*(ఆధ్యాత్మిక కుటుంబాల స్పెషల్ ఫీచర్)* *ఒక చిన్న పక్షి తన గూడు ఎప్పుడూ ఒకే చెట్టుపై కట్టుకునేది.*
*ఒక్కసారి వర్షాలు ఎక్కువై ఆ చెట్టు బాగా అటు ఇటు ఊగి పడటానికి వచ్చేసింది.*
*అప్పుడూ గూడు పోయింది, పిట్ట కూడా తడిచింది.*
*తరువాత రోజు మళ్ళీ అదే చెట్టుపై గూడు కట్టింది.*
*“ఇది నాకు సౌకర్యంగా ఉంటుంది”, “ఇక్కడే నాకు బాగా తెలుసు” అనే భ్రమలతో... ఆ పిట్ట అదే చెట్టుపై మళ్ళీ మళ్ళీ గూడు కట్టేది.*
ప్రతి సారి గూడు పోయేది.
దాని పిల్లలు కూడా ప్రమాదాల్లో పడేవారు.
ఒక రోజు, చెట్టు పూర్తిగా నేలకొరిగింది.
ఆ పిట్టకు చివరికి అర్థమైంది – "సౌకర్యం" అనేది మనం ఊహించుకున్న పరిమితి మాత్రమే.
👉కొత్త చెట్టుపై, సురక్షితమైన ప్రదేశంలో గూడు కట్టింది.ఇప్పుడు అది సంతోషంగా, భయాల్లేకుండా జీవిస్తోంది.
ఇది మనకు చెప్పే బోధన ఏమిటి అంటే…?
పరిస్థితులు మన కోసం మారవు.
మనమే మారాలి.
🌿ఒక్కోసారి మనం పాత సంబంధాలు, పాత ఉద్యోగాలు, పాత ఆలోచనలు, పాత నమ్మకాలకే కట్టుబడి ఉంటాం.
👉"ఇవే సరైనవని" అనిపించవచ్చు... కానీ అవి మనని నశింపజేస్తున్నా మనకి కనిపించదు.
🌿మార్పు అనేది అసౌకర్యంగా అనిపించవచ్చు... కానీ అదే మన స్వేచ్ఛకు మార్గం.
👉*ఇప్పుడైనా మీరు ఓ నిర్ణయం తీసుకోవాలి:*
🌿భయంతో పాతదానికే అంటిపెట్టుకొని ఉండాలా?
🌿లేక ధైర్యంగా ముందడుగు వేయాలా?
ఎంచుకోవాల్సింది మనమే.🍁.
No comments:
Post a Comment