Friday, April 25, 2025

 *నిన్న కాశ్మీర్ లో జరిగిన ప్రమాద సంఘటన తర్వాత చిన్ననాటి మిత్రుడు  శ్రీనివాస్ కాల్ చేసి టీవీ చూసావా రా.. ఎంత ఘోరంగా ఉందో..  ఐడెంటి కార్డు చూసి మరీ కాల్చారట.. ఐడెంటి కార్డు లేనివారికి ప్యాంటు మరీ చూసి కాల్చారు అంట..  ఏంటి రా ఈ ఘోరం ఏం చేస్తున్నారు మీ ఆర్ఎస్ఎస్ వాళ్లు అని అడిగాడు.*

*దీనికి నేను ,  ఒరేయ్ ఆర్ఎస్ఎస్ వాళ్లకీ దీనికి సంబంధం ఏంటి రా అని అడిగాను.*
 
*నువ్వు ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ గురించి చెప్తావు, హిందువుని కాపాడిది ఆర్ఎస్ఎస్ అంటావు, మరి ఇక్కడ ఏం చేశారు అని  అడుగుతున్నాను అన్నాడు.*

*ఒక్కసారి నాకు మండి ఏరా ఆర్ఎస్ఎస్ ఏమన్నా హిందువులను  కాపాడాలని కాంట్రాక్ట్ తీసుకున్నదా  అనడుగుతూ,  ఆర్ఎస్ఎస్ ఏమి ఉద్యోగం కాదు అది ఒక బాధ్యత.   బాధ్యతగల పౌరులు ఆర్ఎస్ఎస్ లో చేరి  హిందూ జాగృతి చేస్తారు, అంతేకానీ కర్రలు పట్టుకొని గన్స్ పట్టుకొని రోడ్డు మీద తిరగరు.  ఆ పని చేసినందుకు వారికీ జీతాలు ఉండవు, వారు చేసే పనితో పాటు, రోజుకో గంట, వారానికి రెండు గంటలు సమయాన్ని హిందూ జాగృతి కోసం పనిచేస్తారు.*

*వాళ్లేం పని పాట లేని వాళ్ళు కాదు వాళ్ళకి కుటుంబాలు, ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ఉన్నాయి.  అయినా కూడా హిందూ దేశభక్తి మీద, వారానికి కొంత సమయం ఇస్తారు.*

*ఎప్పుడు చూసినా గుడికి పోవాలి, తిరుపతి పోవాలి, యాదగిరిగుట్ట పోవాలి. ఈ గుడికి డొనేషన్ ఇచ్చా,  ఆ గుడికి డొనేషన్ ఇచ్చా అని చెబుతావ్ కదా.  ఇదివరకు కూడా రాజులు హిందువులు మొత్తం గుళ్లను వజ్రాలు వైడూర్యాలు తో నింపి గుళ్ళని బ్రహ్మాండంగా చేశారు.*
*ఆ సంపదనంతా మొగల్  రాజులూ వచ్చి పగలగొట్టి తీసుకుపోయారు. మనం ఇప్పుడు ఇచ్చే విరాళాలతో గుడి బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాము. కానీ ఒక ౨౦, 30 ఏళ్ళకి ఆ  గుళ్లన్నీ మళ్ళీ పగలు కొట్టి మన ఆస్తులన్నీ దొబ్బేస్తారు. ఇది గమనించవా..*

*నీకు ఎన్నిసార్లు ఆర్ఎస్ఎస్ మీటింగ్ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.  కానీ నువ్వు ఎప్పుడు చూసినా నాకు షాప్ ఉంది, షాప్ ఎట్లా నడుపుకోవాలి, గుడికి పోవాలి,  పెళ్ళికి పోవాలి అంటావు.*

*అరే హిందువులని బంగ్లాదేశ్ లో చంపుతున్నారు రా ఖమ్మంలో ఒక ర్యాలీ తీస్తున్నారు, రా వచ్చి పార్టిసిపేట్ చేయండిరా అంటే రారు.*
*బెంగాల్లో హిందువులు చంపేస్తున్నారు ధర్నా చేద్దాం రండిరా అంటే రారు, మన షాప్ మనకు ముఖ్యం. వాట్సాప్ మెసేజ్ లు మాత్రం ఫార్వర్డ్ చేస్తాం అంటారు.*

*గ్రూపులో ఎప్పుడైనా హిందువుల గురించి మెసేజ్ పెడితే కనీసం దాని మీద మీ రియాక్షన్ పెట్టడానికే భయపడతారు. ఇక ఫార్వర్డ్ ఎం చేస్తారు.*
*ఏం బతుకు రా నీది గ్రూప్ లో థమ్స్ అప్ పెట్టడానికి భయపడతారు.*
*నువ్వు రాలేవు, బయటికి తిరగలేవు కానీ చేసే వారికైనా సహాయం చేసావా..*
*ఒక్కసారి ఒక జెండా ఇచ్చావా..   గుడికి మాత్రం 5000 ఇస్తావ్ 10,000 ఇస్తావ్.*
*హిందువుల కార్యక్రమం అంటే 500 ఇవ్వడానికి నానా తిప్పలు నీకు అన్ని ఖర్చులు గుర్తుకొస్తాయి.*

*అరే నీకు చెప్తున్నాను గుళ్ళు ఉండాలంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, బజరంగ్దళ్ లాంటి సంస్థలుంటేనే రేపొద్దున నీకు గుడి, నీ ఇల్లు నీ కుటుంబం ఉండేది . హైదరాబాదులో ఎన్ని గుళ్ళు ధ్వంసం చేస్తున్నారో చూస్తున్నావా .. తమిళనాడులో ఎన్ని  గుళ్లో ధ్వంసం చేస్తున్నారో తెలుసా..*

*నీకు ఈ దేశం మీద ప్రేమ కాదు, నీ కుటుంబం , ఆస్తులు , ప్రాణాలు ఉండాలంటే ఈ మూడు పనులు చెయ్..* 

*1) నెలకు ఒకసారి ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం కి వెళ్ళు* 

*2) గుళ్ళు గోపురాలు పూజలకిచ్చే విరాళాలలో ఒక 50% హిందువుల కోసం పోరాడే సంస్థలకు ఇవ్వు.*

*3) ఎవరు ఏమనుకుంటారు అని భయపడకుండా బెంగాల్ ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది కనీసం ఎవరైనా గ్రూపులో హిందువులపై అరాచకం పోస్ట్ చేస్తే దాన్ని గుర్తుంచు బాధను వ్యక్తం చెయ్.*

*ఇట్లు*
*ఒక హిందూ..*

No comments:

Post a Comment