[4/25, 08:25] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
వగువకు గడిచిన దానికి
బొగడకు దుర్మతులనెపుడు పొసగని పనికై
యెగి దీనత నొందకుమీ
తగ దైవగతిం బొసంగు ధరను కుమారా !
*భావం :*
ఓ కుమారా ! అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు. దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేక పోతినని చింతించుట పనికి రాదు. భగవంతుడు యిచ్చిన దానితో తృప్తి చెందుము.
*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*
[4/25, 08:25] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*మంచిగా మాట్లాడితే అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.*
[4/25, 08:25] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు*
ఎన్నో బరువు బాధ్యతలు మోసే వారిని చూసి ఎదుటివారు తేలికగా తీసుకునే సందర్భంలో ఈ సామెత వాడతాం. కావిడి మోసే వాడికే దాని బరువు తెలిసినట్లు బాధ్యతలని మోసేవాడికే వాటి బరువు తెలుస్తుంది. చూసేవాడికి అది అనుభవంలోకి రాదు.
[4/25, 08:25] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*అధఃపాతాళానికి చేరటం*
దిగజారిపోవడం, పతనమవ్వటం అనే అర్ధాలలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పాతాళం ఎక్కడో అడుగున ఉంటుంది. అంత అట్టడుగుకు చేరటమంటే ఇక కనిపించకుండా పోవటమనే ఓ భావన ఉంది. ఎంతో గొప్పగా, ఉన్నతంగా ఉండాల్సినవారు తప్పులుచేసి నైతికంగా విలువను కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయ ప్రయోగం కనుపిస్తుంది. "నిన్నటి ఆయన ప్రవర్తన ఆయనను అధఃపాతాళానికి చేర్చింది" అనేలాంటి సందర్భాల్లో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
[4/25, 08:25] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*
*తెలుగు పూల జల్లు*
రచన: మహేంద్రాడ సింహాచలా చార్య (స్కూల్ అసిస్టెంట్ తెలుగు), ప్ర.ఉ.పా, టెక్కలి.
తెలుగులోని తియ్యదనం
తెలుగు నేల సనాతనం
తేట తెనుగు మనకు వరం
తెలుగే మన మూల ధనం
తెలుగు భాష మనకు శ్వాస
తెలుగు మాట మణి పూస
తెలుగు వెలుగు మనకు రక్ష
తెలుగే పెదబాలశిక్ష
తెలుగు తల్లి కల్పవల్ లి
తెలుగు మనకి అమృత వల్లి
తెలుగు భాష పూల జల్లు
తెలుగే ఒక హరివిల్లు
తొలి కవి 'నన్నయ్య ' తెలుగు
'అన్నమయ్య ' పాట తెలుగు
'వేమన ' పద్యం తెలుగు
'ఎంకి ' పాటె అచ్చ తెనుగు
'విశ్వనాధ' కవిత తెనుగు
'కందుకూరి ' చేవ తెలుగు
'గురజాడ ' ముత్యాల తెలుగు
'శ్రీ శ్రీ ' భావాగ్ని తెలుగు
యుగ యుగాల తెలుగు నింపు
తెలుగు మాటలెల్ల కలుపు
అమృత భాష మన తెలుగు
తెలుగే మన కాది వెలుగు
తేనె తెలుగు పలుకరింపు
తెలుగు నుడల పోహళింపు
తెలుగు జగతి వెలుగు నింపు
తెలుగే మన కీర్తి నిలుపు
No comments:
Post a Comment