🌹 *భయం వర్సెస్ ధైర్యం*🌹
భయం నీ హృదయాన్ని గుడ్డిగా భయపడతుంది!
ధైర్యం నీ మనస్సును వెలిగిస్తుంది!!
భయం నీన్ను ఒంటరిగా వదిలేస్తుంది!
ధైర్యం అందరితో కలుపుతుంది!!
భయం గతపు నీడల్లో నిన్ను బంధిస్తుంది!
ధైర్యం వర్తమానంలో నీకు ఆశలు నింపుతుంది!!
భయం నీలోని సృజనాత్మకతను నాశనం చేస్తుంది!
ధైర్యం కొత్త ఆలోచనలకు మార్గం చూపుతుంది!!
భయం నీ ఆరోగ్యంలో విషంగా మారుతుంది!
ధైర్యం నీకు ఆరోగ్యకరమైన జీవితం అందిస్తుంది!!
భయం నీ లక్ష్యాలను చేరుకోవడంలో నీకు అడ్డంకి అవుతుంది!
ధైర్యం విజయాల గమ్యానికి నడిపిస్తుంది!!
భయం జీవితానుభవాలను పరిమితం చేస్తుంది!
ధైర్యం కొత్త ప్రపంచాలను ఆహ్వానిస్తుంది!!
భయం ఒక నాశనకరమైన మాయగా నీలో చేరుతుంది!
ధైర్యం ఒక అద్భుతమైన మార్గదర్శకంగా నిలుస్తుంది!!
భయానికి దూరంగా! ధైర్యంతో ముందుకు సాగండి!!
జీవితాన్ని సంపూర్ణంగా ఆనందించండి!
🌹©Dr. SKM🌹
నేటిసుభాషితమ్.
వృశ్చికస్య విషం పుచ్ఛం
మక్షికస్య విషం శిరః
తక్షకస్య విషం దంష్ట్రా
సర్వాంగం దుర్జనే విషం
తేలుకు తోక విషం. ఈగకు తల విషం. పాముకు కోర విషం. దుష్టుడికి శరీరమంతా విషమే.
No comments:
Post a Comment