🌷మంచి మాట🌷
జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరు మనకు వెలుగునిచ్చే వారే కానీ ఎవరు గొప్ప అంటే చెప్పలేం. ఎవరి టైంలో వారే గొప్ప మనం కూడా అంతే దేనికైనా టైం రావాలి.
నోరు విప్పేటప్పుడు పరుసు తెరిచేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు డబ్బు రెండు దక్కుతాయి.
ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు ఏమో కానీ, ప్రయత్నం చేయుటంలో మాత్రం ఓడిపోవద్దు.
నాలుక పై అయిన గాయం తొందరగానే నయం అవుతుంది. కానీ నాలుక చేసిన గాయం మాత్రం ఎప్పటికీ నయం కాదు.
జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని మరొక ఇల్లు మార్చమని ఇలవేల్పు మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరు చెప్పరు.
మానస సరోవరం👏
No comments:
Post a Comment