Tuesday, March 24, 2026

******నగ్న సత్యం: వీళ్ళు ఒకరిని ప్రేమిస్తున్నాం అని చెప్తూనే, ఇంకొకరితో ఏకాంతంగా గడుపుతారు.

 ఒక అడవిలో ఒక అందమైన పక్షి ఉండేది. దానికి రెండు గూళ్లు ఉండేవి. ఒక గూడు చాలా గట్టిగా, వర్షం వచ్చినా ఎండ వచ్చినా తట్టుకునేలా ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఉండేది. ఆ గూడుని ఒక ముసలి పక్షి చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండేది. కానీ ఆ పక్షికి ఆ గూడు బోర్ కొట్టేది. 

అందుకే అది అప్పుడప్పుడు పక్కనే ఉన్న ఒక పూల తోటలోకి వెళ్లి, అక్కడ ఒక చిన్న పొదలో ఉన్న ఇంకో గూటికి వెళ్లేది. ఆ పొదలో ఉన్న గూడు అంత గట్టిది కాదు, కానీ అక్కడ రంగురంగుల పూలు, కొత్త కొత్త పక్షుల సందడి ఉండేది. ముసలి పక్షి అడిగినప్పుడల్లా, "నేను ఎక్కడికీ వెళ్ళలేదు, ఇక్కడే ఆహారం కోసం తిరుగుతున్నాను" అని అబద్ధం చెప్పేది. 

ఒకరోజు పెద్ద తుపాను వచ్చింది. ఆ పూల తోటలోని గూడు కొట్టుకుపోయింది. అప్పుడు ఆ పక్షి వెంటనే మర్రి చెట్టు మీద ఉన్న పాత గూటికి వచ్చేసింది. కానీ ఆ ముసలి పక్షికి అప్పటికే నిజం తెలిసిపోయింది. ఆ గూడు భద్రతని ఇస్తుంది కానీ, పక్షికి కావాల్సింది భద్రత కాదు, కొత్తదనం అని. 

అందుకే ఆ పక్షి మళ్ళీ ఎప్పుడు ఎండ వస్తుందా, ఎప్పుడు ఇంకో కొత్త తోటకి వెళ్దామా అని ఎదురుచూస్తూనే ఉంటుంది. 

సో, ఈ కథలో నీతి ఏంటంటే, ఒక వ్యక్తికి నిలకడ లేనప్పుడు నువ్వు ఎంత గొప్పగా చూసుకున్నా, వాళ్ళు పక్కదారి వెతుక్కుంటూనే ఉంటారు.

సైకాలజీలో 'Border line Personality' లేదా 'నార్సిసిస్టిక్ టెండెన్సీస్' ఉన్నవాళ్లు ఇలాగే ప్రవర్తిస్తారు. 

వీళ్లకి ఎప్పుడూ ఒక రకమైన Emptiness ఉంటుంది. ఆ ఖాళీని పూరించడానికి వీళ్లకి నిరంతరం కొత్త వ్యక్తులు, కొత్త పొగడ్తలు కావాలి. ఒక రిలేషన్ పాతబడగానే, అందులో థ్రిల్ తగ్గిపోగానే వీళ్ళు పక్క చూపులు చూస్తారు. కానీ పాత రిలేషన్‌ని వదులుకోవడానికి వీళ్లకి ధైర్యం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక సెక్యూరిటీ ఉంటుంది. అందుకే "నువ్వంటే ఇష్టం కానీ ఉండలేకపోతున్నా" లాంటి డైలాగులు చెప్తారు. ఇది ప్రేమ కాదు, ఇది కేవలం అవసరం మాత్రమే. వీళ్ళు ఒకరిని ప్రేమిస్తున్నాం అని చెప్తూనే, ఇంకొకరితో ఏకాంతంగా గడుపుతారు. ఇది వాళ్ళ దృష్టిలో తప్పు కాదు, అది ఒక 'ఛాయిస్'. కానీ నిజాయితీ లేని ఏ ఛాయిస్ అయినా చివరికి వినాశనానికే దారితీస్తుంది.

-నగ్న సత్యం

Source link :  http://youtube.com/post/UgkxQbptCcvV49DzXQECHkX6YetIVgolFW-o?si=n43Jr0lb8G_FSSa8


No comments:

Post a Comment