Sunday, September 27, 2026

 365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో

♥️ కథ-117 ♥️

సైకిల్, కారు, రైలు లేదా విమానం, మనం ప్రయాణించే ప్రతి వాహనానికి బ్రేకులు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా?


బ్రేకులు

ఒకసారి ఫిజిక్స్ క్లాస్‌ లో టీచర్ విద్యార్థులను,“మన కారులో బ్రేకులు ఎందుకు ఉంటాయి?” అని అడిగాడు.
ఒక విద్యార్థి లేచి, "సార్, అవి కారుని ఆపడానికి సహాయపడతాయి", అన్నాడు.
"వేగాన్ని తగ్గించడానికి, వేగాన్ని నియంత్రించడానికి ’ అని మరో విద్యార్థి బదులిచ్చాడు.
ఇంకొకరు, "ఒకటికొకటి గుద్దుకోకుండా ఆపడానికి" అన్నాడు.
వెనువెంటనే, అవే సమాధానాలు అందరూ చెప్పడం  ప్రారంభించారు. 

అందువల్ల, టీచర్ ఆ ప్రశ్నకు స్వయంగా తానే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ముఖం మీద చిరునవ్వుతో, " సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. అయితే, ఇదంతా మనం చూసే విధానంలో ఉంటుందని అనుకుంటున్నాను! నా ఉద్దేశ్యం ప్రకారం, మనం వేగంగా డ్రైవ్ చేయడానికి వీలు కల్పించటానికే కారులో బ్రేకులు ఉన్నాయి!".

 క్లాస్ లో నిశ్శబ్దం ఆవరించింది. ఈ సమాధానాన్ని ఎవరూ ఊహించలేదు.

టీచర్ ఇలా చెప్పాడు, " కారులో బ్రేకులు లేవని కాసేపు అనుకుందాం. ఇప్పుడు కారును నేను ఎంత వేగంగా నడపగలను?" 
"బ్రేకుల కారణంగానే మనం వేగం పెంచగలం, వేగంగా వెళ్ళగలం, మనం కోరుకున్న గమ్యస్థానాలను చేరుకోగలం!"
క్లాసులోని విద్యార్థులంతా ఆలోచనలో పడ్డారు. వారు ఇంతకు ముందు 'బ్రేక్స్' ని ఈ దృష్టికోణంలో చూడలేదు.

దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం!

జీవితంలో, మనల్ని నిరుత్సాహపరిచే, అవరోధం కల్గించే అనేక బ్రేక్‌ లను మనం చూస్తాం. మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సలహాదారులు, స్నేహితులు, జీవితంలో మనం చేసే పురోగతిని, వెళ్లే దిశను లేదా తీసుకునే నిర్ణయాలను ప్రశ్నిస్తారు.
వారి ప్రశ్నలతో పాటుగా, మనం ఎదుర్కొనే క్లిష్ట జీవిత పరిస్థితులు - ఇవన్నీ మన వేగాన్ని నిరోధించే "బ్రేకులు" గా మనం గమనించవచ్చు.

కానీ వీటన్నిటినీ - మన కార్యసాధనాలుగా, లేదా మనలని ప్రేరేపించే వాటిగా, ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొని, తెగించి ముందుకెళ్లడానికి వీలు కల్పించే సాధనాలుగా, అదే సమయంలో మనల్ని మనం రక్షించుకునేలా సహాయపడేవాటిగా - మనం గ్రహించినట్లయితే? 

ఎందుకంటే, ఒక్కొక్కసారి కొంతదూరం ఒకేసారి ముందుకు వెళ్లవలసినప్పుడు, ఒక అడుగు వెనక్కి వేయాల్సిరావచ్చు లేదా మనం ఆగాల్సివస్తుంది!

ఇలాంటి ప్రశ్నలు, పరిస్థితుల కారణంగానే (పీరియాడికల్ బ్రేక్‌లు, మళ్ళీ, మళ్ళీ వచ్చే ఆటంకాలు) మనం ఈ రోజు మనంఉన్న చోటికి చేరుకోగలిగాం.

జీవితంలో ఈ 'బ్రేకులు' లేకుండా, మనం జారిపోవచ్చు, మన దిశను కోల్పోవచ్చు లేదా దురదృష్టకరమైన ప్రమాదాలను ఎదుర్కోవచ్చు.

బ్రేక్‌ లు మనలని వెనక్కిలాగడానికి లేదా చిక్కులలో కట్టిపడేయడానికి ఉద్దేశించినవి కావు. బదులుగా, మునుపటి కంటే వేగంగా వెళ్లడానికి మనకి సహకరించడానికి మాత్రమే ఉన్నాయి.తద్వారా మన గమ్యాన్ని సురక్షితంగా, త్వరగా చేరుకోవడానికి సహాయపడతాయి!  

మన జీవితంలోని బ్రేక్‌ ల యెడల మనం కృతజ్ఞతతో ఉన్నామా లేదా వాటిని మన పనికి అడ్డంకులుగా మాత్రమే చూస్తున్నామా?

                 ♾️

 జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, మీరు మునుపటి కంటే బలంగా తయారవుతారు. 🌼
దాజీ


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

HFN Story team

No comments:

Post a Comment