Sunday, May 10, 2026

చాణక్య నీతి-9: గెలవాల్సింది ప్రపంచాన్ని కాదు…నిన్ను నువ్వు | Chanakya Neeti | Pamidikalva Madhusudan

చాణక్య నీతి-9: గెలవాల్సింది ప్రపంచాన్ని కాదు…నిన్ను నువ్వు | Chanakya Neeti | Pamidikalva Madhusudan

Author Name:Dhatri TV

Youtube Channel Url:https://www.youtube.com/@dhatritvtelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=jWxINO0ozY0



Transcript:
(00:00) బిబిజి వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబలిగా ఎదుగుతున్న బేవల్లి హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. [సంగీతం] [సంగీతం] చరిత్రలో మనం ఎందరో వీరులను చూసాం. అలెగ్జాండర్ నుండి అశోకుడి వరకు అజయమైన సామ్రాజ్యాలను నిర్మించిన వారెందరో కానీ ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించిన వీరులు కూడా తమ సొంత బలహీనతల ముందు ఓడిపోయి ఎందుకు కొరగాని వారిగా మిగిలిపోయారు.
(00:34) చాణక్య నీతిలో ఇప్పటివరకు మనం రాజ్య తంత్రాల గురించి శత్రువును ఎలా దెబ్బతీయాలి అన్న వ్యూహాల గురించి చర్చించుకున్నాం. కానీ ఈ ఎపిసోడ్ లో చర్చించబోయే అంశం అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనది నీ బయటఉన్న శత్రువు నిన్ను ఒక్కసారి మాత్రమే ఓడిస్తాడు కానీ నీ లోపల ఉన్న శత్రువు నిన్ను ప్రతిరోజు ఓడిస్తూనే ఉంటాడు అంటాడు చాణక్యుడు మీరు ముందు గెలవాల్సింది ప్రపంచాన్ని కాదు మిమ్మల్ని మీరు మీలోని కోపం మీలోని అలసత్వం మీలోని అహంకారం ఇవే మీ విజయానికి అడ్డుపడుతున్న అసలైన గోడలు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడం కంటే అంటే తన మనసును ఒక క్రమ శిక్షణలో
(01:15) ఉంచడం చాలా కష్టమైన పని ఈ సందర్భంలో చాణక్యుడు చెప్పిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనం గమనించాలి. ఇంద్రియాని వసేకృత్వా ధారయేత్ కార్యసాధకః నాన్యతా సిద్ధి మాప్నోతి క్రోధావేషేన మానవః ఎవరైతే తమ ఇంద్రియాలను అంటే తన మనసును కోరికలను తన అదుపులో ఉంచుకుంటాడో వాడే అసలైన కార్యసాధకుడు అవుతాడు. అలా కాకుండా కోపావేశాలకు ఇంద్రియ సుఖాలకు లొంగిపోయినవాడు ఎంత మేధావైనా సరే జీవితంలో విజయాన్ని కానీ శాంతిని కానీ పొందలేడు.
(01:51) చాణిక్యుడి దృష్టిలో నిగ్రహం అంటే నిన్ను నువ్వు బంధించుకోవడం కాదు నీ శక్తిని ఒకే దిశలో ప్రవహింపచేయడం ఇంద్రియాలను జయించని రాజు తన రాజ్యాన్ని కూడా కాపాడుకోలేడని ఆయన హెచ్చరిస్తాడు. అది ఆనాటి రాజులకైనా ఈనాటి యువతకైనా ఒకేలా వర్తిస్తుంది. మన జీవితం ఒక యుద్ధరంగం అయితే మన శత్రువులు బయట ఎక్కడో లేరు మన కళ్ళు చూసే ఆకర్షణల్లో మన చెవులు వినే విమర్శల్లో మన మనసు కోరుకునే తాత్కాలిక సుఖాల్లోనే ఆ శత్రువులు ఉన్నారు.
(02:26) మనకు ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి ఐదు గుర్రాలు లాంటివి ఈ గుర్రాలు మీ నియంత్రణలో ఉంటే మీరు విజేతలు అదే ఈ గుర్రాల నియంత్రణలో మీరు ఉంటే మీరు పతనం వైపు పయనిస్తున్న బాటసారులు మనం ఎంత చదివామ అన్నది కాదు ముఖ్యం ఆ చదువు మనకు ఎంత నిగ్రహాన్ని ఇస్తుంది అన్నదే ముఖ్యం ఇంద్రియాలను వశం చేసుకోవడం అంటే వాటిని చంపేయడం కాదు వాటిని సరైన మార్గంలో పెట్టడం ఇంద్రియాని వశేకృత్వ అంటే తన కళ్ళను చెవులను స్పర్శను రుచిని మనసును ఎవరైతే తన గుప్పిట్లో ఉంచుకుంటారో వారి మేధస్సు పదును పెట్టిన వజ్రంలా మెరుస్తూ ఉంటుంది.
(03:06) అలాంటి వ్యక్తికి అసాధ్యమైన పని అంటూ ఈ భూమిమీద ఏది ఉండదు. క్రమశిక్షణ లేని మేధస్సు పదును లేని కత్తి లాంటిది అని అంటాడు చాణక్యుడు ఒక కత్తికి పదును లేకపోతే అది శత్రువును గాయపరచలేదు సరి కదా నీ చేతికే భారం అలాగే ఒక మనిషికి ఎంత మేధస్సు ఉన్నా ఎంత తెలివితేటలు ఉన్నా అతడికి గనుక ఇంద్రియ నిగ్రహం లేకపోతే అతడి మేధస్సు వినాశనానికే దారి తీస్తుంది. ఉదాహరణకు ఒక విద్యార్థికి అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండొచ్చు కానీ అతడికి తన స్మార్ట్ ఫోన్ లేదా సోషల్ మీడియా మీద నిగ్రహం లేకపోతే ఆ జ్ఞాపక శక్తి వ్యర్థమైపోతుంది.
(03:43) అనవసరపు అలవాట్లకు వ్యసనాలకు లొంగిపోవడం అంటే నీ చేతిలో ఉన్న అస్త్రానికి నువ్వే తుప్పు పట్టించుకోవడం లాంటిది. ఈ రోజుల్లో ఇంద్రియాలను ఆకర్షించే అంశాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతి అడుగులో ఒక ఆకర్షణ ఉంటుంది. మన నోరు మంచి రుచి కోసం పాకులాడుతుంది. మన కళ్ళు నిరంతరం వినోదం కోసం వెతుకుతూ ఉంటాయి. మేధావి లక్షణం ఏంటంటే ఏది నాకు అవసరం ఏది నాకు అనవసరం అనే విచక్షణ కలిగి ఉండడం లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు దారి పక్కన ఎన్ని పూలతోటలు ఎన్ని ఆకర్షణలు కనిపించినా ఆగకుండా సాగిపోవడమే ఇంద్రియ నిగ్రహం ఎవరో ఏదో అన్నారని కోపంతో ఊగిపోవడం కాదు ఆ మాటలను పట్టించుకోకుండా
(04:24) నీ పని నువ్వు చేసుకోవడమే అసలైన విజేత లక్షణం నీ బలహీనతలే శత్రువుకు బలం కాకూడదు అంటాడు చాణిక్యుడు నీ ఇంద్రియాలు నీకు దాసోహం అనాలి తప్ప నువ్వు వాటికి దాసుడువి కాకూడదు. నేటి నుంచే ఒక చిన్న ప్రయత్నం చేయండి మనసును నియంత్రించడం నేర్చుకోండి అనవసరపు మాటలకు వ్యాపకాలకు స్వస్తి చెప్పండి. అప్పుడు మీ మేదస్సు ఒక పదునైన ఆయుధంలా మారుతుంది.
(04:49) అది మిమ్మల్ని ఏ కార్యంలో అయినా గెలిపిస్తుంది గుర్తుంచుకోండి ఇంద్రియాలను గెలిచినవాడు మాత్రమే ఈ లోకాన్ని గెలవగలడు. కోపం ఇది రెండంచుల కత్తి లాంటిది సరిగ్గా వాడితే నిన్ను గెలిపిస్తుంది లేదంటే నిన్నే నరికేస్తుంది. లోకంలో అందరికీ కోపం వస్తూ ఉంటుంది. కానీ ఆ కోపాన్ని ఏం చేయాలో తెలిసినవాడు మాత్రమే విజేత అవుతుంటాడు. కోపం వచ్చినప్పుడు నీ విచక్షణ చచ్చిపోతుంది.
(05:15) విచక్షణ లేని మనిషికి మృగానికి తేడా ఉండదు. కోపంలో తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యతో సమానం ఎందుకంటే ఆ క్షణంలో నీకు కేవలం పగ మాత్రమే కనిపిస్తుంది. పరిణామాలు కనిపించవు అసలు ఈ కోపాన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక అజేయమైన ఆయుధంగా ఎలా మార్చుకోవాలో చాణక్యుడి జీవితం నుండే మనం నేర్చుకోవాలి. చాణక్యుడు తన శిష్యులకు కోపం గురించి ఇలా బోధించాడు. అపరాదేపిన కృజేత్ కింతు విచారయేత్ క్రోధః పరమశత్రుహు సర్వనాశకరో భవేత్ ఎదుటివాడు తప్పు చేసిన నీకు అపకారం చేసిన వెంటనే కోపంతో ఊగిపోవద్దు ముందు ఆలోచించు కోపం నీ లోపల ఉన్న పరమ శత్రువు అది నీ సంపదను నీ గౌరవాన్ని చివరికి నిన్ను నాశనం
(06:01) చేసేస్తుంది. చాణక్యుడి ఉద్దేశం కోపాన్ని పూర్తిగా చంపేయమని కాదు కోపాన్ని ప్రదర్శించవద్దు అంటే ఎక్స్ప్రెస్ చేయొద్దు దాన్ని నిక్షిప్తం చేసుకో అంటే స్టోర్ చేసుకోమంటున్నాడు ఆవేశం బయటకు వస్తే అది శక్తిని కోల్పోతుంది అదే ఆవేశం లోపల అణచి పెడితే అదిఒక గొప్ప సంకల్పంగా మారుతుంది. దీనికి మనకు చాణక్యుడి జీవితమే పెద్ద ఉదాహరణ.
(06:28) నాడు మగధ సామ్రాజ్య సభలో నందరాజులు చాణక్యుడిని ఘోరంగా అవమానించి బయటకు గెంటినప్పుడు ఆయన అక్కడికక్కడే వారిపై దాడి చేయలేదు ఆవేశంతో అరచి తన శక్తిని వృధా చేసుకోలేదు ఆయన తన కోపాన్ని తన లోపలే అణచుకున్నాడు. ఆ కోపాన్ని ఒక ఆయుధంలా మార్చుకున్నాడు. తన శిఖను ముడివేయకుండా ఆ కోపాన్ని ఒక నిరంతర పట్టుదలగా మార్చి సామాన్యుడైన చంద్రగుప్తుడిని సామ్రాజ్యాది నేనేతను చేశాడు.
(06:57) నందవంశాన్ని తుడిచిపెట్టే వరకు ఆయన ప్రశాంతంగా నిద్రపోలేదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాణక్యుడి కోపం విధ్వంసం చేయలేదు ఒక కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించింది. కోపం వచ్చినప్పుడు మనిషికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి వెంటనే అరిచి గొడవపడి తనకున్న విలువను తగ్గించుకోవడం దీన్ని విచక్షణ కోల్పోవడం అంటారు. ఇక రెండోది నీకు జరిగిన అవమానాన్ని గుర్తుంచుకొని నీ గెలుపు ద్వారానే ఎదుటివారికి సమాధానం చెప్పాలనుకోవడం దీన్ని పట్టుదల అంటారు.
(07:27) శత్రువు నిన్ను రెచ్చగొడుతున్నాడు అంటే అతడు నిన్ను బలహీన పరుస్తున్నాడని అర్థం అని అంటాడు చాణక్యుడు వాడు రెచ్చగొట్టినప్పుడు నువ్వు కోప్పడితే వాడు గెలిచినట్టే నువ్వు చిరునవ్వుతో ఆ కోపాన్ని దాచుకుంటే నువ్వు గెలిచినట్టే నీ కోపం శత్రువుకు భయం కలిగించాలి తప్ప నీ మీద జాలి కలిగించకూడదు. సో నేటి నుండి మీకు కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగండి ఆ కోపాన్ని బయటకి వదిలేసి ఓడిపోతారా లేక లోపల దాచుకొని పట్టుదలగా మార్చుకొని గెలుస్తారా అన్నది మీకు మీరే నిర్ణయించుకోండి.
(07:57) కోపాన్ని బలహీనతగా మార్చుకొని పతనం కాకండి దాన్ని ఆయుధంగా మార్చుకొని విజేతలుగా నిలవండి. ఆవేశాన్ని అణచుకొని ఆలోచనకు పదును పెట్టడమే అసలైన చాణక్య నీతి. జీవితంలో శిఖరాలను అధిరోహించాలంటే మనకు కావాల్సింది ఆత్మవిశ్వాసం కానీ ఆ శిఖరం పైకి వెళ్ళాక కింద ఉన్నవారు చాలా చిన్నగా కనిపిస్తే అది అహంకారం ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని తేడాను గుర్తించకపోతే మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక్క క్షణంలోనే పతనం కాక తప్పదు నీ మీద నీకు నమ్మకం ఉండడం నీ బలం ఎదుటివాడు నీకంటే తక్కువ అని అనుకోవడం నీ బలహీనత అని అంటాడు చాణక్యుడు చాలామంది ఈ రెండి రెండింటికి మధ్య ఉన్న ఆ సన్నని
(08:40) గీతను పట్టించుకోరు దాటేస్తుంటారు. అసలు ఈ నేను అన్న భావం విజయానికి ఎలా దారి తెస్తుంది అది వినాశనానికి ఎప్పుడు మారుతుందో చూద్దాం విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాబ్ధనమాప్నోతి తనాధర్మం తతసుఖం విద్య వినయాన్ని ఇస్తుంది ఆ వినయం యోగ్యతని ఇస్తుంది. యోగ్యత ఉన్నవాళ్ళకే సంపద దక్కుతుంది.
(09:09) ఆ సంపదతో ధర్మం చేసి మనిషి శాశ్వతమైన సుఖాన్ని పొందుతాడు. ఇక్కడ విజయానికి మొదటి మెట్టు వినయం నేను ఈ పని చేయగలను అని అనడం నీ సామర్థ్యం మీద నీకున్న నమ్మకం కానీ నేను మాత్రమే చేయగలను అన్నప్పుడు నీలో అహంకారం ఉన్నట్లు లెక్క అహంకారం నీ కళ్ళకు గంతలు కడుతుంది. ఎదుటివాడిలో ఉన్న ప్రతిభను చూడనివ్వదు నీలోని తప్పులను సరిదిద్దుకోనివ్వదు అహంకారం ఒక మత్తు లాంటిది అది మనిషికి తాను అజేయుడిన అనే భ్రమను కలిగిస్తుంది.
(09:38) నాటి రావణుడు హిరణ్యకశపుడు లాంటివారు అజయులే కానీ వారి పతనానికి కారణం వారి అహంకారం చాణిక్యుడు తన మౌర్య సామ్రాజ్య స్థాపనలో ఎంతో మంది మేధావుల సహాయం తీసుకున్నాడు. ఆయన ఎప్పుడూ అంతా నాకే తెలుసు అని అనుకోలేదు ఒక విజయవంతమైన వ్యక్తి లక్షణం ఏంటంటే ఎంత ఎదిగినా నేల మీద నడవడం మరచిపోకూడదు జ్ఞానం పెరిగే కొద్ది వినయం కూడా పెరగాలి.
(10:03) ఉంగి ఉన్న చెట్టు గాలివానలో కూడా నిలబడుతుంది కానీ గర్వంగా నిటారుగా ఉన్న చెట్టు విరిగిపోతుంది. జీవితం కూడా అంతే ఆత్మవిశ్వాసం మీకు జ్ఞానం ద్వారా వస్తుంది. నీ సామర్థ్యాలను నువ్వు గుర్తించు నీ తప్పులను నువ్వు ఒప్పుకో అహంకారి తన తప్పులను ఎప్పుడూ ఒప్పుకోడు అందుకే అతడు నేర్చుకోవడం ఆపేస్తాడు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాడు.
(10:28) ఎందుకంటే అతడికి తెలుసు తాను ఇంకా ఎదగాలని వినయమే నీ జ్ఞానానికి అసలైన కిరీటం కావాలి. విజయం చేరాల్సిన ఒక గమ్యస్థానం కాదు అదొక నిరంతర ప్రయాణం మనం ఒక్కసారి గెలిచాం కదా అని విశ్రాంతి తీసుకుంటే కాలం మనల్ను వెనక్కు నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. చాణక్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించి తన శబదం నెరవేర్చుకున్నాక వెళ్లి సింహాసనం మీద కూర్చోలేదు.
(10:53) తన పగ తీరింది కదా అని విలాసాల్లో మునిగిపోలేదు. దేశాన్ని సుస్థిరం చేసే వరకు మౌర్య సామ్రాజ్యం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే వరకు ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. మీ ప్రయాణం కూడా అలాగే సాగాలి. నిన్నటి విజయం నేటి ఉత్సాహం మాత్రమే కావాలి. అది నీ గమ్యం కాకూడదు అక్కడే ఆగిపోకూడదు. నిన్ను నువ్వు గెలిచిన రోజు ఈ ప్రపంచమే నీ వెనుక నడుస్తుంది.
(11:19) తర్వాత ఎపిసోడ్ చాణక్య నీతి 10 లో అత్యంత ఆసక్తికరమైన అంశం సమయపాలన గురించి చర్చించుకుందాం. ముగించే ముందు ఒక మాట ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వాళ్ళు వెంటనే ధాత్రి టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో 10 మందితో చేయించండి

No comments:

Post a Comment