Sunday, September 27, 2026

🦚జ్ఞానప్రసూనాలు🚩

1) ఇదొక లీల ఇదొక ఆట"ఇది గుర్తుంటే జీవితం వేదాంతమయం.ఇది మరిస్తే జీవితం వేదనామయం.

2) కనురెప్పకు..కనుగ్రుడ్డుకు మధ్య ఉన్న దూరం ఎంతో తనకు దైవానికి మధ్య ఉన్న దూరం కూడా అంతే.

3) దైవసంకల్పం అనేది స్వప్రయత్నం యొక్క ఫలితమే అన్నట్లు అనిపిస్తుందే గాని నిజానికి దైవసంకల్పాను సారంగానే స్వప్రయత్నం జరుగుతుంది.

4) నిశ్చలంగా ఉంటే జీవుడైనా దేవుడే.చలిస్తే దేవుడైనా జీవుడే.

5) .నేను చేశాను అనకు. దైవ దృష్టిలో అంతకన్నా పెద్ద అపరాధము ఉండదు.

No comments:

Post a Comment