Tuesday, October 14, 2025

 *_నేటి మాట_*

*"భగవంతునికి మనలని దూరం చేసే త్రిగుణాలు - వాటి స్వభావాలు మనపైన ఎలా ఉంటాయి ???"*

*"సత్త్వగుణం"*
అహింస, పరుల ధనం పట్ల కోరిక లేకపోవడం, కోపం లేకపోవడం, గురు శుశ్రూష చేయటం, శౌచం (దేహ శుద్ధి), మనోశుద్ధి కలిగి ఉండటం, సంతోషం, సత్య మార్గం, దైవం పట్ల, వేదాల పట్ల నమ్మకం కలిగి ఉండటం, ఇతరులకు అపకారం చేయక పోవడం, పరస్త్రీల పట్ల మాతృభావం కలిగి ఉండటం సత్త్వగుణ లక్షణాలు.

*"రజోగుణం"*
నేనే కర్తను, నేనే భోక్తను, నేనే వాచాలకుడను, నేను అభిమానం గలవాడను, నాకే అన్నీ తెలుసు అనేవి రాజస ప్రవృత్తి గల వారి లక్షణాలు.

*"తమోగుణం"*
నిద్ర, సోమరితనం, మోహం, ఆశ, దొంగతనం, తామస ప్రవృత్తి గల వారి లక్షణాలు, దీని శక్తిని ఆవరణ శక్తి అంటారు.
దీని వల్ల ఒకే విధంగా ఉండే వస్తువు గాని, మనిషి గాని ఇంకో విధంగా కనిపిస్తారు. 
ఇదే సంసారానికి మూల కారణం, తమో గుణం చేత కప్పబడిన వారు ఎంతటి బుద్ధిమంతుడైనా, విద్వాంసుడైనా, నేర్పరియైనా విషయాన్ని సరిగ్గా గ్రహించలేరు. తమో గుణం ఒక రకమైన భ్రమను కల్పిస్తుంది. 
దాని వల్ల తనకు కనిపించిందే, తెలిసిందే నిజం అనుకుంటారు.

           *_🌸శుభమస్తు🌸_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

No comments:

Post a Comment