Sunday, May 10, 2026

చాణక్య నీతి-8 : ఎవరిని ఎలా లొంగదీసుకోవాలి? | Chanakya Neeti | Pamidikalva Madhusudan || Dhatri TV

చాణక్య నీతి-8 : ఎవరిని ఎలా లొంగదీసుకోవాలి? | Chanakya Neeti | Pamidikalva Madhusudan || Dhatri TV

Author Name:Dhatri TV

Youtube Channel Url:https://www.youtube.com/@dhatritvtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=uhOKPZ2xqqg



Transcript:
(00:00) బిబిజి వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబలిగా ఎదుగుతున్న బేవల్లి హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. [సంగీతం] [సంగీతం] కొందరి దగ్గర మనం ఎంత వినయంగా ఉన్నా ఎంత మంచిగా మాట్లాడినా వినరు సాయం చేయరు. మరికొందరు మనం అడగకపోయినా సాయం చేస్తారు. అవతల మనిషి మైండ్సెట్ ను అర్థం చేసుకుని మన మాట వినేలా వాళ్ళని ఎలా మార్చుకోవాలి అన్న హ్యూమన్ సైకాలజీ పై అద్భుతమైన విశ్లేషణ చేశాడు చాణక్యుడు శత్రువునైనా మిత్రుడినైనా మన దారిలోకి తెచ్చుకోవడానికి ఆయన చెప్పిన ఆ సీక్రెట్ ఫార్ములాలు ఏంటో తెలుసుకుందాం.
(00:44) [సంగీతం] చాణిక్యుడు తన నీతిశాస్త్రంలో మనుషులను నాలుగు రకాలుగా వర్గీకరించాడు. వాళ్ళని ఎలా గెలవాలో ఒకే ఒక్క శ్లోకంలో వివరించాడు లుబ్ద మర్తేన గృష్ణీయాత్ స్తబ్ద మంజలి కర్మణ మూర్ఖం చందోనువృత్తేన తత్వార్తేనచ పండితం దీని అర్థం ఏంటో అది ఈ కాలానికి ఎలా వర్తిస్తుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం.
(01:15) లుబ్ద మర్తేన గృష్ణీయాత్ అంటే లోభిని లేదా ఆశ ఉన్నవాడిని ధనంతో లొంగ తీసుకోవచ్చు కొందరికి డబ్బు అంటే అమితమైన ప్రాణం అలాంటి వారి దగ్గర నీతి వాక్యాలు చెబితే పని జరగదు వారికి లాభం కనిపిస్తేనే మీరు చెప్పినట్టు వింటారు. నేటి బిజినెస్ వరల్డ్ లో దీన్ని ఇన్సెంటివ్స్ లేదా కమిషన్స్ అంటారు. ఒక డీల్ క్లోజ్ చేయాలన్నా లేదా ఒక మనిషితో పని చేయించుకోవాలన్నా అందులో వాళ్లకు వచ్చే ఆర్థిక లాభం ఏంటో స్పష్టంగా చూపిస్తే చెబితే వాళ్ళు వెంటనే మీ దారిలోకి వస్తారు.
(01:49) ఇక్కడ ధనం అంటే కేవలం నగదు మాత్రమే కాదు వారికి ఉపయోగపడే ఏ వస్తువైనా కావచ్చు మరి కొందరు ఉంటారు వాళ్ళకు డబ్బు అక్కర్లేదు కానీ నేనే తోపు అనే ఫీలింగ్ ఉంటుంది. మరి ఇలాంటి ఈగో ఉన్న వ్యక్తులను ఎలా హ్యాండిల్ చేయాలి స్తబ్దం అంజలి కర్మణ అహంకారిని లేదా గర్వం ఉన్నవాడిని గౌరవంఇచ్చి నమస్కరించి లొంగతీసుకోవాలి. అహంకారం ఉన్న వ్యక్తికి తనను తాను పొగుడుకోవడం అంటే ఇష్టం తన గొప్పతనాన్ని ఎవరైనా గుర్తిస్తే చాలు వాళ్ళు వెంటనే కరిగిపోతారు.
(02:22) వారితో వాదించి గెలవడం అసాధ్యం ఎందుకంటే వారు ఓటమిని అంగీకరించరు. మీ బాస్ లేదా మీ పై అధికారి కొంచెం అహంకారి అయితే వాళ్ళతో గొడవ పడకండి మీరు చెప్పింది కరెక్ట్ సార్ మీ ఎక్స్పీరియన్స్ ముందు మేమెంత అని చిన్న ప్రశంస చేస్తే చాలు వాళ్ళు మీ పట్ల సానుకూలంగా మారిపోతారు. వినయం ఇక్కడ ఒక ఆయుధం అయితే అందరిలోకి డేంజర్ ఎవరంటే మూర్ఖులు వీళ్ళ దగ్గర తర్కం ఉండదు జ్ఞానము ఉండదు కానీ వాదన మాత్రం గట్టిగా చేస్తారు.
(02:52) వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి మూర్ఖం చెందోనువృత్తేన మూర్ఖుడిని వాడు చెప్పే మాటలకు అవును అని తలుపుతూ వాడి ఇష్టానుసారంగా నటిస్తూ లొంగ తీసుకోవాలి. మూర్ఖుడికి మీరు ఎంత నిజం చెప్పినా అర్థం కాదు. వాడికి తన అజ్ఞానమే తెలివితేటలుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాణక్యుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళతో వాదించి మీ శక్తిని వృధా చేసుకోకండి వాడి ఎండలో చలేస్తోంది అంటే అవును చాలా చలిగా ఉంది అని వాడికి అనుకూలంగానే మాట్లాడి మెల్లగా మీ పనిని పూర్తి చేసుకోండి.
(03:24) సోషల్ మీడియాలో లేదా ఆఫీసుల్లో కొందరు లాజిక్ లేకుండా వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో వాదించడం కంటే మీరు చెప్పింది పాయింటే కదా అని ఒప్పేసుకొని అక్కడి నుండి తప్పుకోవడం లేదా మీ వైపు తిప్పుకోవడమే మంచిది తత్వార్తేనచ పండితం జ్ఞానిని లేదా పండితుడిని కేవలం నిజాయితి సత్యంతో మాత్రమే గెలవగలం. తెలివైన వారికి మీరు డబ్బుఇచ్చినా పడరు పొగిడినా లొంగిపోరు అబద్ధాలు చెబితే అస్సలు నమ్మరు వారికి కావలసింది లాజిక్ నిజాయితి మీరు చెప్పే మాటల్లో నిజం ఉంటే వాళ్ళు మీకు ప్రాణ స్నేహితులు అవుతారు గొప్ప మేధావులతో లేదా నిబద్ధత ఉన్న వ్యక్తులతో డీల్ చేసేటప్పుడు
(04:04) పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం మీ ప్లాన్ ఏంటి మీ ఉద్దేశం ఏంటి అన్నది స్పష్టంగా చెబితే వాళ్ళు మీ మేధస్సును గౌరవించి మీకు అండగా నిలు స్తారు చాణక్యుడు చెప్పిన ఈ నాలుగు సూత్రాలు నేటికి ఎంతో పవర్ఫుల్ ఎంతో అవసరం ఆశ ఉన్నవాడికి ధనం అహంకారం ఉన్నవాడికి గౌరవం మూర్ఖుడికి ఒత్తాసు పలకడం జ్ఞానికి నిజాయితి ఈ సూత్రాలను మీరు సరిగ్గా అప్లై చేస్తే మీ వృత్తిపరమైన వ్యక్తిగతమైన జీవితంలో ఎదురుండదు.
(04:37) ఒక మనిషి మీతో చాలా తీయగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ లోపల ఏదో కుట్ర చేస్తున్నాడని మీకు అనిపిస్తుందా లేదా ఒక మీటింగ్ లో ఎవరికీ తెలియని రహస్యాలను కేవలం వాళ్ళను చూడడం ద్వారానే మీరు కనిపెట్టగలరా చాణిక్యుడు తన చాణిక్య నీతిలో ఒక అద్భుతమైన మాట అంటాడు ఒక మనిషి మనసులోని భావాలను వారి మాటల కంటే వారి శరీర భాష అంటే బాడీ లాంగ్వేజ్ ద్వారానే కనిపెట్టొచ్చు శత్రువుల ఎత్తుగడలను ముందే పసిగట్టాలన్నా లేదా ఒక డీల్లో విజయం సాధించాలన్నా మనకు ఉండాల్సిన అతి పెద్ద ఆయుధం అబ్జర్వేషన్ ఎదుటివాళ్ళను ఎక్స్రే తీసే చాణిక్యుడి సైకలాజికల్ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
(05:24) [సంగీతం] చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ముఖకవళికల అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఒకచోట ఇలా అంటాడు ఆకార్యై రింగితర్గ్య చేష్టయ భాషణేనచ నేత్రవక్ర వికారైస్చ గృహ్యతేంతర్గతంమనః అంటే ఒక మనిషి ముఖం కళ్ళు నడక మాట్లాడే తీరును బట్టి వాళ్ళ మనసులోని అసలు ఆలోచన చనలను గ్రహించొచ్చు ముఖ్యంగా కళ్ళఎప్పుడు అబద్ధం చెప్పవు ఇందులో ప్రాధాన్యాలను వరుసగా చూద్దాం ఐ కాంటాక్ట్ మీరు ఎదుటి మనిషి కళ్ళల్లోకి నేరుగా చూసి మాట్లాడుతున్నప్పుడు మీలో తెలియని ఒక ఆర లేదా ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఇది
(06:12) అవతలి వ్యక్తిపై ఒక రకమైన మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీరు నిజం చెబుతున్నారని దేనికి భయపడడం లేదని వాళ్ళకు అర్థమవుతుంది. నేటి ఇంటర్వ్యూలో లేదా బిజినెస్ డీల్స్ లో కళ్ళు తిప్పుతూ మాట్లాడే వాళ్ళను నమ్మదగని వ్యక్తులుగా చూస్తారు. అందుకే చాణక్యుడు చెప్పినట్టు కళ్ళల్లోకి చూసి మాట్లాడడం అన్నది మీ వ్యక్తిత్వాన్ని శక్తివంతంగా మారుస్తుంది.
(06:35) గడగడ మాట్లాడేస్తే తెలివైన వాళ్ళమని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ చాణక్యుడు దీనికి పూర్తి విరుద్ధంగా చెబుతున్నాడు. నిశశబ్దంగా ఉండడమే అసలైన గెలుపు అని ఆయన నమ్మాడు ఎందుకో చూద్దాం చాణిక్యడి ప్రకారం మనం ఎక్కువగా మాట్లాడితే మన రహస్యాలే బయటపడుతూ ఉంటాయి. అదే మనం మౌనంగా ఉండి ఎదుటి వాళ్ళను గమనిస్తే వాళ్ళ బలహీనతలు మనకు అర్థంవుతాయి.
(07:00) ఒక చర్చ జరుగుతున్నప్పుడు మీరు నిశశబ్దంగా ఉంటే ఎదుటి మనిషి ఆ నిశశబ్దాన్ని భరించలేక ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే వాళ్ళు తమ అసలు ఉద్దేశ్యాలను లేదా బలహీనతలను అంటే వీక్ పాయింట్స్ ను తెలియకుండానే బయట పెట్టేస్తూ ఉంటారు. దీన్నే సైకాలజీలో యక్టివ్ లిజనింగ్ అంటారు. ఒక సేల్స్ మన్ లేదా లీడర్ తక్కువ మాట్లాడి క్లైంట్ చెప్పేది ఎక్కువ గమనిస్తే ఆ క్లైంట్ కి ఏం కావాలో సులువుగా తెలుసుకోవచ్చు.
(07:30) ఎదుటివారు తడబడుతున్నారా తలగోక్కుంటున్నారా పదే పదే ఫోన్ చూస్తున్నారా లాంటివి గమనిస్తే వాళ్ళు అసౌకర్యంగా ఉన్నారా లేక మీతో బాగున్నారా అన్నది తెలిసిపోతుంది. వీటిని గమనించడం ద్వారా మీరు ఆ పరిస్థితిని కంట్రోల్ చేయొచ్చు. ఒక మనిషి నడిచే తీరు కూడా అతడి మానసిక స్థితిని చెబుతుంది. చాణక్యుడు రాజ్యసభలో అడుగు పెట్టినప్పుడే ఎవరు భయపడుతున్నారు ఎవరు కుట్ర చేస్తున్నారు అన్న రహస్యాలను వాళ్ళ నడకను బట్టి గుర్తుపట్టేవాడు.
(07:58) వెన్నెముక నిటారుగా ఉంచి నడిచే వ్యక్తిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. అదే భుజాలు కిందికి వాల్చి నడిచేవారు మానసిక ఒత్తిడిలో లేదా భయంలో ఉన్నారని అర్థం ముఖం మీద క్షణకాలం పాటు వచ్చి వెళ్లే మార్పులను చాణక్యుడు నిశితంగా గమనించమంటాడు. మనం ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పినప్పుడు ఎదుటివారి ముఖంలో భయం కనిపిస్తుందా లేదా సంతోషం కనిపిస్తుందా అన్నది గమనిస్తే వారు మన పక్షాన ఉన్నారో లేదో తెలిసిపోతుంది.
(08:26) మనం మాట్లాడే మాటల కంటే మన శరీరం చేసే సంకేతాలే చాలా పవర్ఫుల్ చాణక్యుడి ఈ బాడీ లాంగ్వేజ్ సూత్రాలను అర్థం చేసుకుంటే మనుషులను చదవడం మీకు వెన్నతో పెట్టిన విద్య అవుతుంది. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎప్పుడూ తక్కువ మాట్లాడతారు ఎక్కువ గమనిస్తారు. మీరు కూడా ఈ రోజు నుండి మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ను పెంచుకోండి. ఒక పనిని సాధించుకోవడానికి ఒకే మార్గం సరిపోదు.
(08:53) ఒక్కోసారి మంచిగా చెబితే వింటారు మరి కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వస్తుంది. అయితే ఏ సమయంలో ఏ అస్త్రాన్ని ప్రయోగించాలో తెలుసా? భారతీయ రాజనీతి శాస్త్ర పితామహుడు చాణక్యుడు ప్రపంచానికి అందించిన నాలుగు అద్భుతమైన వ్యూహాలే సామ దాన భేద దండోపాయాలు ఈ నాలుగు సూత్రాలు కేవలం యుద్ధాలకే కాదు నేటి కార్పొరేట్ ఆఫీసుల నుండి మన ఇంటి వరకు ప్రతి చోట ఎలా పని చేస్తాయో చూద్దాం [సంగీతం] మొదటిది సామ అంటే శాంతియుతంగా ప్రేమగా నచ్చ చెప్పి పని పూర్తి చేసుకోవడం
(09:40) చాణక్యుడి ప్రకారం ఏ సమస్యనైనా మొదట చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఎదుటివారిని గౌరవిస్తూ వారిని ఒప్పించడం వల్ల శత్రువు కూడా మిత్రుడు అవుతాడు. ఆఫీసులో ఒక టీం మెంబర్ సరిగ్గా పని చేయకపోతే మొదట వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యను అర్థం చేసుకుని ప్రోత్సహించడం సామ ఇది సంబంధాలను బలపరుస్తుంది.
(10:05) సామ మార్గం పని చేయనప్పుడు ఉపయోగించాల్సింది దాన ఇక్కడ దాన అంటే కేవలం దానం చేయడం కాదు ప్రతిఫలం ఇవ్వడం ఎదుటి వ్యక్తికి ఏదైనా ఆశ చూపడం లేదా వారికి లబ్ది చేకూర్చడం ద్వారా మన వైపుకు తిప్పుకోవడం బిజినెస్ లో క్లైంట్లకు ఇచ్చే డిస్కౌంట్లు ఉద్యోగులకు ఇచ్చే బోనస్లు లేదా ప్రమోషన్లు అన్నీ ఈ దాన తంత్రం కిందికే వస్తాయి. లాభం ఎక్కడ ఉంటుందో జనం అక్కడ ఉంటారు.
(10:30) ఎదుటివారు మొండిగా ఉండి మన మాట విననప్పుడు చాణిక్యుడు సూచించిన మూడో మార్గం భేద భేద అంటే విభజించడం ప్రత్యర్తుల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం లేదా వారి ఆలోచనల్లో సందేహాన్ని కలిగించడం వారిలో వారు గొడవ పడేలా చేయడం ద్వారా మీ పని సులభంవుతుంది. మార్కెటింగ్ యుద్ధాల్లో ఒక కంపెనీ తన ప్రత్యర్తి కంపెనీలోని లోపాలను ఎత్తిచూపుతూ కస్టమర్ల మైండ్ మారుస్తుంది.
(10:57) దీన్ని కాంపిటీటివ్ అనాలసిస్ అని కూడా అనుకోవచ్చు. ఈ మూడు మార్గాలు విఫలమైనప్పుడు మాత్రమే ఉపయోగించాల్సిన చివరి అస్త్రం దండ. దండ అంటే హింస అని కాదు క్రమశిక్షణ లేదా కఠిన చర్య. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించడం. ఇది భయం కలిగించి వ్యవస్థను దారిలో పెడుతుంది. కంపెనీ నిబంధనలు అతిక్రమించే వారికి ఇచ్చే మెమోలు డీ ప్రమోషన్లు లేదా లీగల్ నోటీసులు అన్నీ ఈ దండనీతిలో భాగమే వ్యవస్థలో క్రమశిక్షణ ఉండాలంటే ఈ అస్త్రం అవసరం.
(11:34) ఈ నాలుగు తంత్రాలను సందర్భాన్ని బట్టి ఉపయోగించినవాడే అసలైన విజేత. చాణక్యుడు ఈ మేనేజ్మెంట్ పాఠాలను మీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించుకోండి. ముగించే ముందు ఒక మాట ధాత్రి టీవీ వీడియోలను మిలియన్ల సంఖ్యలో ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు మా గణాంకాల ప్రకారం చాలామంది ఇంకా మా ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోలేదని తెలుస్తోంది. మా పరిశోధనాత్మక కథనాలు మరిన్ని చూడాలంటే వెంటనే ధాత్రి టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో 10 మందితో చేయించండి.
(12:02) తరువాతి ఎపిసోడ్ చాణక్య నీతి తొమ్మిదిలో ఆత్మవిశ్వాసానికి అహంకారానికి మధ్య ఉన్న తేడా గురించి చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. [సంగీతం]

No comments:

Post a Comment