Saturday, April 12, 2025

 *విశ్వ సూక్తి దర్శనం అక్షరాలు* Dt.12-04-2025.

       *ఎండ్ బర్క్* :

* మూర్ఖత్వానికీ, అమాయకత్వానికీ నడుమ వివేకానికి గొంతు పూడుకు పోతుంది.

* ఎంతటి కాళరాత్రిలోనైనా గంటకి వుండేది అరవై నిముషాలే. కనుక మనసు చతికిలబడకూడదు.

* ప్రపంచంలో నాయకులు రెండురకాలుగా వుంటుంటారు. మొదటి రకం నాయకులు నిజమైన నాయకులు. రెండవరకం నాయకులు నాయకుల్లా నటించి చెలామణీ అయ్యేవారు. నిజమైన నాయకులు భవిష్యత్తుని గూర్చిన ప్రణాళిక తయారుచేస్తుంటే, నకిలీనాయకులు వర్తమానాన్ని కొలుస్తుంటారు. ఆ నకిలీ నాయకులు ఏరోజు కారోజు జీవిస్తూ, సిద్ధాంతాలకోసం కాక చెలామణీ అవడం కోసం పాకులాడుతుంటారు. అయితే, అసలు నాయకులు మాత్రం సిద్ధాంతాలకి జీవం పోయడానికి, చరిత్రపుటల్లో శాశ్వతమైన స్థానాన్ని సముపార్జించుకోవడానికీ నిండుమనసుతో కృషి చేస్తుంటారు.

No comments:

Post a Comment