Thursday, May 7, 2026

నిజమైన ప్రేమను తట్టుకోలేరు! || ఆచార్య ప్రశాంత్

నిజమైన ప్రేమను తట్టుకోలేరు! || ఆచార్య ప్రశాంత్

Author Name:Acharya Prashant Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@AcharyaPrashantTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FSmdoXBFPQA



Transcript:
(00:01) నిజమైన ప్రేమతో రిలేషన్ పెట్టుకోవడం చాలా కష్టం. నిజమైన ప్రేమ అంటే నేరుగా గుండెపై దాడి చేసినట్టు ఉంటుంది. అందరూ అంటారు నిజమైన ప్రేమ దొరకదని కానీ నిజమైన ప్రేమని మీరు భరించలేరు. ఒకవేళ ఇప్పుడే దొరికితే తట్టుకోగలరా పెద్ద పెద్ద కవిత్వాలు రాస్తారు. కొందరు దుకాణాలే నడుస్తున్నాయి వీటిమీద. మేమంతా చాలా గొప్పవాళ్ళం కానీ ఈ దురదృష్టమైన జీవితం మమ్మల్ని మోసం చేసింది.
(00:43) అబద్ధం నీలో అంత దమ్ము ఉందా నిజమైన ప్రేమని తట్టుకోగలిగేంత అర్హత గురించి వదిలేయ్ నిజమైన ప్రేమికుడు ముందు రెండు రోజులు కూడా నిలబడలేవు. పారిపోతావ్ మనకు ప్రేమ అవసరం లేదు మనకు భ్రమ కావాలి మనకు మోసం కావాలి. మనకు ఎలాంటి వాళ్ళు కావాలంటే మనల్ని అందమైన మోసాల్లో ఉంచగలగాలి మనల్ని రంగు రంగుల కలల్లో ఉంచగలగాలి.
(01:32) మనకు కావాల్సింది మనతో ఇలా చెప్పేవాళ్ళు అరే కాదు నువ్వే మోసగాడివి కాదు నువ్వే లంచగొండివి కాదు అరే కాదు నీలో ఏమాత్రం కొవ్వు పెరగటం లేదు. నీకంటే అందంగా ఎవరున్నారు నీకంటే గుణవంతులు ఎవరు నీకంటే జ్ఞానవంతులు ఎవరు గొప్పవారు ఎవరు? మనకు కావాల్సింది మనతో ఇలా చెప్పేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా మాకు నువ్వే అన్ని మనకు కావాల్సింది ఇలా చెప్పేవాళ్ళు నీలో ఉన్న ప్రతి లోపం ఓకే ఇది ఒక పన్నాగం
(02:22) మనకు తెలుసు మనం వాళ్ళ లోపాలను ఎత్తు చూపకపోతే వాళ్ళు మనవాటిని కూడా ఎత్తి చూపరని ఇది ఒక కుట్ర మనకు తెలుసు మనం వాళ్ళని మెరుగవ్వమని ప్రోత్సహిస్తే ఇక మన మీద కూడా అదే ఒత్తిడి పడుతుంది. నువ్వు కూడా మెరుగవ్వాల్సిందే అనే బాధ్యత వస్తుంది. మెరుగవ్వడం కోసం కష్టపడాలి బాబు బెడ్ మీద నిద్రపోతూ ఎవరూ మెరుగవ్వరు. మనకు మెరుగవ్వాలని లేదు అందుకే మన తోడుండే వారు కూడా మెరుగవ్వడం మనకు ఇష్టం ఉండదు.
(03:00) మనకు వాళ్ళలో మార్పు కూడా ఒక హద్దు వరకు మాత్రమే కావాలి. అంటే వాళ్ళ మార్పు మన సుఖానికి ఉపయోగపడేంతవరకు మాత్రమే ఉదాహరణకి ఎవరికైనా పెద్ద జీతం ఉన్న ఉద్యోగం వస్తే అతని భార్య సంతోషపడుతుంది. పెద్ద జీతం దొరకకపోయినా లంచం బాగానే తీసుకుంటాడు. ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇది నిజమైన మార్పు కాదు ఇది కేవలం మన భోగం కోసం చేసిన ఏర్పాట్లు నిజంగా మీరు ఎదుగుతున్నప్పుడు అప్పుడు చూడండి ఎంతమంది వెంటనే మీ నుంచి
(03:46) దూరమవుతారో మీరు ఎంతో డబ్బు సంపాదించినప్పుడు అది ఎలా వచ్చిన డబ్బుఅయినా సరే వాటితో ఇంట్లో సుఖాల కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంటివాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళ సుఖంలో కూడా ఉపయోగపడుతుంది కదా కానీ మీలో నిజంగా మార్పు రావడం మొదలైనప్పుడు అప్పుడు చూడండి మీతో ఎవరు నిలబడతారో మీలో నిజమైన మార్పు వచ్చినప్పుడు కూడా ఎవరైతే మీతో నిలబడతారో
(04:32) వాళ్లే నిజమైన ప్రేమికులు ఎవరైతే మీతో ఇలా చెబుతారో పర్లేదు డబ్బు రాకపోయినా పర్లేదు కొన్ని కష్టాలు రావచ్చు జీవితంలో ఎక్కడో ఒక చోట కొన్ని దొరకకపోవచ్చు. కానీ నువ్వు ముందుకు వెళ్ళు నీ నిజమైన ఉద్దేశం ఏదైతే ఉందో నువ్వు అటువైపు వెళ్ళు పూర్తిగా వికసించు ఒక పువ్వు లాగా మాకు అదే సరిపోతుంది. అదే మా లక్ష్యం ఇలాంటి వారు ఎవరైనా దొరికితే వాళ్లే నిజమైన ప్రేమికులని తెలుసుకోండి.
(05:26) ఓ

No comments:

Post a Comment