🌻🍀🌻🍀🍁🍀🍁🌻
*ఇదే దైవలీల*
🪷🪷🪷
*నత్వేత్మావమన్తవ్యః పురుషేణ కదాచన*
*నహ్యాత్మ పరిభూతస్య భూతిర్భవతి శోభనా*
*మనిషి ఎన్నడూ తనని తాను కించపరచుకోకూడదు. తనను తానే నిందించుకునే వానికి ఎదుగుదలే ఉండదు.*
*“భగవంతుడు మన మీద పగబట్టలేదు. మనకూ మంచి సమయం వస్తుందని గుర్తుంచుకో!”అని ఓదార్చాడు*.
*ప్రపంచంలో ఏ వ్యక్తికైనా పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలాగుండవు. వెలుగు నీడల్లా మంచి చెడు రోజులు వస్తుంటాయి.*
*అయితే శాశ్వత సత్యం ఒకటుంది. అది భగవంతుడు ఎల్లప్పుడు మన వెంట ఉంటాడు అనేది.*
*కష్ట సమయాల్లో వాటి నుంచి విముక్తి పొందడానికి అతను పరోక్షంగా మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అతడెలాంటి సహాయం ఎలా, ఎప్పుడు చేస్తాడో మన ఊహకందనిది*.
*కష్టాలలో మనను ఒంటరిగా వదిలేయడు*.
*సుఖాలు తాత్కాలికమైనవేనన్న అనుభూతి కలిగిన నాడు కష్టాలు కూడా సుఖాలుగా గోచరిస్తాయి*.
*సహాయాలే కాదు కష్టాలనధిగమించడానికి కృషి చేయమని ప్రేరణనిచ్చేది కూడా భగవంతుడే. ఆ ప్రేరణతోనే సత్కార్యాలు చేయగలుగుతాం. అవి మనకు తృప్తినిస్తాయి*.
*ఈ సృష్టికి మూల కారణం భగవంతుడు. ప్రాణి కోటికి ప్రాణం పోసినది, వాటిని పోషిస్తున్నది ఆ సర్వేశ్వరుడే. సుఖదుఃఖాలు అతను సృష్టించినవే*.
*మన అహంకారం పెరిగిపోకుండా ఉండడానికి మధ్యమధ్య కష్టాలనే పరీక్షలు పెడుతుంటాడు. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమోగుణాల మార్పుల చేతనే సమస్త కార్యాలు జరిగిపోతూ ఉండగా అహంకారంతో అన్నింటికి కర్తను నేనే అని మానవుడు విర్రవీగుతాడు.*
*చెడు జరిగితే భగవంతుని నిందించడానికి కూడా వెనుకాడము*.
*అన్ని జన్మలలోకెల్ల ఉత్తమమైనది మానవ జన్మ. ఇంతటి మంచి జన్మనిచ్చినందుకు ఆ భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. అది మన విధి*.
👉 *ఆ కృతజ్ఞతను యజ్ఞం, ధ్యానం, జపం, తపం, వ్రతం, పూజ, నామ సంకీర్తనం లేదా ఏ ఇతర ప్రక్రియ ద్వారానైనా తెలుసుకోవాలి*.
👉 *భగవంతుడిని మనం ధ్యానిస్తే ఆయన మన చెంతనే ఉంటాడు*.
👉 *సంకల్ప వికల్పాత్మకమైన బుద్ధిని నిగ్రహించి, బుద్ధిని ఏకాగ్రం చేసి అతనిని శరణు కోరాలి. అలాంటి వారికి కష్టాలు దాపురించినా భగవంతుడు తప్పక ఆదుకుంటాడు*.
👉 *ఒక్కోసారి బాధలు తాళలేక భగవంతుని నిందించినా మనకు జరగవలసిన మేలు చేస్తాడు. అదే అతని లీల.*`
*శివ కేశవాయ నమః ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ...*🙏
🌻🍀🍁🍀🌻🍁🍁🌻🍀🌻🍀🍁🍀🍁🌻
No comments:
Post a Comment