*విశాఖపట్నం రఘు కాలేజ్ జరిగిన సంఘటన ఆధారంగా*
ఆ పిల్ల చేసినదానిలో ఎంతమాత్రం తప్పులేదు.
నేను సమర్దిస్తున్నాను.
తప్పు వారి తల్లిదండ్రులదే.
*ఆ పిల్లలో ఆవేశాన్ని గమనించండి.*
*తన యొక్క ప్రైవసీ జోలికి వస్తే చంపేస్తుంది అది తల్లికావచ్చు తండ్రి కావచ్చు గురువు లేదా భర్త.ఒక వ్యక్తి ప్రైవసీని ఎప్పుడు కోరుకుంటాడు*. తనకి ఇంటిలో కావలసిన ప్రేమ దొరకనప్పుడు ఒంటరితనంని ఆశ్రయిస్తాడు. జాలి పక్కవారి ఓదార్పులనుంచి ఇతరులనుంచి ప్రేమని ఆశించవచ్చు.
*ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ లేకపోవడం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు లేదా పని ఒత్తిడి లేదా ఆర్దిక ఒత్తీడిలో ఉండడం. కారణాలు ఏమైనా కావచ్చు.*
పిల్లలతో మాపట్లాడేటంత తీరుబడి నేటి తల్లిదండ్రులకు లేదు. ప్రేమని దాని వ్యక్తీకరణనీ కూడా డబ్బుతోనే కొలుస్తున్నారు. నేను మా అమ్మాయి కి లక్ష రూపాయల ఫోను ఇచ్చాను అంటున్నారు కాని మా అమ్మాయి తో గంట కాలాన్ని ఆనందంతో గడిపామనడంలేదు.
ఈ వీడియోని వైరల్ చేయడం ద్వారా వారిలో మరియు ఇతరులలో మరింత ఆవేశపూరిత లక్షణాలకి ప్రోత్సహించేవాల్లమే అవుతున్నాం కాని అట్టి పరిస్ధతి రానివ్వకుండా ఆపడానికి ఎవరూ ప్రయత్నిఝచలేదు. వీడియో మీదే ఆసక్తి.
మంచిని చూపే వీడియోలకి వైరల్ తక్కువ.
No comments:
Post a Comment