Friday, April 25, 2025

****ఆకారం చూసి మోసపోకుమా

 శ్లో!! కాకః కృష్ణః పికః కృ‌ష్ణః
       కో భేదః పికకాకయోః !
        వసంతకాలే సంప్రాప్తే
         కాకః కాకః పికః పికః !!

తా!! : కాకి, కోయిల రెండూ నల్లగానే ఉంటాయి. వీటి రెండిటికీ తేడా ఏమిటి? వసంతకాలం వచ్చినప్పుడు కాకి కాకే కోయిల కోయిలే!

వ్యాఖ్య: ఆకారాన్ని బట్టి ఎవరి ప్రజ్ఞ అంచనా వేయలేము. సందర్భం వచ్చినప్పుడు వాళ్ల ప్రతిభ బయట పడుతుంది. కేవలం చూడటానికి ఎర్రగా బుర్రగా ఉన్నారని (ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో)  స్నేహం చేయకూడదు. బాహ్య సౌందర్యం కంటే ప్రవర్తన, మంచి మనస్సు లాంటి అంతర్ సౌందర్యం మాత్రమే గొప్పదని ఈ శ్లోకం సందేశం. వేమన చెప్పినట్లు ఉప్పూ, కర్పూరం ఒక్కలాగే ఉన్నా, రుచిని బట్టి తేడా తెలుస్తుంది. అలాగే వసంతకాలంలో కాకేదో, కోయిలేదో సులభంగా తెలుస్తుంది. నిజమైన స్నేహితుని స్వభావం మన కష్టకాలంలోనే  తేటతెల్లమవుతుంది. ప్రత్యేకించి ఈ ఆధునిక యుగంలో అంతర్జాల మాయాజాలం (ఫేస్బుక్, వాట్సాప్) పరిచయాలు ఎంత నిజమో తెలిసేలోపలే ఎన్నో విలువైనవి కోల్పోతున్నారు. హంస, కొంగ తెల్లగా ఉన్నా - పాలు నీరు విడదీసే ప్రతిభ ఒక్క హంసకు మాత్రమే ఉంటుంది.
"ఆకారం చూసి మోసపోకుమా"

             💐 శుభదినం 💐

No comments:

Post a Comment