A97. మంచి వింటున్నా మార్పు ఎందుకు రావటము లేదు ???
Author Name:adhyatmika chaduvu-study of true self
Youtube Channel Url:https://www.youtube.com/@atmaadhyayanam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f9XmNUXtlQo
Transcript:
(00:01) శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు మన శ్రోతలలో ఒక సోదరుడు 40 సంవత్సరముల నుండి మేము మతములను గురువులను దైవ మార్గములను సాధనలను అనుసరిస్తూ చేస్తున్న ఎందుకు మారలేకపోతున్నాము నేను అలాగే ఉన్నాను నా కుటుంబ సభ్యులు అలాగే ఉన్నారు మేము అనుసరిస్తున్న మార్గంలో నేను చూస్తున్నటువంటి నా చుట్టూ ఉన్న భక్త సమూహంలోని మనుషులు అలాగే ఉన్నారు మాలో సద్గుణ మార్పు ఎందుకు కలగలేదు గుణమార్పు ఎందుకు రాలేదు మేము 40 సంవత్సరాల నుంచి దైవ మార్గాలలో గురు మార్గాలలో
(00:45) సాగుతున్నాము కదా అని వారు వారి పర్సనల్ గా అనేక విషయాలు తెలియజేశారు అదంతా కూడా 1874వ శీర్షిక డివైన్ ప్లాన్ ఛానల్లో నిన్న చెప్పుకోవడం జరిగింది. అయితే అందులో ఆ శీర్షికను కొంతవరకు కొన్ని కారణాలు అంటే కొన్ని విధానాలుగా చెప్పుకోవడం జరిగింది. ఇంకా ఇలా మనం మారలేకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి కూడా తెలుసుకుంటూ ఉండాలి.
(01:18) ఎందుకంటే ఆధ్యాత్మికత ఏదో వినేసి మారిపోతాం వినంగానే వచ్చేసింది అనుకునేదంతా భ్రమ మాత్రమే అనంత ఆత్మ శక్తి అనేటువంటి సబ్జెక్ట్ లో ఆత్మ ఎరుకను అంటే నా ప్రాణశక్తే ఆత్మ అంటే నాకు భిన్నమైనది కాదు ముందు ఆ విషయం తెలుసుకోండి నేను శరీరము నేను మనసు నేను ప్రాణశక్తి బ్రతికి ఉన్నటువంటి ప్రతి మనిషిలో ప్రాణశక్తి ఉంది. నా ప్రాణ శక్తిని నేను తెలుసుకోవడమే నా సంపూర్ణత్వం దానినే ఆత్మ శక్తి అని పిలిచారు దాన్నే మోక్షము అన్నారు.
(01:53) ఈ మోక్ష స్థితి ఏదిఉందో నా ప్రాణ శక్తిని నేను తెలుసుకోవడం నా ఆత్మ శక్తిని నేను తెలుసుకోవడం అనేది ఏదిఉందో దీని గురించి ఆత్మజ్ఞాన చదువున అందిస్తూ ఆధ్యాత్మిక చదువున అందిస్తూ అనేక ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించినటువంటి మహనీయులు మహాత్ములు అనేక సాధన పద్ధతులు వివరించినటువంటి మహాత్ములు మహనీయులు అనేక గ్రంథాల ద్వారా అందించిన ఒక సత్యం ఏంటంటే కోటాను కోట్లలో అంటే దీన్ని అనేకమంది వింటారు అనేకమంది చదువుతారు అనేకమంది తెలుసుకుంటారు ఇటువంటి వాళ్ళల్లో కోటాను కోట్ల మందిలో ధీరులైన ఏ ఒక్కరు పొందగలరు వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు
(02:35) మిగిలిన వారు వింటారు సాగుతూ ఉంటారు అర్థమైంది అనుకుంటూ ఉంటారు తప్ప ఆ అనుభవాన్ని పొందలేరు. ఏ అనుభవం నా ప్రాణ అంటే ఈ శరీరము నేనుని ఒక అనుభవం ఉంది నిక్కచ్చిగా ఉంది ఈ శరీరం నేనని అనుభవంగా ఉంది అలాగే మనసు అనుభవంగా ఉంది సుఖ దుఃఖాలు భావాలు భావోద్వేగాలు అనుభవంగా ఉన్నాయి అలా ప్రాణశక్తి అనుభవంగా అవ్వాలి.
(03:02) ఆ అనుభవాన్ని పొందటమే ఇప్పుడు ప్రాణశక్తి మనలో లేదా ఉంది అనుభవం తెలియదు శరీరం లాగా అనుభవంగా లేదు మనసులాగా అనుభవంగా లేదు. అలా అనుభవం అవ్వాలి ఉన్నదని ప్రాణం పోతే చనిపోయాడు మనిషి అన్న విషయంలో ప్రాణం ఉన్నదని అనుకుంటున్నాను తప్ప అనుభవంగా లేదు అలా అనుభవం అవ్వాలి అది నా సంపూర్ణత అది నా స్థితి నా మూడవ స్థితి నా పూర్ణ స్థితి నా సంపూర్ణమైన ప్రాణశక్తి స్థితిలోనే నా మనోస్థితి ఉంది నా శరీర స్థితి ఉంది ఈ రెండు స్థితులు మనోస్థితి శరీర స్థితి అసలు ఉండటానికి కారణమే ప్రాణశక్తి స్థితి కానీ ఆ స్థితి నాకు తెలియదు ఆస్తి స్థితి నాకు అనుభవంగా తెలియడమే మోక్షము ఆత్మ సాక్షాత్కారము
(03:46) సెల్ఫ్ రియలైజేషన్ బ్రహ్మము అనంత ఆత్మ శక్తి దైవశక్తి విశ్వ శక్తి సృష్టి శక్తి ప్రకృతి శక్తి ఇదంతా అనుభవంగా తెలుసు అది తెలియటమే సరే ఈలోపుగా అది తెలిసేలోపుగా శరీరపరంగా జీవిస్తున్నాం గనుక మనోపరంగా జీవిస్తున్నాం గనుక మనో శరీరాల కలయకతో ప్రాపంచిక జీవితం ఉంటుంది గనుక మనుషులందరూ మంచిగానే ఉండాలి. ఒక దోమ మనిషిని కుట్టి బతుకుతుంది అనుకోండి దోమకు నేను చెడు చేస్తున్నాను అని తెలియదు ఎందుకని అంటే దోమ మనిషిలో ఉన్న రక్తాన్ని పీల్చుకుంటది అది దాని ఆహారం అది దాని ఆహారం అంతే అలా చీమలు కుట్టిన ఏదైనా జంతువులు మనమీద మనక ఏదైనా అపకారం
(04:32) అంటే మనకు అపకారం అనుకుంటాం వాటికి తెలియదు అలా తలపెట్టిన వాటి స్వభావ రీచ వాటి అవసర రీచ్య వెలజేస్తున్నాయి కానీ ఒక దోమ కుట్టినట్టు ఒక చేమ కుట్టినట్టు ఒక పాము కరిసినట్టు ఒక క్రూర జంతువు ఇంకొక సాధు జంతువు మీద పడి తినేసినట్టు జంతువులు కుక్కలు కుక్కలు పోట్లాడుకున్నట్టు మనుషులు అలా ప్రవర్తించకూడదు మనిషి మనిషిని బాధ పెట్టకూడదు మనిషి దోమను కొట్టినట్టు ఇంకొక మనిషి ఇంకొకని గిల్లకూడదు గిచ్చకూడదు లేదా పాము కరిసినట్టు హాని చేయకూడదు జంతువులు కాట్లాడుకున్నట్టు పోట్లాడుకున్నట్టు మనిషి మనిషితో ఉండకూడదు మనిషి మనిషితో ఉండకపోవడమే కాదు అనవసరంగా
(05:15) జంతువులతో కూడా ఉండకూడదు ఉద్దేశపూర్వకంగా జంతువులతో కూడా ఉండకూడదు అవసరార్థం తన జీవన అవసరార్థం ఏదో ఇల్లు తుడుచుకుంటున్నప్పుడు ఇల్లు ఉడుచుకుంటున్నప్పుడు లేదా పడుకుంటానికి ఆలవట్లో పెట్టుకున్నప్పుడు తన రక్షణ కోసం రక్షణ చర్యలలో ఇతర జంతువులకు ఏదైనా ఇతర జీవులక ఏదైనా హాని జరగొచ్చేమో తప్ప ఉద్దేశపూర్వకంగా జంతువులకు కూడా హాని చేయకూడదు చెట్టు పుట్ట చామకు కూడా చేయకూడదు అసలు అసలు మనుషులకి అసలు చేయకూడదు ఎందుకంటే మానవలోక ధర్మాలు ఉన్నాయి.
(05:47) ఎందుకు చేయకూడదు అంటే మిగిలిన వాటికి వాటి జీవనాధారం దోమ జీవనాధారం మనిషిని కుట్టి బ్రతకడం మనిషిని ఎలా కుట్టిందో అది ఒక ఆకు మీద వాలి ఆకులో రసాన్ని కూడా అలాగే పీల్చుకుంటది. అది బ్రతకడానికి చేస్తున్న చర్య. మనుషులు ఇంకో మనిషిని పీక్కు తినడానికి ఏమి లేదు అది బ్రతికే చర్య కాదు అసలు. అలా చేయకూడదు. మనిషికి ఆ జ్ఞానం ఉంది మన మానవ జాతి అంతా ఒకటే అందుకని మనిషి మంచివాడుగా బతకాలి బతికినంత కాలం మంచివాడుగానే బతకాలి మరి అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం సోదరుడు అడిగిందే కంటిన్యూ చేస్తున్నాం 1874వ శీర్షిక డివైన్ ప్లానెట్ లో నిన్ను ఎవరు మార్చలేరు
(06:31) నిన్ను మార్చుకోగలిగినది నువ్వే ఆ శీర్షిక పేరు అది దానికి దానికి కంటిన్యూటీగా ఈ శర్షికి మళ్ళీ చెప్పుకుంటున్నాం అయితే ఇది ఆధ్యాత్మిక ఛానల్ లో వస్తది రెండు ఛానల్స్ మనయ సహజంగా రోజు వినేవాళ్ళందరూ ఇది ఫాలో అవుతూ ఉంటారు తెలుస్తది. ఇది ఆధ్యాత్మిక చదువు అనే ఛానల్ లో వస్తది శీర్షిక. ఇప్పుడు ఆ కంటిన్యూటీ శీర్షిక ఇది ఎందుకు మారలేకపోతున్నాము అన్నప్పుడు ముందు మంచిగా బతకాలి అంతే కానీ మంచిగా ఎందుకు బతకలేకపోతున్నాం చెడుగా ఎందుకు బతుకుతున్నాం చెడు నుంచి మంచిగా ఎందుకు మారలేకపోతున్నాం అన్నప్పుడు స్వార్థపూరితమైనటువంటి అంటే నా శరీరము నేను నేను నాది నావాళ్ళు
(07:12) నా కుటుంబము ఈ భావనల్లో ఎరుక్కుపోయినప్పుడు ఒక జంతు ప్రవృత్తే ఉంటది అంటే ఒక దోమకి మనిషిని కుట్టి రక్తం తాగుతున్నప్పుడు నేను మనిషిని కుడుతున్నాను అనేది అనుకోవట్లే దానికి ఆహారం దొరికింది అనుకుంటుంది అంటే చెట్టుని కూడా అలాగే కొడుతుంది అది అలా ఇతర జంతువులు ఏవైనా కావాలని కాదు వాటి జీవన సరళలో అడ్డం వచ్చినప్పుడు మనుషు ఏదో ప్రమాదం కలుగుతుంది జంతువుల వలన అలాగే సామాన్యముగా ఏమి ఆలోచించనటువంటి మనిషి స్వార్ధపూరిత ప్రవృత్తిలో నాకు కావాలి అనుకున్నప్పుడు నేను బ్రతకాలి అనుకున్నప్పుడు నేను నాది నావాళ్ళు జీవితం అనుకున్నప్పుడు ఇతర
(07:51) మనిషికి ఇబ్బంది కలగ చేసేస్తాడు జంతు ప్రవృత్తి వస్తది. సహజ జంతు ప్రవృత్తి మనిషిలో ఉంటది అలాగే ప్రవర్తించేస్తాడు ఎందుకని మనిషి కూడా ఒక జంతువే మనిషి జంతువుల కంటే ఉత్తమ జంతువు అంతే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు అంటే జంతువులలో నరుడు అనేటువంటి జంతువుగా పుట్టడం అసాధ్యం అన్నారు జంతువునాం జంతువులన్నింటిలో నరజన్మ దుర్లభం నరుడు అనేటువంటి జంతువుగా జన్మ రావడం దుర్లభము అన్నారు అంటే జంతువులన్నింటిలో హైయెస్ట్ జ్ఞ జ్ఞానం కలిగినటువంటి ఉత్తమ జంతువు మనిషి ఆ జ్ఞానాన్ని వినియోగించకుండా నేను నా శరీరం అనుకున్నప్పుడు నా శారీరక అవసరాలకు దోన ఎలా కొడుతుందో చీమ ఎలా
(08:36) కొడుతుందో అవసరాలకు జంతువులన్నీ ఎలా ప్రయత్నించుకుంటున్నాయో ఏదైనా ఆహారం దొరికితే ఒక కుక్క ఇంకో కుక్క మీద దాడి చేసి దాన్ని తరిమేసి ఆహారం తనే తినాలని ఎలా అనుకుంటదో పక్షులు ఏదైనా ఆహారం దొరుకుతున్నప్పుడు మిగిలిన పక్షులన్నీ ఆహారం ఉన్న పక్షి మీద ఎలా దాడి చేస్తాయో అది అజంతు ప్రవృత్తులు అలా ఒక క్రూర జంతువు సాధు జంతువుని చంపి ఎలా తింటదో అలా మనుషులందరూ కూడా జ్ఞానాన్ని వినియోగించినప్పుడు సహజ శరీర ప్రవృత్తిలో ఇతర మనుషులకు హాని చేస్తూ ఉంటారు.
(09:12) కానీ మనిషిలో జ్ఞానం ఉంది తప్పు ఒప్పు తెలుసు ఎవరికీ వాళ్ళకే తెలుసు ఎవరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే దేశకాల పరిస్థితుల ధర్మాలను చిన్నతనం నుంచి నేర్చుకుంటూ పెరుగుతాం. సమాజంలో ఉన్నాయి నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలుసు తెలిసే చేస్తాను నేను ఆడుతున్నది అబద్ధము అని నాకు తెలుసు తెలిసే ఆడతాను కానీ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శరీర భావంలో అలా జరిగిపోతా ఉంటది జంతు ప్రవృత్తి వచ్చేస్తుంది.
(09:39) కానీ మనిషికి జంతువుల కంటే భిన్నమైన జ్ఞాన ప్రవృత్తి ఉంది. ఆ జ్ఞాన ప్రవృత్తిని మనకి మతముల ద్వారా దైవముల ద్వారా గురువుల ద్వారా గ్రంథముల ద్వారా ప్రార్థనాలయముల ద్వారా ఆచార సాంప్రదాయముల ద్వారా అనేక రకములుగా మనలో ఆ జ్ఞానాభివృద్ధిని కలిగించడానికి మహాత్ములు చేసిన ప్రయత్నము ఈ మతములు మార్గములు విధములు గురువులు గ్రంథములు ఇవన్నీ ఇవన్నీ కలిపి మనలో శరీర భావనగా ఉంటే జంతు ప్రవృత్తి పనిచేస్తది చెడు చేసేస్తది కానీ జ్ఞాన ప్రవృత్తిని పెంపొందింప చేసినప్పుడు శరీర ప్రవృత్తి నియంత్రించబడతది స్వార్ధ ప్రవృత్తి నియంత్రించబడతది అలా మొత్తం శరీర ప్రవృత్తి ఏం పోదు ధర్మముగా మంచిగా మానవ
(10:25) లోకం పెట్టుకున్న కట్టుబాట్లు ప్రకారం మనకు కావలసినవి పొందుతాం ఇంకో మనిషికి హాని చేస్తూ కాదు ఇంకో మనిషికి మేలు చేస్తూ మనకు కావలసింది ఆ మనిషి నుంచి తీసుకుంటాం ఆ మనిషికి కావలసింది మన నుంచి ఇస్తాం ఇలా ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవస్థని ధర్మ వ్యవస్థ ధార్మిక వ్యవస్థ అంటారు దాన్నే మంచి అన్నాం మనం ఇలా మనం అనేక రకాల చట్టాలు సమాజం అంతా ఏర్పాటు చేసుకున్నాం మరి ఎందుకు నేను మారలేకపోతున్నాను అంటే ఇప్పుడు సోదరుడు అడిగిన ప్రశ్న ఏంటి 40 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నాం మేము మత మార్గాల్లో దైవ మార్గాల్లో గురు మార్గాల్లో గ్రంథ మార్గాల్లో
(11:01) ఎందుకు మారలేకపోతున్నాం నేనే కాదు నా కుటుంబ సభ్యులు నా చుట్టూ ఉన్నటువంటి ఆ భక్త సమూహంలో కూడా నేను గమనించాను ఎవరో గుణమార్పు లేదు దైవీపరమైనటువంటి జీవితం ఓకే అంటున్నారు భౌతిక జీవితం మళ్ళీ ఓకే అంటున్నారు అక్కడన్ని తప్పులే చేస్తున్నారు. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు అన్నిటికీ గురవుతూనే ఉన్నారు ఇంట్లో కూడా ఘర్షణలు జరుగుతానే ఉన్నాయి ఎందుకని అన్నప్పుడు జ్ఞాన ప్రవృత్తిని అవి మనలో మేలుకొలపలేదు లేదా మనం మేలుకొలుపుకోలేదు ఇందులో తప్పు ఎవరిదని చెప్పడానికి లేదు ఆ జ్ఞాన ప్రవృత్తిని మేలుకొలుపుకున్నప్పుడు మరి అవి చెబుతున్నాయిగా మతం జ్ఞానమే
(11:40) చెబుతది ఎంతో కొంత దేవుడు జ్ఞానమే చెబుతాడు గురువు జ్ఞానమే చెబుతాడు అందరూ మంచిగా బతకమని చెబుతారు కానీ అది మేలుకొలుపు ఎందుకు జరగట్లేదు మనలో అంటే యాంత్రికంగా ఆచార సాంప్రదాయ విధానాలను పాటిస్తున్నాం. అది యాంత్రిక చర్య అంటే యంత్రం పని చేసిన అంరానికి బ్రెయిన్ ఉండదు. అదేదో చేయాలి కాబట్టి అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం.
(12:04) అంటే ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పదలచాను అద్భుతమైనటువంటి ఉదాహరణలు ఎన్నో అద్భుతమైనటువంటి కథల రూపంలో ఇతిహాసాల రూపంలో మనకు మహాత్ములు అందించారు. వాటిలో నుంచి గ్రహిస్తే మనం ఎక్కడ ఉన్నామో మనకు తెలుసు అక్కడ మనం ఆ మనం తెలుసుకుంటున్న పురాణ పాత్ర పేరు ఇతిహాస పాత్రనో తలుచుకోకూడదు. ఆ పాత్రలో మనని చూసుకోవాలి. మనం ఏ పాత్రకు సూట్ అవుతున్నామో చూసుకోవాలి.
(12:34) ఆ గుణమార్పు చేసుకోవాలి అప్పుడు తెలుస్తది అందుకని గుణమార్పు లేనటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రపంచంలో వాళ్ళ వల్ల ప్రపంచంలో వినాశనం జరిగింది మనుషులు అలా ఉంటుంది ఇదిగో ఇలా బతికారు వాళ్ళతో పాటు మంచోళ్ళు కూడా ఉన్నారు ఆ మంచోళ్ళు ఇదిగో ఇన్ని కష్ట నష్టాలు భరించారు కానీ ఆఖరికి మంచే గెలిచింది దైవం మంచివైపోయి ఉంది కానీ గుణమార్పు లేనటువంటి మనుషుల వలన ప్రపంచంలో ఎన్ని వినాశనాలు జరుగుతాయి ఏం జరుగుతాయి అని ముందే మనకు తెలియజేశారు ఆ గుణమార్పు లేనోడే నష్టపోతాడు అని కూడా తెలియజేశారు.
(13:07) కాబట్టి అది ఉదాహరణ మనం తీసుకుంటే మనము అసలు ఎలా ఉన్నామో మనకు అర్థం అవుతుంది. వేద అంత మాత్రాన మారిపోయినట్టు కాదు ఇక్కడ మనం ధృతరాష్ట్రుడు అనే పాత్రను తీసుకుంటున్నాం మహాభారతం నుంచి మహాభారతం అనేటువంటి ఇతిహాసాన్ని కావ్యాన్ని ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది నిజంగా జరిగింది అని అర్థం రామాయణ మహాభారతాలు నిజముగా జరిగినవి అని ఇతిహాసములు అంటారు అందులో మనం ధృతరాష్ట్రుడు అనే పాత్రను తీసుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అతని తమ్ముడు పాండురాజు వాళ్ళు రాజ కుమారులు పెద్దవాడు ధృతరాష్ట్రుడు రాజ్యము పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి ఇవ్వాలి
(13:54) అది రాజ్యపరంగా పెద్దవాడు రాజ్య అధికారానికి అర్హుడు యువరాజు అయితే గుడ్డివాడు అవ్వటం వల్ల అతను రాజ్య పరిపాలన చేయలేడు కనుక అర్హత పోయింది అందుకని తమ్ముడైన పాండురాజుకి ఇచ్చారు. అయితే పాండురాజుకి ఇవ్వటం వల్ల ఈయన అసూయకు గురయ్యాడు అయ్యో కళ్ళు లేకపోవడం వల్ల కదా అసలు యాక్చువల్‌గా నేను దీనికి అధికారిని అంటే ఇక్కడ అధికారం హోద పదవి రాజ్యకాంక్ష ధనకాంక్ష కీర్తికాంక్ష అన్ని ఉన్నాయి అతనిలో గుడ్డివాడైనా కూడా అయితే మరి నాలో గుడ్డితనం ఉంది నేను ఇది ఏం చేయలేను పరిపాలించలేను అని ధర్మంగా ఆలోచించాలి కతను ఎలా పరిపాలిస్తాను అని ఎందుకని కోటాను కోట్ల మందికి మేలు
(14:38) చేయవలసినటువంటి సింహాసన రాజు అది పాత్ర పాత్ర అది కానీ స్వార్ధపు గురుడు తన అహంకారం తన కీర్తి తన గొడవ తన గోల తన పదవి తన హోదా చూసుకుంటున్నాడు తప్ప గుడ్డివాడినైన నేను ఇన్ని కోట్ల మంది ప్రజలకు అసలు న్యాయం చేయగలుగుతానా అన్నప్పుడు ధర్మ ఆలోచన వచ్చేది అలాంటి ధర్మాలోచన చేసినటువంటి చుట్టూ ఉన్న మహనీయులు మహాత్ములు ఏం చేశారు గుడ్డివాడు పరిపాలన చేయలేడు గనుక పరిపాలన సజావుగా సాగాలి రాజు అనే పాత్ర ప్రజల కోసమే తప్ప ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి అదిఒక రక్షణ పాత్ర ప్రజలను రక్షించి వాళ్ళకి మేలు చేయడానికి సేవ చేయడానికి
(15:23) కానీ దాన్ని అధికార దుర్వినియోగంగా అతను భావించుకున్నాడు అందుకని ఈర్ష వచ్చింది అసూయ వచ్చింది ద్వేషం వచ్చింది ఎవరి మీద వచ్చింది తన సొంత తమ్ముడు మీద వచ్చింది ఎందుకని తమ్ముడైన పాండురాజుగా సింహాసనం ఇచ్చారు. అక్కడ పుట్టింది ఇదే మనలో పుట్టేది చెడు అంటే ఇది గుణమార్పు ఏం చేసుకోవాలి అంటే మనం ఆలోచించుకోవాలి అయ్యో నాకు ఆ అర్హత లేదు కనుక నాకు ఇవ్వలేదు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు అది తప్పుఏముంది అందులో అనేటువంటి ఒక సుహృదయతను పెంచుకోవడమే మంచితనం ఇంకేం లేదు అప్పుడు నేను మంచివాడిగా ఉంటాను ఎవరికీ చెడు చేయను కానీ ఇక్కడ ఏం జరిగింది ఆ
(15:57) ధృతరాష్ట్రుడు ఆ ధృత అంటే గట్టిగా రాష్ట్రము అంటే ప్రదేశము లేక స్థలము అ ధృతరాష్ట్రుడు అంటే బలంగా గట్టిగా పట్టేసుకొని ఉంటాడు దేన్నైనా అంటే బాగా ఆ పేర్లు కూడా అలాగే సరిపోతాయి అంటే అలా పెడతారు చక్కగా మనకు అర్థమయ్యేలా ఉడ్డివాడు కానీ వదలడు బలంగా పట్టుకున్నాడు అదే ఆశ కోరిక అత్యాశ దురాశ అర్హత లేకపోయినా దాన్ని పొందాలన్న కాంక్ష ఇవి మనిషికి తెచ్చే ప్రమాదములు మనిషికి వచ్చే ప్రమాదాలు ఈ అత్యాశ ఆశ దురాశ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇప్పుడు ధృతరాష్ట్రుడు అనే పాత్ర గుడ్డితనంతో ఎందుకుఉందంటే ఇవన్నీ ఉన్నవాళ్ళు కళ్ళన్నా అందులే వివేకం
(16:44) నశించిపోద్ది జ్ఞాన గుడ్డి వాళ్ళవాళ్ళు అక్కడ అలా అర్థం చేసుకోవాలి మనం జ్ఞాన గుడ్డి వాళ్ళ వాళ్ళంతా ఆ కనుక అతనిలో ఈర్ష అసూయ ద్వేషాలు పుట్టినాయి అయితే అవి బయటకి చూపించకుండా అతను మామూలుగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు ఎందుకంటే హృదయంలో ఉన్నాయి ఎందుకని గుడ్డివాయుడుగా బయటకి చూపించలేడు నటించి అందరి ముందు మామూలుగా ఉంటున్నాడు నవ్వుతున్నాడు కానీ లోపల అంతా కసే ఉంది ఎవరి మీద పాండురాజు మీద నా సీట ఈయన కొట్టేసాడని నా కుర్చి ఆయన కొట్టేసాడు కానీ పాండురాజు నిజంగా ఆ కుర్చి కొట్టేయలే ఆయన ఎంత గొప్పవాడు మంచివాడు అంటే తన అన్నగారినే ఆ పదవిలో కూర్చోబెట్టి
(17:22) రాజ్యసింహాసనం మీద కూర్చోబెట్టి తాను పక్కనుండి మొత్తం చూసుకున్నాడు రాజ్యాన్ని అయితే అది ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది పాండురాజుకి చూసావా గుడ్డివాడైనటువంటి అన్నను కూర్చోబెట్టి రాజుగా ఆయనే పెట్టి పక్కనుండి ఇంత చక్కగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు ఈయన ఎంత మంచివాడు ఎంత గొప్పవాడని ఆయనక అంత మంచి పేరు రావడం ఈయనకి ఇంకా ఈర్ష అయిపోయింది.
(17:49) ఇంకా అసువ అయిపోయింది. అది లోపల అలా పెట్టుకొని అది పెరుగుతూనే ఉంది పైకి మాత్రం నవ్వుతూ బతుకుతున్నాడు ఇది మనం దృతరాష్ట్రులం అయితే ఇలా ఉంటాం. ఏం నాకు కళ్ళు ఉన్నాయండి నాకెందుకు నేను దృతరాష్ట్రుడు అవుతాను అంటే మళ్ళీ దానికి మీకు రివర్స్‌లో చెప్పాను దేనినైనా మొండిగా మూర్ఖంగా పట్టుకునేవాడు ధృతరాష్టుడే అర్హత లేకపోయినా కావాలనుకునేవాడు ధృతరాష్ట్ుడే ప్లస్ ఆశ అత్యాశ దురాశ ఇవన్నీ ఉన్నవాళ్ళందరికీ జ్ఞాన దృష్టి పని చేయదు జ్ఞాన గుడ్డివాళ్ళు అటువంటి వాళ్ళంతా దృతరాష్టులే ఇప్పుడు మనం ఎక్కడఉన్నామో చూసుకోవాలి అంతే అర్హ అర్హత లేకుండా అన్ని కోరుకునే ప్రతివాడు దృతరాష్ట్రుడేనండి
(18:32) దేనికైనా అర్హత ఉంటది అర్హత మీ నిర్ణయం కాదు అర్హత ఉండేది వచ్చేది అంతే అర్హతని మనం నిర్ణయించుకోకూడదు ఇక్కడ మనం మనక అన్వయించుకొని ఎందుకు మారలేకపోతున్నాం అనడానికి చెప్పుకుంటున్నాం అంతే ఆ పాత్రను తీసుకున్నాం అందులోనుంచి మనకోసమే కదా అవన్నీ రచించింది. సరే ఇలా బాగా కసిపెంచుకున్నాడు పాండురాజు మీద అనేక కారణాల వల్ల పాండురాజు చనిపోయాడు ధృతరాష్ట్రుడికి భార్య గాంధారి వచ్చింది ఆమె నా భర్తకు కళ్ళు లేవు కదా నేను చూడటం ఎందుకని ఆమె కళ్ళకు గంటలు కట్టేసుకుంది అయితే ఏమి ఆపలేదు వాళ్ళు ఊరిన కళ్ళకు గంతలు కట్టుకున్నారు అంతే శుభ్రంగా మళ్ళీ
(19:10) రాజ్యం మీద కూర్చున్నారు ఇప్పుడు పాండురాజు లేడు మళ్ళీ ఈయనే కూర్చున్నాడు కాపురం చేశారు పిల్లల్ని అన్నారు అన్ని మామూలే అయఏమ ఆపలేదు అయితే పాండురాజుకి పిల్లలు ఉన్నారు పాండవులు పాండురాజు కొడుకులు గనుక పాండవులు వీళ్ళకి వీళ్ళద కురువంశము కనుక వాళ్ళని కౌరవులు అని పిలుస్తారు అసలు వీళ్ళ వంశమే కురువంశం ఇద్దర అన్నదమ్ముల బిడ్డలు కౌరవులు అంటే పాండవులు కూడా కౌరవుల కిందకే వస్తారు కానీ పాండవులు అని ఎందుకు అన్నారంటే పాండురాజు కుమారులు అని అంతే వీళ్ళక 100 మంది సంతానం వాళ్ళకి ఐదుగురు సరే ఇంకో ఆడపిల్ల కూడా ఉందని చెబుతారు 101 మంది ఊరి 100 మంది అన విషయానికి
(19:50) తీసుకుందాం ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు ఆ లోపల ఉన్నటువంటి ఈర్ష అసూయ ద్వేషాలు ఉన్నాయి కదా ఇప్పుడు రాజ్యం ఏమైంది పాండురాజు తన అన్నను కూర్చోబెట్టి పరిపాలించాడు తప్ప పాండురాజుక కూడా అందులో హక్కు ఉంది పరిపాలించింది అంతా పాండురాజే అందుకని రాజ్యాన్ని పాండవులకు కూడా సమంగా ఇవ్వాలి అన్నారు. అంటే ధృతరాష్ట్ుడు పిల్లలకి సమం పాండురాజు పాండవులకి సమం వాళ్ళు పెరిగి పెద్దయ్యే వరకు భీష్ముడు దాన్ని సింహాసనానికి అండగా ఉండి ఆ సింహాసనం మీద ధృతరాష్ట్రుడినే కూర్చోబెట్టాడు భీష్ముడు అండగా ఉన్నాడు కానీ రాజు ధృతరాష్ట్ుడే ఇప్పుడు ఈ
(20:31) ధృతరాష్ట్ుడికి లోపల ఉన్న ఈర్షసూయ ద్వేషాలు ఏంటంటే ఈ రాజ్య సింహాసనం నా పిల్లలకే దక్కాలి నా తమ్ముడు పిల్లలకు దక్కకూడదు అని ఆ కుళ్ళు కుతంత్రాలతో తన పిల్లల్ని పెంచాడు ఆ బుద్ధులతో తన పిల్లల్ని పెంచాడు తన తమ్ముడు పిల్లలకు ఎన్నో అన్యాయాలు చేసుకుంటూ వచ్చాడు అసలు వాళ్ళని చంపబోయారు చిన్నతనంలోనే కానీ అనేక విధమైన రక్షణలతో వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు తండ్రి లేకపోయినా కానీ అందరి పిల్లలు ఒకే చోట పెరుగుతున్నాడు భీష్ముడు వీళ్ళందరికీ సంరక్షకుడిగా ఉన్నాడు.
(21:04) అయితే వీడిలో అంటే ధృతరాష్ట్రుడు అనేటువంటి వ్యక్తిలో అతనిలో ఉన్నటువంటి ఈర్షసూయ ద్వేషాలతో అతని కొడుకైన పెద్ద కొడుకైన దుర్యోధనుడు మిగిలిన కొడుకులు అందరూ పెరిగారు ఎందుకని తండ్రి తల్లి బుద్ధులయి అయ్యే నేర్పుతారుగా పిల్లలకి నూరుపోసాయి అయ్యే నేర్పుతాం మనం చక్కగా గుణగణాలతో ఈర్షతో అసూయతో ద్వేషాలతో దృతరాష్ట్రుడు నుంచి ఊడిపడ్డాడు దుర్యోధనుడు మిగిలిన వాళ్ళు కూడా అంతే దుర్యోధనుడు మెయిన్ గా ఉన్నాడు పెద్దోడు కాబట్టి ఒక తండ్రికి ఈయనకి తేడా ఏంటంటే కళ్ళు ఆయనకి లేవు ఈయనకి కళ్ళు ఉన్నాయి అంటే ఇక ఈయనకి వాళ్ళ వాళ్ళకి పేరు వస్తుంటే పాండవులకు భరించలేకపోతున్నాడు
(21:42) పాండవులు ఎప్పుడు సౌమ్యులు తండ్రి లేడు తల్లి పెంపకం చాలా సౌమ్యులు వాళ్ళ తండ్రే సహజంగా అమ్మ చాలా మంచివాడు అన్నని గుడ్డివాడైన అన్నని రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి తను పక్కనుండి రాజ్యాన్ని సంరక్షించాడు అంటే ఆయన ఎంత మంచివాడు ఆ మంచి గుణాలతో ఆయన పిల్లలు పుట్టారు. అలాగే ఆయన భార్య అయినటువంటి కుంతిదేవి ఇంకా చాలా మంచిది ఆ గుణాలతోనే ఆమె పెంచింది ఆ సాత్వికత వాళ్ళకి వచ్చింది.
(22:09) అందుకని వాళ్ళు మంచివాళ్ళ అనే పేరు చిన్నతనం నుంచి ఉండటాన్ని దుర్యోధనుడు భరించలేకపోతున్నాడు వాళ్ళకి రాజ్యంలో వాట ఇవ్వడాన్ని దుర్యోధనుడు భరించలేకపోతున్నాడు రాజుగా ఉన్నవాడు ధృతరాష్ట్ుడే ఏదో ధర్మం కోసం వాళ్ళకి పనికిరాని స్థలం ఏదో రాజ్యం కింద విభాగం చేసి ఇచ్చాడు సరే వాళ్ళకి శ్రేయోభిలాషినటువంటి వాళ్ళ శ్రేయస్సు కోరేటువంటి అనేకమంది రాజులు కృష్ణ భగవానుడు వీళ్ళందరూ కలిపి వాళ్ళకి ఇచ్చినటువంటి పనికి రాని చవుడు నేలల్ని శుభ్ర చేసి పాంచ రాజధాని నిర్మించి పాండవులకు వైభవంగా అక్కడ ఒక రాజ్యం తయారైపోయింది.
(22:45) మంచివాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి మంచి జరుగుద్దిగా కృష్ణుడు అండగా ఉన్నాడు సరే అన్ని జరిగినయి మంచి బ్రహ్మాండమైనటువంటి రాజధాని కట్టుకున్నారు మొత్తం అంతా సాగుతుంది రాజ్యం ఉంది అది చూసి భరించలేకపోయాడు దుర్యోధనుడు వెళ్లి దూరంగా వెళ్ళిపోయి ఉన్నా కూడా భరించలేక వాళ్ళని మాయాజోనికి పిలిచాడు ఆడాడు ధర్మరాజును ఓడించాడు ఆ రాజ్యం అంతా లాక్కున్నాడు వీళ్ళని వనవాసానికి పంపాడు వనవాసం అయినాక నీ రాజ్యం ఇస్తాను అనేది షరత్తు అక్కడ ఆటలో అయితే వనవాసం అయిపోయి తిరిగి వచ్చారు మధ్యలో బోళ్ళు కష్టాలు పెట్టాడు చంపేద్దాం అని చూశడు అయినా వాళ్ళు తప్పించుకున్నారు తప్పించుకున్నారు
(23:25) సరే మొత్తానికి స్టోరీ అంతా అయిపోయింది తర్వాత వనవాసం నుంచి వచ్చినాక నేను రాజ్యం ఇవ్వనని బాహాటంగా చెప్పేసాడు. బాహాటంగా తన దుర్మార్గత్వాన్ని చెడుని ప్రకటింపచేశాడు. మీకు దమ్ము ఉంటే యుద్ధం చేసి గెలుచుకోండి లేకపోతే వదిలేయండి అన్నాడు అంటే యుద్ధంలో వీళ్ళని చంపేసేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం చంపేస్తే మొత్తం రాజ్యం ఉండిపోద్దిని సరే యుద్ధం జరిగింది మొత్తం కౌరవులు చనిపోయారు పాండవులు గెలిచారు రాజ్యం అంతా వీళ్ళకి వచ్చేసింది మళ్ళీ ధృతరాష్ట్రుడు బతికే ఉన్నాడు గాంధారి బతికే ఉంది మళ్ళీ వచ్చి ఈ ధృతరాష్ట్రుడు గాంధారి పాండవుల దగ్గర కూర్చున్నారు
(24:05) ఎందుకంటే రెండు రాజ్యాలు ఏకమైపోయి ఏకరాజ ఇప్పుడు వీళ్ళు రాజులు అయిపోయారు వాళ్ళు ఎవరు లేరు చచ్చిపోయారు. అసలు దీనంతటికీ కారకుడు ఎవరు ధృతరాష్ట్రుడు అయితే ఈ కథ ఎందుకు చెప్పాను ఎందుకు మారలేకపోతున్నాను అన్నప్పుడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు స్టోరీ ఏది చెడు ఉందో ఒక చెడు ప్రకారం జరిగిపోయింది. అంటే కాదు ధృతరాష్ట్రుడు నిరంతరం మంచి మాటలు వింటా ఉంటాడు.
(24:32) విదురుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు దృతరాష్ట్రుడు తమ్ముడే దృతరాష్ట్రుడికి తమ్ముడే అవుతాడు విధురుడు అక్కడే ఉన్నాడు సంజయుడు అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు సంజయుడు కూడా అక్కడే ఉంటాడు నిరంతరం వాళ్ళు ఆ కొలువులోనే ఉంటారు ధృతరాష్ట్రుడు పక్కనే ఉంటారు వెదురుడు ఎప్పుడు ధృతరాష్ట్రుడికి మంచి మాటలు చెబుతా ఉంటాడు నీతి చెబుతా ఉంటాడు భగవత్ కథలు చెబుతా ఉంటాడు ఇలా చేయొచ్చు అలా చేయకూడదు అని చెబుతా ఉంటాడు ఎప్పుడైనా ధృతరాష్ట్రుడికి మనసుక ఏదైనా బాధ కలిగిన క్లేషం కలిగిన ఇబ్బంది కలిగిన విదురుని పిలిపించుకొని మంచి మాటలు చెప్పించుకుంటాడు జ్ఞాన బోధలు
(25:07) చేయించుకుంటాడు విదుర నీతులని ఇప్పుడు కూడా మనకి మహా ప్రసిద్ధి చెందినటువంటి ఉపదేశాలు ఉన్నాయి జ్ఞాన బోధలు ఉన్నాయి అంటే ఏంటి అందుకు చెప్పాను ఇది ధృతరాష్ట్రుడు నిరంతరము మంచి మాటలు వింటున్నవాడే ఎదురుని ఎప్పుడు పక్కన పెట్టుకుంటాడు ఎదురుడు చెప్పే మంచి మాటలు అన్నీ వింటాడు మంచిగా ఉందాం అనుకుంటాడు మంచిగా జీవిద్దాం అనుకుంటాడు కానీ వ్యవహారానికి వచ్చేటప్పటికీ ఈర్షను దాటలేడు అసూయని దాటలేడు మోహాన్ని దాటలేడు తన కొడుకుని చూడగానే రాజ్యంఅంతా తన కొడుకే వచ్చేయాలి అనుకుంటాడు.
(25:43) తన కొడుకు ఏం చేసినా అడ్డగించడు మోహం ఆల్రెడీ తనకు ఈర్షేసూయలు ఉన్నాయి ఇక్కడ మన పాత్ర మనం అన్ని వింటాం గురువులు అంటాం మతం అంటాం మార్గం అంటాం దేవుళ్ళ అంటాం దేవతలు అంటాం ప్రార్థనాలయాలు అంటాం ఇళ్లల్లో అన్ని ఆచార సాంప్రదాయాలు పాటిస్తాం ఎవరు మతానుసారం ఇళ్లల్లో వాళ్ళు ప్రార్థనలు పూజలు అర్చనలు ఏముంటాయి అవి చేసుకుంటా ఉంటారు.
(26:07) వాళ్ళు గురువులు చెప్పినవి చేస్తుంటారు ప్రార్థనాలయాలకి వెళ్తుంటారు అక్కడ డబ్బులు సమర్పిస్తారు దక్షిణలు ఇస్తారు సేవలు చేస్తారు ఏదో ఒకటి వాళ్ళు చేయగలిగినంత చేస్తారు. రక్షణ అంటారు భగవంతుడు రక్షిస్తాడు అనుకొని ఆశతో చేస్తారు ఏదో రకరకాలు చేస్తారు కానీ అది యాంత్రికంగా చేసేసి వస్తారు ధృతరాష్ట్రుడులాగా మార్పు ఉండదు అవి చేస్తున్నంతసేపు మాత్రం ఏదో మారిపోయినట్టుగా భావించుకుంటారు మంచోళ్ళు అయిపోయినట్టుగా భావించుకుంటారు గొప్పోళ్ళు అయిపోయినట్టుగా భావించుకుంటారు తమను తామే ఒక రకమైనటువంటి హిప్నాసిస్ స్థితిలో పెట్టుకుంటారు మిధ్యా స్థితిలో పెట్టుకుంటారు భ్రమ స్థితిలో
(26:42) పెట్టుకుంటారు నాకు నేను ఒక మతాన్ని అనుసరిస్ స్తున్నాను మత అన్యాయని గనుక మంచివాడిని మంచిదాన్ని అనుకుంటారు నేను ఒక దైవాన్ని నిత్యము అన్ని రకాలుగాను సేవిస్తున్నాను గనుక మంచివాడిని మంచిదాన్ని అనుకుంటారు ఓ గురువుని అనుసరిస్తున్న జ్ఞాన గ్రంథాలు అనుసరిస్తున్న వేషభాషలు అనుసరిస్తున్న ఆ వేషభాషలు వేసుకున్నా ధరిస్తున్నా అలాగే జీవిస్తున్నా జ్ఞాన గ్రంథాలు చదువుతున్నా నాకు మంచి అంతా తెలుసు మంచి నేర్చుకున్నా బోలెడు మంచి తెలుసుకుంటున్నా నాకు అర్థమైపోయింది ఇదంతా అనుకుంటారు దృతరాష్ట్రులు విధురుడు చెప్పినప్పుడల్లా దృతరాష్ట్రుడు అలాగే ఉంటాడు
(27:16) కానీ ఒక్క మంచి పని కూడా దృతరాష్టుడు చేయడు అసలు చెడు నాపడు చెడు చేస్తానే ఉంటాడు తన కొడుకు దాని చెడుకు ప్రోత్సహించేదే దుతరాష్ట్టుడు తన కొడుకు చేసే చెడునంత సమర్ధించేదే దుతరాష్ట్టుడు ఎందుకని అసలు కొడుకైన దుర్యోధనుడు రాజే కాదు రాజు దుతరాష్టుడే మరి విదురుడు అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకున్నాడు ఆయన గురువు అనుకోవచ్చు దైవం అనుకోవచ్చు జ్ఞాన గ్రంథం అనుకోవచ్చు బోధ అనుకోవచ్చు సంజయుడు అనేటువంటి అతను కూడా మంచి చెబుతా ఉంటాడు విదురుడు అయితే ఎప్పుడు మంచిగా పక్కన పెట్టుకుంటాడు అసలు ఆయన పిలిపించుకుంటాడు విదురుడిని అర్ధరాత్రి కూడా
(27:51) పిలిపించుకుంటాడు మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగితే మహాభారతం చదివితే తెలుస్తది మానసికంగా అశాంతి ఉంటే నిద్రపట్టకపోతే పిలిపించుకొని మంచి మాటలు చెప్పించుకుంటాడు ఎందుకని ఎప్పుడు దుర్బుద్ధి కలిగినోడికి నిద్రపట్టదు. అలాగే మార్పు ఎందుకు రావట్లేదు మనలో అంటే మార్పు తెచ్చుకోవాలని మనం అనుకోవాలి కదా చెడును ఆపాలని మనం అనుకోవాలి కదా చెడుగా వెళ్తున్నానని మనం అనుకోవాలి కదా నిరంతరం విధురుని పక్కన పెట్టుకున్నట్టే మతాన్ని పక్కన పెట్టుకొని దేవుని పక్కన పెట్టుకొని దేవతను పక్కన పెట్టుకొని జ్ఞాన గ్రంథాలు పక్కన పెట్టుకొని ఆ తల కింద పెట్టుకు
(28:25) పడుకొని వాటిని నిరంతరం ఆరాధించి అర్చించి గురువులని అనుసరించి వాళ్ళు చెప్పినన్ని చేసినా మళ్ళీ మన స్వయానికి వచ్చేటప్పటికి మనలో ఉన్న పాత బుద్ధులు అలాగే ఉన్నాయి. ఆ స్వార్ధ బుద్ధి అలాగే ఉంది ఆ జంతు ప్రవృత్తి అలాగే ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు అనేకమంది ఉంటారు అనేక పాత్రలు కనబడతా ఉంటాయి.
(28:49) రావణాసురుడు అలాంటివాడు వాడికి అన్ని ఉన్నాయి వాడికి లేనిదే లేదు పొద్దున్నే లేచి వాడు మదమఎక్కిపోయి ఇంతకే ఏంటడు విపరీతమైన దైవభక్తుడు ఎన్నో వరాలు భగవంతుడి నుంచి పొందాడు కానీ వాడు పొందిన వరాలన్నీ చెడ్డవరాలు అంటే ఏంటి నాకు బలం పెరగాలి నన్ను ఎవడో చంపకూడదు నా జోలికి ఎవడు రాకూడదు ఎవడు నన్ను ఏమి చేయకూడదు ఇలాంటి వరాలు పొందాడు.
(29:13) అంతే తప్ప ఏది మంచిది అసలు ఏ మోక్షం కావాలనం పొందలేడు మోక్షం కోసం ప్రయత్నమే చేయలేడు ఎంతసేపు భౌతిక కోరికలు భౌతిక కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళందరూ రావణాసురుడులా అయిపోతారు రావణాసురుడు భౌతికతను ఎంత పెంచుకున్నాడు ఎన్ని వరాలు పొందాడు అంటే ఉదాహరణకు చెప్పారు అది మాయల మహిమలు కాదు ఉదాహరణ మనం దాన్ని తెలుసుకోవాలి ఏంటి అంటే రావణాసురుడు లంకని బంగారంతో నిర్మించ చడట ఏమి లేదు దండయాత్రలకి వెళ్ళిపోయేవాడు ఎవరు చంపలేరు ఎవరు అతన్ని చంపకుండా వరాలు పొందాడు ఎవరు యుద్ధంలో అతన్ని గెలవలేరు అందుకని ఎటు పడితే అటు పొద్దున్నే లేసి టిఫిన్ చేసి వెళ్ళిపోయి అందరినీ కొట్టుకొచ్చి వాళ్ళ
(29:54) దగ్గర ఈ సంపదలన్నీ దోచుకొచ్చేస్తాడు. లేదా వీడికి భయపడి వాళ్లే ఇచ్చేస్తారు. కనపడిన స్త్రీ నల్ల ఎత్తుకొచ్చేస్తాడు లేదా వీడిని ఇష్టపడి వాళ్లే వచ్చేస్తారు. అలా ఏదో ఒకటి మొత్తానికి అన్ని కొట్టుకొచ్చేస్తాడు. అలా మొత్తం నేను నా వైభవం లంకనా అలా తయారు చేసుకున్నాడు మొత్తం బంగారంతో నిర్మించాడు రోడ్లు లేని ఫెసిలిటీ లేదు వాళ్ళకి ఆడు కర్మకాల సీతమ్మ తల్లిని అట్టాగా ఎత్తుకొచ్చాడు మతం పెరిగిపోయి సింపుల్ గా రాముడు వచ్చి చంపేసాడు.
(30:28) అంటే ఎందుకు గుణమార్పు రాదు భగవంతుని ప్రార్థించాడు కదా భగవంతుని అర్చించాడు కదా భగవంతుని ఆరాధించాడు కదా రావణాసురుడికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు శివుడు గారు ప్రత్యక్షమయ్యారు ఎన్నో వరాలు ఇచ్చారు కానీ వాడు అడిగినవన్నీ భౌతికతలే నాకు బలం పెరగాలి నన్ను ఎవరు ఓడించకూడదు నాకు సంపదలు ఉండాలి ఇలాంటివి అడిగాడు అంతే అంటే మళ్ళీ ఇది ఎందుకు చెబుతున్నాను అంటే మనకోసం ఇది భౌతికమైనటువంటి ఆశలు అత్యాశలు దురాశలు కోరికలు రక్షణలు కోరుకునే వాళ్ళఅందరూ గుణమార్పు తెచ్చుకోలేరు రావణాసురుడే అవుతారు ఎప్పటికైనా లేదా రావణాసురుడు కదా మనక ఎందుకు చెబుతారు
(31:08) ఏమైంది వినాశనమే అవుతది ఇప్పుడు భగవత్తత్వాన్ని తెలుసుకోవాల్సింది దేనికి అంటే భగవత్తత్వాన్ని నువ్వు పొందడానికి అంతే దైవత్వం అంటే మంచి నువ్వు మంచిని పొందడానికి మంచిని తెలుసుకోవాలి. ఇంకా దైవత్వం అంటే అనంత ఆత్మ శక్తి నేను అనంత ఆత్మ శక్తిని నువ్వు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక చదువు చదువుకోవాలి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి దైవ శక్తిని తెలుసుకోవాలి విశ్వ శక్తిని తెలుసుకోవాలి సృష్టి శక్తిని తెలుసుకోవాలి.
(31:36) అలా కాకుండా నేను మొత్తం భౌతికం కోసమే భగవంతుని ఆరాధిస్తున్నాను అనేవాడు రావణాసురుడు భగవత్ దర్శనాలు అయినాయి భగవంతుని పొందాడు తపస్సులు చేశడు కానీ వాడు ఏం కోరాడు అన్ని భౌతిక వరాలు కోరాడు భౌతిక సంపదలు కోరాడు భౌతిక బలాలు కోరాడు భౌతికంలో మరణం లేని వరం కోరాడు సరే అది కుదరదుఅని చెప్పారు అందుకని కండిషనల్ బెయిల్ తీసుకున్నట్టు కండిషనల్ గా ఏదో అడిగాడు అందులో మానవులు వానరులు త అనే పదం వాడకుండా మిగిలిన అన్ని పదాలు వాడేసాడు వీళ్ళు ఎవరు నన్ను చంపకూడదని సరే ఆడి కర్మ కాల్చడానికి ఆ రెండు ఉంచుకున్నాడు మానవుడిగా రాముడు వచ్చి చంపేసాడు వానరుల సాయంతో వచ్చి చంపేసాడు.
(32:15) అలా మన కర్మ కాల్చుకోవడానికి చెడ్డ కర్మలు చేసిన మనమే ఏదో మిగిల్చుకుంటాం. అంటే ఇదంతా కూడా మనలో అంతరంగ గుణమార్పుకు అవసరమైందే చెప్పారు నాయనా నీ పాత్ర ఎక్కడఉందో చూసుకోకండి నువ్వు దేవుడితోనే ఉన్నాను అనుకుంటున్నావ్ గురువుతోనే ఉన్నాను అనుకుంటున్నావ్ మతంతోనే ఉన్నాను అనుకుంటున్నావ్ ప్రార్ధనాలయాల చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నావ్ తపస్సులు చేస్తున్నాను అనుకుంటున్నావ్ అన్ని దేనికి చేస్తున్నావ్ భౌతిక కోరికల కోసం చేస్తున్నావా భౌతిక సంపదల కోసం చేస్తున్నావా భౌతిక బలాల కోసం చేస్తున్నావా అయితే నువ్వు రాక్షసుడు అవుతావ్ రావణాసురుడు అవుతావ్ అంతే
(32:50) నువ్వేం దైవత్వా అన్ని పొందలేవు నువ్వు రాముడు అవ్వలేవు నీలో మంచితనం పెరగదు నీలో గుణమార్పు జరగదు నీలో సద్గుణ మార్పు జరగదు నీ అనంత ఆత్మ శక్తి ఎరుక నీకు ఎప్పటికీ కలగదు. అలా నేను ఎందుకు మారలేకపోతున్నాను అనటానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కూడా ఒకసారి ఆలోచించి చూడండి. ఒకవేళ అలా ఉందా మనకి అంటే చెప్పాక భౌతిక కోరికల కోసం భగవంతుడి దగ్గరికి గురువు దగ్గరికి మతం దగ్గరికి ప్రార్థనాలయాల దగ్గరికి జ్ఞాన గ్రంథాల దగ్గరికి వెళ్ళేవాళ్ళందరూ కూడా భౌతిక కోరికలు నువ్వు చేసుకున్న దాన్ని బట్టి అంతే కష్టేఫలి కష్టపడినోడు కష్టపడినంత యద్భావం తద్భవతి ఏ
(33:34) భావంతో ఏం చేసావో అదే సిద్ధిస్తది ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు ఇందులో దేవుడి ప్రమేయం ఏమి లేదు అది సృష్టి నియమం కానీ దేవుని దానికి వాడుకుంటాను అనే వాళ్ళ అందరూ కూడా ఏమవుతారు ఇప్పుడు మోసగాళ్ళ మోసగత్తులు అవ్వాల్సిందే ఎందుకే సృష్టి నియమం మారదగా అద్భుతాలు మహిమలు మాయలనయో రకరకాల చిత్తభ్రాంతులు క్రియేట్ చేసుకోవాలి లేకపోతే ఎదుటోడికి చిత్తభ్రాంతులు క్రియేట్ చేయాలి ఇలా భౌతిక లాలసతతో భౌతికమైనటువంటి ఆశలతో అత్యాశలతో దురాశలతో తమలోని చెడుగుణాలకు అనుకూలంగా దైవత్వాన్ని మలుచుకుంటారు ఇప్పుడు నాకు డబ్బు పిచ్చి దేవుడా డబ్బు డబ్బు డబ్బు
(34:11) అని అని తిరుగుతా ఉంటారు దాని కోసం మొత్తం ఇవన్నీ మతాల చుట్టూ దేవుల చుట్టూ తిరుగుతా ఉంటా గురువుల చుట్టూ తిరుగుతా ఉంటా దానికోసం గ్రంథాలు చదువుతా ఉంటా వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తా ఉంటా అలా భౌతిక కోరికలు ఏవైతే అవి ఎన్ని ఉంటే అన్ని అవన్నీ మనక ఒక రావణాసురుడి కిందే తయారు చేస్తాయి సద్గుణాలు పెంచవు గుణ మార్పు రాదు మంచి రాదు మంచి రావాలంటే ఏమీ లేదు అసలు నువ్వు భౌతిక కోరికలని నీ ప్రయత్నంతో స్వప్రయత్నంతో తీర్చుకో అంతే భౌతిక కోరికలు అన్ని స్వప్రయత్నంతో తీర్చుకోవటమే మొత్తం గుణమార్పు కోసం భగవత్తత్వాన్ని దైవతత్వాన్ని తెలుసుకో అదే మంచిని
(34:50) పెంచుకోవడం దైవత్వం అంటే సంపూర్ణ మంచి దైవత్వం సంపూర్ణ మంచి దైవత్వం ఆ సంపూర్ణ దైవత్వ ఎరుక జ్ఞానం ఆ సంపూర్ణ జ్ఞానం ఎరుకైన ఆనంద ఆత్మ శక్తి ఇలా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తా ఉంటాం మారలేకపోవడానికి కారణాల్లో ఇది కూడా ఉందేమో ఇలాంటి మనస్తత్వం కూడా ఉందేమో ఒకసారి గమనించి చూసుకొని దాన్ని కూడా మార్ మార్చుకోండి మార్చుకుంటే తప్ప కుదరదు చూడండి ఆలోచించి చూడండి ఏదైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి ఇది ఎవరికి వాళ్ళు పరిశీలించుకునేది ఇంకోళ్ళకి చెప్పేది కాదు మీరు ఎవరికీ చెప్పక్కర్లే నాకు కూడా ఏమి చెప్పక్కర్లే ఇది మీకు ఏమనా ఉపయోగపడితే
(35:27) ఉపయోగించుకోండి మార్చుకోగలిగిన సామర్థ్యం ఉంటే మార్చుకోండి మార్పుకి ఏమైనా కొంచెం ఉపయోగపడితే ఇటువంటి చిన్న చిన్న శీర్షికలు అనుకుంటే సంతోషం కామెంట్లో పెట్టండి మాకు ఉపయోగపడుతున్నాయని ఇంకా చెప్పే ప్రయత్నం చేస్తాను మారితే సంతోషం మారలేకపోతే మారలేనోళ్ళు ఎవరు బాధ వాళ్లే పడతారు రావణాసురుడు బాధ రావణాసురుడే పడ్డాడు ఎవరేం చేయగలరు కాబట్టి దైవీ తత్వం అన్నప్పుడు దైవత్వం మనలో పెరగటానికి దైవీ తత్వాన్ని తెలుసుకోవాలి అది మంచి అంతే అంతకుమించి ఇంకేమ లేదు ట్రై చేయండి అర్థమైతే ఆచరించండి ఇంకా సందేహం ఉంటే స్పష్టంగా అడగండి మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నేను
(36:09) చెప్పింది నచ్చని వాళ్ళు ఇష్టప ఇష్టపడని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఎందుకంటే కచ్చితంగా ఉంటారు ప్రపంచంలో అసలు దేవుే అందరూ అంగీకరించల ఒక మత దేవుడిని ఇంకో మతం వాళ్ళు అంగీకరించరు దేన్నే అందరూ అంగీకరించరు కాబట్టి ఈ అంగీకార స్వభావం లేని వాళ్ళందరూ కూడా మీరు కష్టపడకండి మీ మనసుని కష్టపెట్టుకోబాకండి మళ్ళీ నా మనసుని కష్టపెడదాం అని ఏ కామెంటో పెట్టబాకండి ఎందుకు అనవసరం మీ పనులు మీరు చేసుకోండి నా పనులు నేను చేసుకుంటా మీ అహంకారానికి నేను చెబుతున్నా నేను సామాన్య నా మీద ఎందుకు అహంకారం అందుకని అహంకారం పెంచుకోకండి అసలు నేను అతి సామాన్యుడిని
(36:46) నేనేదో నన్ను మంచిలో ఉంచుకుందామని నాలో కొంచెం సద్గుణాలు పెంచుకుందామని కాస్త మంచిగా శాంతిగా హాయిగా బతుకుదామని ఉన్నంతలో తృప్తిగా బతుకుదామని నాకు నేను చెప్పుకుంటూ నాకు నేను చేసుకుంటున్నటువంటి ప్రయత్నాన్ని ఏదో కొంతమంది సోదర సోదరీమలు అడుగుతున్నారు మాకు కూడా అర్థంఅవుతుంది అంటున్నారు చెప్పమంటున్నారు దాన్ని వాళ్ళతో పంచుకుంటున్నాను.
(37:10) అందుకని నచ్చన వాళ్ళందరూ నన్ను క్షమించి వీడు సామాన్యుడు అని భావించి నన్ను వదిలేసి మీ సమయం వృధా చేసుకోకుండా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.
No comments:
Post a Comment