8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు | Psychology Explained
Author Name:Jeevitha Satyalu
Youtube Channel Url:https://www.youtube.com/@JeevithaSatyalu19
Youtube Video URL:https://www.youtube.com/watch?v=BdVSxz_NZiA
Transcript:
(00:00) ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు నిద్రపోయే విధానం పూర్తిగా మారిపోతుంది. ట్రై చేసి చూడండి గంటల తరబడి పడుకున్నా ఉదయం లేవగానే ఇంకా అలసటగా ఫీల్ అవుతుందా? ఎనిమిది గంటలు నిద్రపోయా కదా ఇంకా ఈ నీరసం ఎందుకు అనిపించిందా? అయితే మీరు నిద్రపోతున్న విధానంలోనే ప్రాబ్లం ఉంది. ఈరోజు మనం డీకోడ్ చేయబోయేది స్మార్ట్ స్లీప్ సీక్రెట్ రాత్రి బాగానే రెస్ట్ తీసుకున్నాం కదా అయినా ఈ ఎనర్జీ ఎటు పోయింది అనిపిస్తుందా? అదే అసలు ప్రశ్న ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
(00:35) మనం అనుకుంటున్నది మొత్తం తప్పు మరి మొదట ఏది బ్రేక్ చేయాలో తెలుసా? ఈఎనిమిది గంటల నిద్ర అనే అపోహని దశాబ్దాలుగా మనం నమ్ముతున్న ఈ రూల్ వెనుక అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ వస్తుంది. కరెక్ట్ గాఎనిమిది గంటలు పడుకున్నా కూడా ఉదయం ఎందుకు ఇంకా అలసటగా ఫీల్ అవుతాం ఎవరో గట్టిగా కొట్టినట్లుగా ఎందుకు అనిపిస్తుంది? ఇదే అసలు మిస్టరీ ఇది మీరు గమనించే ఉంటారు.
(01:03) ఒక వ్యక్తి ఐదు గంటలు పడుకున్నా ఫ్రెష్ గా ఉంటాడు. మరో వ్యక్తి ఎనిమిది గంటలు పడుకున్న అలసటగా ఉంటాడు. అసలు ఇది ఎలా సాధ్యం కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మన బ్రెయిన్ కి మనం ఎన్ని గంటలు నిద్రపోయాము అనేది అస్సలు మేటర్ కాదు. మరి ఆ క్వాలిటీ ఎందుకు దెబ్బ తింటుంది? దానికి మెయిన్ రీజన్ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్. అంటే ఏంటంటే మన మంచం మీద మన బాడీ అయితే రెస్ట్ తీసుకుంటుంది.
(01:29) కానీ మన మైండ్ మాత్రం రికవరీ అవ్వదు. ఎందుకంటే నిద్రపోయే ముందు చూసే మొబైల్ బ్లూ లైట్ కావచ్చు లేదా మన బుర్రలో తిరిగే టెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కనిపించని డిస్టర్బెన్సెస్ అన్నమాట. ఈ డిస్టర్బెన్సెస్ వల్ల మెదడు తనకు అవసరమైన డీప్ రికవరీ మోడ్ లోకి వెళ్ళలేక మొత్తం నిద్రే పాడైపోతుంది. ఇక్కడి నుంచి అసలు గేమ్ మారుతుంది. 90 మినిట్స్ బ్రెయిన్ సైకిల్ మన బ్రెయిన్ గంటలు లెక్క పెట్టదు.
(01:55) అది సైకిల్స్ ఫాలో అవుతుంది. ఇది చాలామంది మిస్ అవుతారు. అందుకే ఉదయం అలసట పోదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మ్యాజిక్ నెంబర్ ఉంది. అదే 90 అవును మన నిద్రలో ఒక పూర్తి సైకిల్ 90 మినిట్స్ ఇది తెలియకపోతే మీరు ఎన్ని గంటలు నిద్రపోయినా వృధానే అంటే ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఎగజాక్ట్ గా 90 మినిట్స్ మన బ్రెయిన్ రెస్ట్ తీసుకునే ప్రాసెస్ అంతా కూడా ఈ 90 మినిట్స్ రిథం పైనే డిపెండ్ అయి ఉంటుంది.
(02:27) మరి ఈ 90 మినిట్స్ లో లోపల ఏం జరుగుతుందో తెలుసా? ఒక పర్ఫెక్ట్ నిద్ర అంటే ఈ టైం ఫ్రేమ్ లో రెండు రకాల స్టేజెస్ బాలెన్స్ అవ్వాలి. ఫస్ట్ ద డీప్ స్లీప్ ఇది మన ఫిజికల్ బాడీ రిపేర్ కోసం అంటే కండరాలు రికవరీ అవ్వడం ఇమ్యూనిటీ పెరగడం గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడం లాంటివి ఇక్కడ జరుగుతాయి. ఇక రెండవది ఆర్ఈఎం స్లీప్ ఇది మన మెంటల్ రికవరీకి అన్నమాట.
(02:55) మన ఎమోషన్స్ ని బాలెన్స్ చేయడం మెమరీస్ ని స్టోర్ చేయడం క్రియేటివిటీని పెంచడం లాంటివి ఇక్కడ జరుగుతాయి. ఈ రెండు స్టేజెస్ కలిస్తేనే అసలైన కంప్లీట్ నిద్ర. ఇప్పుడు మూడో పాయింట్ హానికరమైన స్లీప్ ఇనర్షియా ఇక్కడే చాలా మంది పొరబడతారు. ఇంత సిస్టమాటిక్ గా జరిగే మన బయోలాజికల్ రిథం కి అకస్మాత్తుగా ఏదైనా బ్రేక్ పడితే ఏమవుతుంది? ఇక్కడే అసలు ప్రాబ్లం అంతా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి.
(03:22) ఆ 90 మినిట్స్ స్లీప్ సైకిల్ మధ్యలో సరిగ్గా బ్రెయిన్ ఫుల్ రికవరీ ప్రాసెస్ లో ఉన్నప్పుడు టక్కున అలారం మోగితే ఏమవుతుంది దాన్నే సైన్స్ భాషలో స్లీప్ ఇనర్షియా అంటారు. ఇది ఎలా ఉంటుందంటే కంప్యూటర్ లో ఏదో పెద్ద సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుండగా మధ్యలో మనం ప్లగ్ పీకేస్తే ఎలా ఉంటుంది సేమ్ అంతే రికవరీ ప్రాసెస్ మధ్యలో షార్ట్ సర్క్యూట్ అయిపోయి దాని రిజల్ట్ గా ఆ రోజంతా ఏదో భయంకరమైన బరువు మోస్తున్నట్లుగా ఫుల్ కన్ఫ్యూజన్ గా గడిచిపోతుంది.
(03:55) మరి ఇంత డేంజరస్ మగతను ఎలా అవాయిడ్ చేయాలి? దానికోసమే సైన్స్ ఈ పర్ఫెక్ట్ టైం బ్లాక్స్ ను సజెస్ట్ చేస్తుంది. అవేంటంటే 4అహఫ అవర్స్ 6 అవర్స్ లేదా 7.5 అవర్స్ మనం పడుకునే సమయాన్ని ఈ 90 మినిట్స్ మల్టిపుల్స్ లో ప్లాన్ చేసుకుంటే బ్రెయిన్ ఆ స్లీప్ మోడ్ నుంచి అలర్ట్ మోడ్ కి చాలా స్మూత్ గా ఎటువంటి జర్త్ లేకుండా మారుతుంది. సింపుల్ మాథ్స్ అన్నమాట.
(04:21) అయితే ఈ బయోలాజికల్ లెక్కలు కరెక్ట్ గా వర్క్ వుట్ అవ్వాలంటే ఒక చిన్న కండిషన్ ఉంది. ప్రతిరోజు ఒకే టైం కి నిద్రపోవడం ఒకే టైం కి లేవడం అనే దినచర్యను పక్కగా ఫాలో అవ్వాలి. అప్పుడే మన బాడీ క్లాక్ పర్ఫెక్ట్ గా సెట్ అయి ఆ నిద్రను కంట్రోల్ చేసే మెలటోనిన్ అనే హార్మోన్ కరెక్ట్ టైం కి చాలా నాచురల్ గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నాలుగవ పాయింట్ పవర్ డౌన్ ప్రోటోకాల్.
(04:46) మరి ఈ 90 మినిట్స్ స్లీప్ సైకిల్స్ కరెక్ట్ గా స్టార్ట్ అవ్వాలంటే మన బాడీకి కేవలం ఒక టైం టేబుల్ ఉంటే సరిపోదు. ఆ సిస్టం ను మెల్లగా షట్ డౌన్ చేయడానికి పక్కగా ఒక ఈవెనింగ్ ప్రొటోకాల్ అనేది కావాలి. మన బ్రెయిన్ ఏమైనా లైట్ స్విచ్ అనుకున్నామా బెడ్ మీద పడగానే టప్ మని ఆఫ్ అయిపోవడానికి అస్సలు కాదు రోజంతా ఉరుకులు పరుగులు పెట్టిన బ్రెయిన్ ను చాలా నెమ్మదిగా కూల్ చేయాలి.
(05:09) ఇక్కడే కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్ అనే ఒక సూపర్ సైకలాజికల్ ట్రిక్ వర్క్ వుట్ అవుతుంది. అంటే బాబు ఇక టెన్షన్స్ చాలు ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే సేఫ్ టైం వచ్చేసింది అని మన నరాల వ్యవస్థకు కావాలని మనం ఒక సిగ్నల్ పంపాలన్నమాట. దీనికోసమే ఈ అద్భుతమైన 32వ పవర్ డౌన్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు. ఇది ఫాలో అవ్వకపోతే మీ నిద్ర క్వాలిటీ ఎప్పటికీ ఫిక్స్ అవ్వదు.
(05:35) ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి రన్వే ఎలా అవసరమో మన బాడీకి కూడా అదే అవసరం. సో రూల్ ఏంటంటే పడుకునే మూడు గంటల ముందు ఎలాంటి హెవీ ఫుడ్ తీసుకోకూడదు. ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్ బాడీని యాక్టివ్ గా ఉంచుతుంది కాబట్టి ఇక రెండు గంటల ముందు ఆఫీస్ పనులు ప్రాబ్లం్ సాల్వింగ్ లాంటివి ఆపేయాలి. ఫైనల్ గా కరెక్ట్ గా ఒక గంట ముందు స్క్రీన్స్ అన్నింటికీ కంప్లీట్ గా గుడ్ బై చెప్పేయాలి.
(06:04) నో మొబైల్ నో టీవీ ఆ లాస్ట్ ఒక గంటలో స్క్రీన్స్ ప్లేస్ లో చిన్నగా స్ట్రెచ్చింగ్ చేయడం లేదా ఏదైనా మంచి పుస్తకం చదవడం లాంటివి చేస్తే అసలు ఏం జరుగుతుందంటే మన మెదడు ఎప్పుడూ హైపర్ అలర్ట్ గా ఉండే ఆ బీటా వేవ్ స్టేజ్ నుంచి చాలా ప్రశాంతంగా ఉండే ఆల్ఫా వేవ్ స్టేజ్ కి మారుతుంది. ఈ ఆల్ఫా వేవ్స్ ఉన్నప్పుడు మనకు అసలైన నాచురల్ నిద్ర మొదలవుతుంది.
(06:27) ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సరే నైట్ రొటీన్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఐదో పాయింట్ మార్నింగ్ రిథం రీసెట్ మనం ఉదయం నిద్రలేచిన మొదటి 10 నిమిషాలు ఎలా ఉంటామ అన్నదే ఆ రోజంతా మనం ఎంత యక్టివ్ గా ఉంటామ అనేదాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ మార్నింగ్ మబ్బును బద్ధకాన్ని వదిలించుకోవడానికి లీటర్లు లీటర్లు కాఫీ తాగాల్సిన అవసరం అస్సలు లేదు.
(06:54) జస్ట్ ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు. వన్ లేవగానే కాస్త సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి.టూ వెంటనే ఫోన్ స్క్రీన్ చూడకుండా ఉండాలి. అండ్త్రీ ముఖం మీద కాస్త చల్లటి నీళ్లు చల్లుకోవడం లేదా చిన్నపాటి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వినడానికి చాలా సింపుల్ గా ఉంది కదా కానీ దీని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. అసలు ఈ చిన్న పనుల వెనక ఉన్న ప్యూర్ బయోలాజికల్ మ్యాజిక్ ఏంటో తెలుసా? మనకి ఆ మార్నింగ్ సన్ లైట్ తగలగానే బాడీలో మూడ్ ను బూస్ట్ చేసే సెరటోనిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది.
(07:28) అలాగే ఆ చల్లటి నీళ్లు లేదా చిన్నపాటి మూవ్మెంట్ వల్ల మన నాడ వ్యవస్థ యక్టివేట్ అయి డోపమిన్ నోర్ ఎపినెఫ్రిన్ లాంటివి రిలీజ్ అవుతాయి. దాంతో మీలోని ఆ గ్రోగివెస్ అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది. అంతే ఇక ఫైనల్ అండ్ ఆరవ పాయింట్ విశ్రాంతి రికవరీల పట్ల మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. అసలు రెస్ట్ తీసుకోవడం అనగానే అదిఒక బద్ధకమైన అలవాటు అనే పాత ఆలోచనను మనం ఇక పూర్తిగా పక్కన పెట్టేయాలి.
(07:57) నిద్ర అనేది బద్ధకం కాదు అది మీ బ్రెయిన్ కి రికవరీ మోడ్ దాన్ని సరిగ్గా వాడితే మీ ఫోకస్ మీ ప్రొడక్టివిటీ లెవెల్ మారిపోతుంది. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు నేను నిద్రపోయింది నిజంగా రెస్ట్ కోసంనా లేక అలవాటు కోసంనా ఈ రోజు నుంచే 90 మినిట్స్ సైకిల్స్త్రీ టువన్ రూల్ ట్రై చేయండి. మార్పు మీకే తెలుస్తుంది. అది మిస్ అవ్వలేరు.
(08:23) ఈ వీడియో మీకు యూస్ అయిందంటే ఒక లైక్ కొట్టండి. ఇలాంటివి ఇంకా డీప్ గా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వకండి. మరి మీరు ఈరోజు నుంచి ఏ మార్పు స్టార్ట్ చేయబోతున్నారు కామెంట్ లో చెప్పండి. మనం తర్వాత వీడియోలో కలుద్దాం.
No comments:
Post a Comment