Friday, April 25, 2025

 *ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు.*
*ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు..*

*ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది,*
*జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది,*
*భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు...*

*ఇద్దరూ ఆలోచిస్తున్నారు,*
*ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు.*
*వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది..*

*తరగతిలో పిల్లలకి ఈ కధ చెప్తున్న ఉపాధ్యాయురాలు కధ చెప్పటం ఇక్కడ ఆపేసింది.*

*పిల్లలూ,  ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లలని ప్రశ్నించింది, టీచర్.*

*పిల్లలు ఒకేసారి చెప్పారు, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను, అని ఉండచ్చు టీచర్ అన్నారు.*

*ఒక బాబు మౌనంగా కూర్చుని ఉన్నాడు,*
*టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేమి చెబుతావు అని.*

*ఆ బాబు చెప్పాడు, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి, అని చెప్పి ఉంటుంది అన్నాడు.* 

*టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం, నీకు ఈ కధ ముందే తెలుసా, అని అడిగింది.*

*బాబు తల అడ్డంగా ఊపాడు, లేదు, నాకు ఈ కధ తెలీదు, మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది, మన బాబు జాగ్రత్త అని.. అన్నాడు.*

*ఈ సారి టీచర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఈ కధలో భార్య కూడా ఇదే చెప్పింది, నీ సమాధానం సరి అయినది అని చెప్పింది టీచర్.*

*ఇహ కధ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతురిని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ, బాగా చదివించి, పెళ్ళి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒక రోజు కన్ను మూసాడు.*

*తండ్రి వస్తువులని ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువులు సర్దుతోంది.*

*తండ్రి డైరీ కనపడింది, అందులో రాసుకున్నాడు,* 
*భార్యకు చెప్పుకుంటున్నట్టు,*

*నీతోపాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళ కిందే నీతోనే ఎప్పటికీ  ఉండిపోవాలి అనిపించింది, కానీ మనమ్మాయిని ఎవరు చూసుకుంటారు, నిన్ను బతికిద్దామనుకుంటే, నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్ లో ఉంది, ఎలానూ నువ్వు మ రణం అంచుల్లో ఉన్నావు..*

*మరి మనమ్మాయికి ఎవరు తోడు.అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనపడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేసాను. మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్ధం అవుతుంది, అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు...*

*పైపైన ఏదో చూసి ఎప్పుడూ ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు,  ఎవరు ఏంటీ అని, మనకి తెలియని లోతులు చాలా ఉండచ్చు వారి జీవితాల్లో. ఎప్పుడూ తొందరపడి ఏ మనిషినీ నిందించకూడదు..అనుమానించకూడదుఅవమానించకూడదు...*

No comments:

Post a Comment