ఓం నమో భగవతే శ్రీ రమణాయ
ఒకరోజు సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో మహర్షి బల్లమీద కూర్చుని ఉండగా, దూరంగా ఉన్న మర్రిచెట్టు దగ్గర నుండి కోతులు అరుపులు వినబడ్డాయి. మహర్షి చప్పున ఆ చెట్టు దగ్గరకు వెళ్లారు. ఒక సేవకుడు కూడా మహర్షితోపాటు వెళ్ళాడు.
ఆ చెట్టు కొమ్మమీద సుమారు పాతిక కోతులు; వాటి మధ్యలో భుజాలపైన కోతి పిల్లని పెట్టుకొని ఒక ముసలి కోతి ఉన్నాయి.
మహర్షి తిన్నగా ఆ ముసలి కోతి దగ్గిరకి వెళ్లారు. అది ఏమేమో చెపుతోంది. మహర్షి శ్రద్ధగా వింటూ జాలిగా మారిన వదనంతో కంటివెంట కన్నీరు కారుస్తూ, ఆర్తినిండిన స్వరంతో "తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు. ఈ వయసులో ఈ బిడ్డను నీవు పెంచాల్సి వచ్చింది. జాగ్రత్తగా సాకు. ఇది నీకు పుణ్యం" అంటూ ఆ ముసలి కోతిని లాలించారు మహర్షి.
ప్రక్కనున్న సేవకునికి ఇవేమీ అర్థంకాక చూస్తున్నాడు. మహర్షి అతని వంక తిరిగి ఇలా సెలవిచ్చారు .....
నీకు తెలిసిందా! దీని వింత? ఆ కోతి పిల్లకు తల్లి చచ్చిపోయింది. కోతుల సంప్రదాయం ఏమిటంటే, తల్లి లేని పిల్లను ఆ జట్టులోని పెద్దకోతి పెంచాలి. ఇది కట్టుబాటు. ఇప్పుడీ పిల్లను పెంచే భారం మన ముసలితాత కోతిపై పడింది. ఆ కష్టం చెప్పుకోవడానికి వీరు యీ సంధ్య చీకట్లో వచ్చారు.
No comments:
Post a Comment