*పేగు బంధం, కడుపు తీపి.*💕
*ఈ రెండూ అమ్మకి దేవుడు ఇచ్చిన ప్రసాదాలు. ఆ ప్రసాదం ఎంత తీపిగా ఉంటుందో ఆ కడుపుకే తెలుసు. ఆ బంధం విలువ ఎంత లోతైనదో ఆ మనసుకే తెలుసు.*
*రెండు దశాబ్దాలపాటు పెంచిన తండ్రికి గానీ, అరవై డెబ్భై సంవత్సరాల సహచరునకు గానీ, తెలియని, తెలుసుకోలేని రెండు స్త్రీ గుణాలు.*
*ఇంట్లో అందరూ తృప్తిగా భోజనం చేస్తే తన కడుపు నిండినట్టే. ఏ పదార్థమైనా రుచిగా అనిపించి మారు అడిగితే అంతులేని సంతోషం.*
*పిల్లలు చేసింది తిన్నారో లేదో అని బెంగ. ఈ తాపత్రయం ఎందుకో గానీ కాలగమనంలో పిల్లలు గుర్తించడం లేదు. ఆ కడుపు తీపి ఆవేదనను గమనించడం లేదు.*
*"పిల్లల కనగానే తీరేనా స్త్రీ విధి, ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా" అన్నారు కవి శ్రీ సముద్రాల జూనియర్.*
*మరి ప్రేమను గుర్తించక, తల్లి మనసు తెలుసుకోక విస్మరించే పిల్లల్ని ఎలా రచించాలో?*
*"కూరిమి గల వారంతా కొడుకులేనురా, జాలి గుండె లేని కొడుకు కన్నా కుక్క మేలురా" అని అనుకోవాలా?"*
*ఏమో మరి.*🙆♂️
No comments:
Post a Comment