Saturday, April 18, 2026

 *శ్రీ రామ శ్రీ రామ*
*శ్రీ రామ శ్రీ రామ*
🍀🌺🍀🌺🍀🌺

         *శ్రీరామ*


ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు

అదే శ్రీ రామ అనే నామం లో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోడం పొరపాటు. * శ్రీ రామ అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అట.* అదెలాగో చూద్దాం…

1️⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే!

2️⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే*

3️⃣ *శ్రీ* అంటే *లక్ష్మి*

4️⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు)

5️⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు)

6️⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అంటే అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపం లో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా.

*రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ*

ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు.

అలాంటి నామ పారాయణం చేయడం
మరువకండి!

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺
*జై శ్రీరామ్🙏*

No comments:

Post a Comment