*"భ్రమలకు కారణం ఏమిటి ? వాటి నుండి ఎలా బయటపడాలి ?"*
*దేహాభావనే భ్రమలకు కారణం. మనిషికి ఈ దేహ భావన, కోరికలు తగ్గటానికి సద్గుణ సంపద అవసరం. ఎన్ని జపాలు, కర్మకాండలు చేసినా మంచి గుణాలు అలవడనిదే ఆధ్యాత్మికత ఫలించదు. మనసుకు దేహభావన తగ్గితేనే తన సహజ స్వరూపమైన దైవాన్ని bతెలుసుకోగలుగుతుంది. అదే పరమాత్మ.*
*ఒకప్పుడు దూరంగా నీటిని చూసిన జ్ఞాపకం వల్లనే ఎడారిలో ఎండమావులు మనల్ని మోసం చేయగలుగుతున్నాయి. అలాగే సుఖ సంతోషాలనే జ్ఞాపకాలు మన జీవితంలో ఎన్నో ఎండమావులను సృష్టిస్తున్నాయి. ఒకనాటి భ్రమ (నిజం) మరొక్కప్పటి భ్రమకు కారణమవుతుంది. కానీ సత్యం ఏనాడు భ్రమను కలిగించదు.*
*మన శరీరంలో జరిగే మార్పులు నిజం అయితే, మారని ఆత్మ ఉనికి సత్యం. నాదమే దాని స్వరూపం. నాదం అంటే అక్షరాలులేని శబ్దం. అదే మనం సర్వత్రా వినే "ఓంకారం"!!*
*┈┉┅━❀꧁ ||ఓమ్|| ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️
No comments:
Post a Comment