Tuesday, October 14, 2025

 #శిష్య శుద్ధి *  సూక్తులు*

1.
విమానం మానసం త్యక్త్వా,
విరక్తః శిష్యతాం వ్రజేత్।
తపోభిర్ధర్మమార్గేణ,
గురోః పాదం నివేశయేత్॥

భావార్థం:
తన గర్వాన్ని వదిలి, విరక్తతతో శిష్యత్వాన్ని కోరాలి. తపస్సు మరియు ధర్మ మార్గం ద్వారా గురువు పాదాన్ని చేరాలి.

2.
న మాలా న తిలో గంధః,
శిష్యత్వే కారణం భవేత్।
వినయః శాంతి భావశ్చ,
సద్గురు సన్నిధౌ స్థితిః॥

భావార్థం:
శిష్యత్వానికి మాలలు, తిలకాలు కారణం కావు. వినయం, శాంతమైన ఆత్మభావం, గురువు సన్నిధిలో ఉండటం మాత్రమే శిష్యుని లక్షణాలు.

3.
మౌనంగా నిలిపే యోగః,
మనోనిగ్రహ శోభితః।
శిష్యో యః స్వమనః శుద్ధః,
సః లభేత్ గురోః కృపాం॥

భావార్థం:
మౌనంలో నిలిచే యోగి, తన మనస్సును జయించినవాడే శుద్ధుడవుతాడు. అలాంటి శిష్యునికే గురువు అనుగ్రహిస్తాడు.ఆదిత్యయోగీ.

4.
కర్ణోపదేశ మాత్రేణ,
న సిద్ధిః శిష్య సంభవా।
యః తత్త్వం జీవయేన్నిత్యం,
స ఏవ శిష్య ఉచ్యతే॥

భావార్థం:
కేవలం చెవులకే ఉపదేశం వినడం వల్ల శిష్యుని సిద్ధి కలగదు. తత్త్వాన్ని తన జీవితంలో నిత్యం ఆచరిస్తేనే శిష్యుడు అవుతాడు.

5.
న ధర్మో బాహ్య రూపేణ,
న తత్త్వం పుస్తకాంతరే।
యదా హృదయమాశుద్ధం,
తదా బాహ్యం న శోభతే॥

భావార్థం:
బాహ్యంగా చేసే ఆచారాలే ధర్మం కాదు. పుస్తకాల్లో చదివినదే తత్త్వం కాదు. హృదయం అశుద్ధంగా ఉన్నప్పుడు బయట ఏది చేసినా అది శోభించదు..*


No comments:

Post a Comment