Friday, April 24, 2026

యోగనంద అడిగిన ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలను చెప్పిన రమణులు

యోగనంద అడిగిన ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలను చెప్పిన రమణులు

Author Name:Harish Atma gnani

Youtube Channel Url:https://www.youtube.com/@HarishAtmagnani

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6lmsSl-KTEo



Transcript:
(00:02) అందరికీ నమస్కారం మిత్రులారా నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఒక యోగి ఒక మహర్షి యోగానంద అడిగిన ప్రశ్నలకు అద్భుతంగా సమాధానాలను చెప్పిన రమణ మహర్షి సో మిత్రమా మనం ఈ విషయంపై ఈరోజు చర్చించుకోబోతున్నాం. మిత్రమా మనందరికీ తెలుసు పరమహంస యోగానంద గారు తన యొక్క పుస్తకమైనటువంటి ఉకయోగి ఆత్మకథ అనే పుస్తకంలో తను 1935 లో రమణ మహర్షుల వారిని సందర్శించాడు అని ఆ యొక్క పుస్తకంలో ప్రస్తావించాడు.
(00:43) సో తను రమణ మహర్షిని సందర్శించినప్పుడు తను అడిగిన ప్రశ్నలు ఏమిటి? తను అడిగిన ప్రశ్నలకు రమణ మహర్షుల వారు ఏ విధంగా సమాధానాలు ఇచ్చాడు అనే విషయంపై ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం మిత్రులారా సో మనం ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. సో మిత్రమా 1935 లో పరమహంస యోగానంద గారు రమణ మహర్షుల వారిని సందర్శించడం జరిగింది.
(01:13) వారు రమణ మహర్షిని సందర్శించినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు. మరి వారు అడిగిన ప్రశ్నలు ఏమిటి దానికి మహర్షుల వారు ఎంత ఉన్నతంగా సమాధానం ఇచ్చాడు అనే విషయం మనం తెలుసుకుందాం. సో పరమహంస యోగానంద గారు రమణ మహర్షుల వారిని అడిగిన మొట్టమొదటి ప్రశ్న ప్రజల ఆధ్యాత్మిక ఉన్నతి ఎలా సాధించాలి? వారికి ఎలాంటి ఉపదేశాలు ఇవ్వాలి అని మహర్షిని అడగడం జరిగింది.
(01:44) అందుకు మహర్షి ఏమని సమాధానం ఇచ్చాడంటే అది వారి యొక్క స్వభావాన్ని బట్టి ఉంటుందని వారి మనసుల యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి ఉంటుందని అందరికీ కలిపి ఒకే ఉపదేశం ఇవ్వడం సాధ్యం కాదు అని వెల్లడించడం జరిగింది మిత్రమా ఇక్కడ మహర్షుల వారి యొక్క సమాధానాన్ని మీరు గుర్తించండి వ్యక్తులందరికీ ఒకటే మార్గం అన్నది ఉండదు అంటే ఒకటే ఉపదేశం అన్నది ఉండదు ఉపదేశం అంటే ఏమిటి ఇక్కడ ఒకే విధమైనటువంటి మార్గాలు ఉండవు అది వ్యక్తుల యొక్క పరిపక్వతను బట్టి వారి యొక్క స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటాయి అని మహర్షుల వారు వెల్లడించడం జరిగింది.
(02:29) ఇది అక్షర సత్య మిత్రులారా ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక అనేక మార్గాలు ఉన్నాయి ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కానీ అందరికీ కలిపి ఒకటే మార్గం అనేది ఉండదు కదా మిత్రమా అది వ్యక్తుల యొక్క ప్రకృతిని ధర్మాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని బట్టి వారి యొక్క ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి ఉంటాయి మార్గాలు సో ఇక్కడ మహర్షుల వారు అదే సమాధానాన్ని చెబుతున్నాడు అందరికీ మూకుమ్మడిగా ఒకటే మార్గం అన్నది ఉండదు ఒకటే ఉపదేశం అన్నది ఉండదు సో అది వ్యక్తుల యొక్క స్థితిని బట్టి ఉంటుంది.
(03:12) ఎంత ఉన్నతంగా సమాధానం ఇచ్చాడో చూడండి మిత్రమా ఉదాహరణకు రోగాలు అనేకం ఉంటాయి కదా మిత్రులారా ఆ అనేకానేక రోగాలకు ఒకటే మందు అన్నది ఉండదు కదా మిత్రమా ఒక్కో రోగానికి ఒక్కో మందు సో వ్యక్తుల యొక్క స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత కూడా చాలా భిన్నంగా ఉంటుంది కొందరు ఉన్నత స్థితిలో ఉంటారు కొందరు మధ్యస్థ స్థితిలో ఉంటారు కొందరు తక్కువ స్థాయిలో ఉంటారు.
(03:42) సో వారి యొక్క పరిపక్వతను వారి యొక్క స్వభావాన్ని బట్టి అంటే వారికి ఏ మార్గం అనుకూలంగా ఉంటుందో అటువంటి మార్గాలను ఉపదేశించడం అన్నది ఉంటుందని ఇక్కడ మహర్షి యోగానంద గారితో చెప్పడం జరుగుతుంది. సో మూకుమ్మడిగా ఒకటే మార్గం అన్నది ఉండదు. ఎలాగైతే మూవ్ కుమ్మడిగా ఒకటే అన్ని రోగాలకు ఒకటే మందు అన్నది ఉండదో రకరకాల రోగాలకు రకరకాల ఆ రోగాన్ని బట్టి మందు ఉంటుంది కదా సో ఆ విధంగానే వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి వారి పరిపక్వతను బట్టి వారికి సంబంధించిన మార్గాలు ఉంటాయని మహర్షి వెల్లడిస్తున్నాడు.
(04:19) సో యోగానంద గారు మహర్షిని అడిగిన రెండో ప్రశ్న ఆ రెండో ప్రశ్న ఏమిటంటే భగవంతుడు ప్రపంచంలో దుఃఖాన్ని ఎందుకు అనుమతిస్తాడు ఆయన తన శక్తితో ఒక్క దెబ్బతో ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి విశ్వవ్యాప్త భగవత్ సాక్షాత్కారాన్ని ప్రసాదించకూడదా అని యోగానంద గారు రమణ మహర్షిని అడగడం జరిగింది. అందుకు రమణ మహర్షి ఏమని సమాధానం ఇచ్చాడంటే మిత్రమా భగవత్ సాక్షాత్కారానికి దుఃఖమే మార్గమని చెప్పడం జరిగింది మిత్రమా ఈ యొక్క ఉన్నతమైన సమాధానాన్ని చూడండి భగవత్ సాక్షాత్కారానికి ఆత్మ
(05:06) సాక్షాత్కారానికి ఆత్మాన్వేషణకు దుఖం అన్నది మార్గమని ఇక్కడ రమణ మహర్షుల వారు చెబుతున్నారు ఇది ఎంత సత్యపూరితమైన సమాధానమో చూడండి మిత్రమా ఇది నా సొంత అనుభవం మిత్రమా ఎందుకంటే నేను జీవితంలో చాలా దుఃఖాన్ని చాలా వేదనను అనుభవించాను. ఆ యొక్క దుఃఖమే నన్ను ఆత్మ వైపు తీసుకెళ్ళింది మిత్రమా ఇది నా యొక్క జీవితంలో జరిగిన సత్యపూరితమైన సంఘటన.
(05:38) సో ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పిన సమాధానం ఖచ్చితంగా అది సత్యమైనది ఎందుకంటే అది నా జీవితంలో జరిగిన సంఘటన మిత్రమా ఎందుకంటే దుఃఖం అన్నది కచ్చితంగా నిన్ను ఆత్మాన్వేషణకు తీసుకెళ్తుంది. దుఃఖం అన్నది ఒక మార్గం నీలో తీవ్రమైన వేదన దుఃఖం బాధ కలిగాయంటే అది నీ యొక్క ఆత్మ వైపు కదిలించేందుకు ఒక సంకేతం మిత్రమా కానీ చాలామంది ఏం చేస్తారు దుఃఖం కలిగినప్పుడు వేదన కలిగినప్పుడు పరమాత్మను నిందిస్తారు.
(06:14) అయ్యో భగవంతుడా నాకెందుకు ఈ వేదన ఎందుకు ఈ కష్టాలు చుట్టూ ఉన్న జనాలను చూడండి వాడు చాలా డబ్బును అనుభవిస్తున్నాడు చాలా సుఖాలను అనుభవిస్తున్నాడు. కానీ నాకెందుకు ఈ దుఃఖాన్ని ఇచ్చావు తండ్రి అని భగవంతుని నిందిస్తారు. సో వేదన చెందుతారు మిత్రమా వారికి కలిగిన దుఃఖం వలన వారు తప్పుడు మార్గాల వైపు వెళ్తారు చాలామంది కొందరు తాగుడుకు బానిస అయిపోతారు కొందరు ఆత్మహత్య చేసుకుంటారు.
(06:44) కానీ కొందరు ఆధ్యాత్మికత వైపు మరలుతారు అంటే ఆత్మ వైపు కదలడం అనేది జరుగుతుంది. అందులో నేను ఒకని మిత్రమా అంటే నీకు జీవితంలో తీవ్రమైన వేదన దుఃఖం అన్నవి కలుగుతున్నాయి అంటే ఆ దుఃఖం అన్నది నీకు ఆత్మ వైపు కదిలేందుకు ఒక సంకేతము నీకు ఇస్తుందని గుర్తించు మిత్రమా దుఃఖాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు భగవంతుని నిందించకు ఆ అంత తీవ్రమైన వేదన దుఃఖం నీకు ఎందుకు కలిగాయి నీకు ఎందుకు సంభవించాయి ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయం ఇక్కడ ఏమి ఏమి సుఖాలు లేవు ఇవన్నీ తాత్కాలికమైన ఆనందాలు నిజమైన ఆనందం అన్నది నీ అంతర్గతంగా ఉన్న ఆత్మనే ఆ ఆత్మనే
(07:30) నువ్వు దాన్ని గుర్తించు అని ఆ పరమాత్ముడు నీకు తీవ్రమైన వేదనను ఇచ్చాడు అని ఇక్కడ రమణ మహర్షి చెబుతున్నాడు ఇది అక్షర సత్యం మిత్రమా నా యొక్క అనుభవం కూడా ఎందుకంటే మీ జీవితంలో దుఃఖం సంభవిస్తే మీరు తాగుడు వైపు వెళ్ళకండి తాగావంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితం అన్నది సర్వనాశనం అవుతుంది మిత్రమా అలాగే నువ్వు దుఃఖం సంభవించిందని నువ్వు ఆ యొక్క తీవ్రమైన వేదనలో ఆత్మహత్య చేసుకోకు మిత్రమా ఆ విధంగా నువ్వు జీవితాన్ని అంటే భగవత్ సాక్షాత్కారానికి వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోబడతావు.
(08:12) సో నీ యొక్క దుఃఖాన్ని ఆత్మ వైపు కదిలేలా వినియోగించుకో సో మిత్రమా నా అనుభవం ఏమిటో నీకు వివరిస్తాను మీకు మిత్రమా నేనుతొమ్మిది లేదా 10వ తరగతిలో ఉన్నప్పుడు నాకు తీవ్రమైన వేదన కలిగింది దుఃఖం కలిగింది. అంటే నాకు చిన్నతనం నుండి పరమశివుని ఆరాధించడం భక్తితో ఉండడం అన్నది నాకు పసితనం నుండి ఉంది. సో ఆ విధంగా నేను నిరంతరం భగవంతుని యొక్క ఆ భక్తిలో ఉండేవాడిని కానీ నాకు నేను తొమ్మిది లేదా 10వ తరగతిలో ఉన్నప్పుడు నాకు తీవ్రమైన వేదన కలిగింది. చాలా దుఃఖం సంభవించింది.
(08:50) జీవితం అన్నది ఒక వ్యర్థంగా తోచింది. సో ఆ బాధ వలన నేను ఏం చేశానో తెలుసా మిత్రమా ఇదంతా వ్యర్థమని నాకు అనిపించింది అంటే ఇంత భగవంతుని ఆరాధిస్తున్న ఇంత భక్తి తత్వంతో ఉన్న నాకు ఎందుకు ఈ తీవ్రమైన వేదన కలుగుతుంది ఎందుకు ఈ దుఃఖం కలుగుతుంది అంటే ఇవన్నీ అబద్ధాలా పరమాత్ముడు అబద్ధమా సో ఈ భక్తిలో ఏదైనా లోపం ఉందా సో ఇటువంటి ప్రశ్నలు నాలో తలెత్తాయి అప్పుడు నేను ఏం చేశానో తెలుసా మిత్రమా అప్పుడు నేను అనేక గ్రంథాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలని నిశ్చయించుకున్నాను మిత్రమా అంటే గొప్ప గురువుల యొక్క బోధనలు కావచ్చు ఒక భగవద్గీత కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు
(09:34) సో ఇటువంటి ఉన్నతమైన గ్రంథాలు చదవాలని నిశ్చయించుకున్నాను ఇందులో ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని సో ఆ విధంగా నిశ్చయించుకొని ఒకనాడు మాకు దగ్గరలోనే ఉన్న లైబ్రరీకి వెళ్ళడం జరిగింది మిత్రమా ఆ విధంగా లైబ్రరీకి వెళ్లి సో అనేక పుస్తకాలు వెతకడం జరిగింది. ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఉన్నప్పుడు నాకు ఓషోకు సంబంధించిన ఒక పుస్తకం నన్ను ఆకర్షించింది మిత్రమా అదేమిటో కాదు ఓషో యొక్క ధ్యాన యోగం.
(10:08) ఆ పుస్తకం యొక్క ఫ్రంట్ పేజీ లో అంటే కవర్ పేజ్ ఉంటుంది కదా అందులో ఓషో యొక్క ఫోటోగ్రాఫ్ నన్ను విపరీతంగా ఆకర్షించాయి. అతడి కళ్ళల్లో ఉన్న తేజస్సు కావచ్చు. అతడి రూపురేఖలు సో పైన ధ్యాన యోగం అని ఉంది. సో ఇందులో ఏమైనా ఉంటుందా అని నేను అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటాయా జీవిత సమస్యలకు కావచ్చు వేదనలకు కావచ్చు పరిష్కారం ఏమైనా దొరుకుతుందా అని ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను మిత్రమా ఆ విధంగా నేను చదువుతూ చదువుతూ నన్ను ఓషో యొక్క ఆ బోధనలు నన్ను విపరీతంగా ఆకర్షించాడు అంటే అందులో ఉన్న అనేక ధ్యాన మార్గాలను ఓషో వెల్లడించాడు
(10:51) అంటే మనిషి యొక్క సమస్యకు మూల కారణం మనసే నీ యొక్క ఆలోచననే అప్పటివరకు నాకు సాధనాల గురించి ఏమీ తెలియదు మిత్రమా నాకు తెలిసింది కేవలం భగవంతుని ఆరాధించడం పరమాత్ముని తలుసుకోవడం పూజించడం సో నాకు అంతర్గత సాధనాల గురించి ఓషో యొక్క పుస్తకం చదివేంత వరకు నాకు తెలియదు మిత్రమా సో నాకు మొట్టమొదటగా ధ్యానం అన్న పదం తెలిసింది ఒషో ద్వారానే ధ్యానం యొక్క గొప్పతనం అనేక సాధనాల యొక్క ఆ విశిష్టత నాకు తెలియబడింది ఓషో ద్వారానే సో ఆ విధంగా ఓషో చెప్పిన అనేక పద్ధతులను ఆచరించాను మిత్రమా ఓషో యొక్క అనేక పుస్తకాలను చదవడం మొదలుపెట్టాను.
(11:33) సో మిత్రమా ఆ విధంగా నేను ఓషో యొక్క పుస్తకాలను చాలా కొన్నాను కొని చదివాను. సో మిత్రమా మీరు నమ్మరు ఒక్కోసారి నా దగ్గర డబ్బు లేనప్పుడు కొన్ని పుస్తకాలను నేను విశాలాంధ్ర అనే బుక్ స్టోర్ ఉంటుంది గా మిత్రమా అక్కడికి వెళ్లి కొట్టేయడం అన్నది జరిగింది అంటే ఓషో యొక్క బోధలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి కానీ నా దగ్గర ఒక్కొక్కసారి డబ్బు ఉండకపోయేది అప్పుడు నేను ఇంటర్ లోనే ఉన్నాను మిత్రమా సో మాది అంతగా డబ్బున్న కుటుంబం కాదు సో నా దగ్గర డబ్బు లేదు కానీ ఓషో పుస్తకం ఎలాగైనా చదవాలి ఊషో బోధలు నన్ను ఆకర్షిస్తున్నాయి. సో ఆ విధంగా ఒక రెండు
(12:15) మూడు పుస్తకాలు కొట్టేయడం అనేది జరిగింది మిత్రమా ఆ విధంగా కొట్టేసి కూడా చదివిన రోజులు ఉన్నాయి. సో ఆ విధంగా ఓషో ద్వారానే నేను అనేక యోగుల గురించి తెలుసుకోవడం అనేది జరిగింది మిత్రమా ఒక రమణ మహర్షి కావచ్చు రామకృష్ణుడు కావచ్చు మెహర్ బాబా కావచ్చు చువాంచు లావోత్స బోధిధర్మ ఇంకా అనేకమంది జార్జ్ గుర్జిఫ్ సో ఇటువంటి యోగుల జీవితాల గురించి కావచ్చు వారి యొక్క బోధనల గురించి కావచ్చు కేవలం ఓషో ద్వారానే నేను తెలుసుకోవడం జరిగింది మిత్రమా నా జీవితంలో ఒసో అన్నవాడు లేక లేకపోతే నేను ఇప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోయి ఉండేవాడిని ఖచ్చితంగా
(12:56) సో హాట్స్ ఆఫ్ టు ఓషో ఓషో లేకపోతే అసలు ఆధ్యాత్మికత అంటే నాకు ఏమిటో తెలిసేది కాదు ధ్యానం కావచ్చు సాధనాలు కావచ్చు నేను చేసి ఉండేవాన్ని కాకపోవచ్చు సో మిత్రమా ఓషో ద్వారానే నేను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రావడం అన్నది జరిగింది. సో ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే అంటే నాకు కలిగిన వేదనను నేను ఆధ్యాత్మికత వైపు మలుచుకున్నాను ఆత్మ వైపు వెళ్లేందుకు నేను వినియోగించుకున్నాను.
(13:29) పరమాత్ముడు మనకు సంకేతం ఇస్తాడు మిత్రమా నీకు దుఃఖం కలిగినప్పుడు నీకు ఈ దుఃఖాన్ని ఎందుకు ఇచ్చాను నీకు ఈ దుఃఖం అన్నది నీ యొక్క నిజస్థితిని గుర్తించేందుకు అంటే నీలో ఉన్న ఆ పరమాత్మను గుర్తించేందుకు అంటే ఆ పరమాత్మ అన్న ఆత్మ అన్న ఒకటే మిత్రమా సో నీలో ఉన్న నిజ స్థితిని గుర్తించేందుకే ఆ అవకాశం అన్నది ఆ పరమాత్ముడు మనకు కల్పిస్తాడు దుఃఖం ద్వారా సో దుఃఖాన్ని నువ్వు సరిగ్గా అర్థం అర్థం చేసుకో మిత్రమా నీకు తీవ్రమైన వేదన దుఃఖం సంభవించిందంటే నువ్వు అదృష్టవంతుడివి ఎందుకు ఆ తీవ్రమైన వేదన నీకు ఆత్మ వైపు కదలమని చెబుతూ ఉంది అక్కడ సో ఇక్కడ రమణ
(14:12) మహర్షి యోగానందకు ఇచ్చిన సమాధానం ఏమిటి దుఃఖమన్నది ఆత్మ వైపు కదిలేందుకు మార్గం అని చెప్పాడు రమణ మహర్షి ఏం చెప్పాడు ఆయన సత్యం చెప్పాడు దుఃఖం అన్నది నీ యొక్క ఆత్మ వైపు కదిలించేందుకు ఒకానొక మార్గం అన్నాడు సో సో చూడండి మిత్రమా ఎందుకంటే అది నా యొక్క జీవిత అనుభవం కాబట్టి నేను కచ్చితంగా చెప్తున్నాను మీకు దుఃఖం కలిగిందంటే మీరు అదృష్టవంతులు ఎవరైతే దుఖం అంతగా వారి జీవితంలో సంభవించలేదో వారు కంఫర్ట్ జోన్ లో వారు ఉన్నారో వారు దురదృష్టవంతులు ఎందుకంటే వారు అటువంటి అజ్ఞానంలోనే తాత్కాలిక సుఖాలలోనే కొట్టుమిట్టాడుతూ అంటే అదే సర్వస్వం అనుకొని జీవితాంతం ఆ స్థితిలోనే
(14:53) గడిపి మరణిస్తారు వారు ఆత్మ వైపు కదలరు ఎందుకంటే గట్టి దెబ్బ దెబ్బ తగిలిన వాడు మాత్రమే ఆత్మ వైపు కదులుతాడు నీకు గట్టి దెబ్బ ఎలా తగులు ఎలా సంభవిస్తుంది దుఃఖం ద్వారానే తీవ్రమైన వేదన ద్వారానే నీకు ఆ తీవ్రత అన్నది ఆత్మ వైపు కదలాలి ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనే తపన నీకు ఈ తీవ్రమైన వేదన అన్నది పుట్టిస్తుంది. సో పుట్టిస్తుందా అంటే అందరూ వినియోగించుకోరు మిత్రమా కొందరు తప్పట అడుగు వేస్తారు ఇందాక నేను చెప్పినట్టు తాగుడు వైపు వెళ్తారు లేదంటే దుఃఖం సంభవించిందని భగవంతుని నిందించి ఆత్మహత్య చేసుకుంటారు సో తప్పుడు మార్గాల వెంట వెళ్ళకండి ఆత్మ వైపు కదలండి
(15:35) సో రమణుడు ఇచ్చిన సమాధానం ఇది దుఃఖం అన్నది ఆత్మ వైపు కదిలేందుకు ఒకానొక మార్గము [నిట్టూర్పులు][ఆశ్చర్యం] ఇక యోగా భోగానంద గారు రమణ మహర్షిని అడిగిన మూడో ప్రశ్న అసలు దుఃఖము ఎందుకు ఉండాలి అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు రమణ మహర్షుల వారు ఏమని సమాధానం చెప్పారంటే అసలు దుఃఖం అనుభవించేది ఎవడు? అసలు దుఃఖం అంటే ఏమిటి? అని సమాధానం ఇవ్వడం జరిగింది.
(16:09) మిత్రమా ఈ యొక్క సమాధానాన్ని అర్థం చేసుకోవాలంటే రమణుని యొక్క స్థితిలో ఉంటే తప్పించి నీకు అర్థం కాదు. ఎందుకంటే రమణుడు ఇచ్చిన సమాధానం అక్షర సత్యం అది. కానీ నువ్వు ఈ యొక్క సగటు మనిషి ఉంటున్న స్థితిలో ఉన్నప్పుడు రమణుని యొక్క సమాధానం నీకు అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఈ సగటు మనిషి ఉంటున్న స్థితిలో ఖచ్చితంగా దుఃఖం ఉంది.
(16:36) కచ్చితంగా దుఃఖం అనుభవించేవాడు ఒకడు ఉన్నాడు. కానీ రమణుడు ఉంటున్న స్థితిలో దుఃఖము లేదు దుఃఖం అనుభవించే ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి అన్నవాడు లేడు. మిత్రమా ఆత్మ స్థితి అంటే ఏమిటి? అక్కడ ఇండివిడ్యువల్ అన్నవాడు మిగలడు. అక్కడ వ్యక్తి అన్నవాడు మిగలడు ఉనికే ఉంటుంది ఆత్మే ఉంటుంది. ఆత్మ స్థితి అంటే ఆనంద స్థితి అందులో దుఃఖానికి చోటు లేదు అలాగే దుఃఖం అనుభవించే ఇండివిజువల్ అన్నవాడు లేడు ఉన్నది ఉనికి దాని ఆత్మ అన్నా దైవం అన్నా నువ్వు ఏ పేరు పెట్టినా పర్వాలేదు మిత్రమా సో ఆ స్థితిలో దుఃఖం అన్నది ఉండదు సో రమణుడు తన ఉన్న స్థితి తను ఉంటున్న స్థితి
(17:16) గురించి వెల్లడించాడు. సో నీకు ఆ సమాధానం అర్థం అవ్వాలంటే కచ్చితంగా రమణుడు ఉంటున్న స్థితిని నువ్వు పొంది తీరవలసిందే నువ్వు ఆత్మజ్ఞానం సిద్ధించినప్పుడు మాత్రమే ఆ సమాధానం నీకు అర్థమవుతుంది మిత్రమా ఇక్కడ ఆయన చెప్తున్న ఆ సమాధానం అక్షర సత్యం అసలు దుఃఖం అనుభవించేది ఎవడు అసలు దుఃఖం అంటే ఏమిటి నీ యొక్క నిజ స్థితిలో ఇండివిడ్యువల్ అన్నవాడు లేడు దుఃఖము లేదు ఉన్నది ఆనందమే ఆనందమే నీ నిజ స్వభావం ఆత్మ యొక్క స్వభావం ఆనందమే సోమిత్రమా ఎంత ఉన్నతమైన సమాధానం అది ఇక్కడ ఇండివిడ్యువల్ అన్నవాడు లేడు నువ్వు ఇండివిడ్యువల్ స్థితిలో ఉన్నంత కాలం నీకు
(18:00) దుఃఖము తప్పదు మిత్రమా ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న మనుషులను చూడండి కోటాను కోట్ల మందిని చూడండి వారికి ఏదో ఒక వేదన ఏదో ఒక బాధ అన్నది ఉంటుంది కదా ఎంతో తీవ్రమైన వేదనకు బాధకు భయాలకు వీటన్నిటికీ గురవుతూ ఉంటారు కారణం తమను తాము ఒక వ్యక్తులని భావిస్తున్నారు ఆ యొక్క అజ్ఞానంలో ఉన్నారు ఆ యొక్క మాయలో ఉన్నారు. మిత్రమా నువ్వు వ్యక్తివి కాదు నేను అనే ప్రత్యేకమైన వ్యక్తి నీలో ఎవడూ లేడు కేవలం దేవుడే ఉన్నాడు దేవుడు అంటే అంతటా నిండి ఉన్న ఆ యొక్క చైతన్యమే దాన్నే ఆత్మ అన్నారు.
(18:39) సో మిత్రమా నువ్వు నీ యొక్క నిజ స్థితిని గుర్తించినప్పుడు అక్కడ దుఃఖము ఉండదు దుఃఖాన్ని అనుభవించేవాడు ఉండడు అందుకే నేను అంటాను మిత్రమా మీరు ఖచ్చితంగా అంతర్గతమైన శోధన అనేక రకాల సాధనాలు చేసినప్పుడు మాత్రమే మీ యొక్క అజ్ఞానపూరితమైన ఈ యొక్క మనసు అన్నది నశించినప్పుడు మాత్రమే మీ యొక్క నిజస్థితి అన్నది ఉనికిలోకి వస్తుంది.
(19:08) మీ యొక్క ఆత్మ దర్శనం అన్నది అప్పుడు కలుగుతుంది మిత్రమా మనసు అనే అడ్డుగోడను తొలగించినప్పుడు మాత్రమే ఆత్మ మేలుకుంటుంది. ఆత్మను నువ్వు గుర్తించావంటే అప్పుడు నువ్వు ఒక ఇండివిజువల్ కాదు నువ్వు ఒక వ్యక్తివి కాదు అప్పుడు నువ్వు అన్నవాడివి ఉండవు కేవలం దైవమే ఉంటాడు. అంటే నువ్వు ఏమి చేసినా అందులో దివ్యత్వం అన్నది ఉంటుంది. నీ యొక్క ప్రవర్తన కావచ్చు నువ్వు చేసే పనులలో అద్భుతమైన పవిత్రత, దివ్యత్వం దాగి ఉంటుంది మిత్రమా సో ఇక్కడ రమణుడు ఇచ్చిన సమాధానం నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందితే తప్పించి నీకు అర్థం కాదు.
(19:46) సో ఈ విధంగా యోగానంద గారు అడిగిన ప్రశ్నలకు రమణ మహర్షుల వారు ఉన్నతంగా సమాధానం ఇచ్చాడు మిత్రమా. సో ఇది మిత్రమా నా యొక్క ఎక్స్ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు

No comments:

Post a Comment