశాలు.. ఇద్దరూ తమ తమ పేరెంట్స్ కి నాలుగవ సంతానంగా జన్మించారు.. -- ఇద్దరూ కె బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన నటులే.. ఇద్దరూ మాంసాహారులే.. ఇద్దరికీ ఇద్దరేసి కుమార్తెలే.. ఐశ్వర్య సౌందర్య & శృతి అక్షర.. -- వీరి సినిమాలు నేను చూసింది తక్కువే.. నాకు నచ్చిన రజనీకాంత్ సినిమా.. అంతులేని కథ.. కమల్ హాసన్ సినిమాలలో నాకు బాగా నచ్చిన చిత్రం.. భామనే సత్యభామనే.. ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
No comments:
Post a Comment