Thursday, May 7, 2026

సోక్రటీస్ జీవితాన్ని మార్చేసిన సంఘటన🌹ప్రశ్నించు కానీ వినయంతో🌹POSTCARD (65) from Kanthrisa

సోక్రటీస్ జీవితాన్ని మార్చేసిన సంఘటన🌹ప్రశ్నించు కానీ వినయంతో🌹POSTCARD (65) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nVQx3-9h3oA



Transcript:
(00:01) ప్రశ్నించడం తప్పు కాదు కానీ ఆ ప్రశ్నించడంలో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండాలి వినయం ఉండాలి. సో ఎథిన్స్ నగర వీధుల్లో చాలా ఏళ్ల క్రితం ఒక వింత మనిషి తిరిగేవాడు అతను రాజు కాదు పండితుల్లా పెద్ద పెద్ద వస్త్రాలు ధరించేవాడు కాదు చాలా సాధారణ రూపం చింపిరి జుట్టు గడ్డం చెప్పులు లేకుండా కూడా తిరిగేవాడని మనకు చరిత్ర చెబుతుంది.
(00:31) కానీ అతని దగ్గర ఒక ప్రమాదకరమైన ఆయుధం ఉంది. అదే ప్రశ్న ఆ ప్రశ్నించిన వ్యక్తి సోక్రటీస్ ఈరోజు సోక్రటీస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మానవజాతి పరిణామ క్రమంలో ప్రశ్నకున్న ఇంపార్టెన్స్ అంత ఇంత కాదు ఆసక్తి జిజ్ఞాస ప్రశ్న ఈ మూడు మనిషి ఎదుగుదలకు కారణం అవుతాయి. ఎట్ ద సేమ్ టైం మనిషికున్న అవివేకం అహంకారం అహంభావం ఆ తర్వాత వినయం లేని లక్షణం అదే మనిషిని పతనావస్థకు చేరుస్తాయి.
(01:11) ఈ భూమిమీద చాలామంది అద్భుతమైన వ్యక్తులు పుట్టినా కూడా అహంకార వశం చేత వాళ్ళు ఈ చరిత్రలో నిలబడలేకపోయారు. వాళ్ళు అనుకున్న విషయాన్ని సరిగ్గా పక్క వ్యక్తికి చెప్పలేకపోయారు. ఒక సమగ్రత లోపించింది. సో సోక్రటీస్ ఒక మెథడ్ ని ప్రపంచానికి అందించాడు అదే సోక్రటిక్ మెథడ్ దాని వెనక ఒక చిన్న బయోగ్రఫీ ఉంది. సోక్రటీస్ తండ్రి ఒక శిల్పి తల్లి ఒక నర్స్ అంటే డెలివరీ అవుతున్నప్పుడు ఒక సహాయకురాలు ఉంటారు కదా ప్రస్తుతి సహాయకురాలు తన తల్లి గురించి సోక్రటిస్ ఒక మాట చెప్పాడు నా తల్లి పిల్లలకు జన్మింపజేస్తుంది
(01:55) ఎందుకంటే ఆమె ప్రసూతి సహాయకురాలు కాబట్టి నేను ఆలోచనలను జన్మింప చేస్తాను అన్నాడు. సో అతనుఏమి అనుకోలే తత్వవేత్త కావాలని అతనేమి తత్వ శాస్త్రాన్ని చదవలే ఉద్యోగం కోసం యుద్ధంలో సైనికుడిగా పని చేశాడు చాలా కష్టాలు చూశడు. కానీ ఒకానొక రోజు అతని జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. సో అతనికి ఒక స్నేహితుడు ఉండేవాడు అతను డెల్ఫీ దేవాలయానికి తీసుకెళ్ళాడు.
(02:25) అక్కడ ఒక దేవత ఉంటుంది. ఆ దేవతని ప్రవచన దేవత అని పిలుస్తారు. ఈ ప్రపంచంలో అత్యంత జ్ఞాని ఎవరు అని సోక్రటీస్ అడిగినప్పుడు ఒక అశరీర వాణి శబ్దం తనకు వినిపిస్తుంది సోక్రటీస్ కంటే జ్ఞాని ఎవరూ లేరు ఇక్కడ అసలు ఆ మాట సోక్రటీస్ నమ్మలేకపోతాడు. తనకు ఏ పుస్తక జ్ఞానం లేదు తను ఏ తత్వశాస్త్రము చదవలేదు ఏ గురువు దగ్గర శిష్యరికము చేయలేదు ఏ విచారణ చేయలేదు ఏమీ తెలియదు.
(02:53) మరి అతను జ్ఞాని ఎట్లా అవుతాడు ఏ జ్ఞానం కలిగి తను జ్ఞాని అయ్యాడు నిజంగా తను జ్ఞానియేనా ఏది ఏమైనా అతను విచారణ చేసినప్పుడు తనకు తెలిసింది తనకేమీ తెలియదని తెలియదని తెలుసుకున్నాడు కాబట్టి రిలాక్స్ గా ఉన్నాడు. ఆ తర్వాత అతను నగరంలో రాజకీయ నాయకులు ఆ తర్వాత కవులు గురువులు పండితులు అని చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి మీకుంతా తెలుసా మీరు జ్ఞానులా అని అడిగితే అవును అన్నారు వాళ్ళు అప్పుడు వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెట్టాడు జ్ఞానం అంటే అన్నాడు జ్ఞానం అంటే అన్ని తెలుసుకోవడం అని చెప్పారు అన్ని తెలియడం అని చెప్పారు.
(03:34) ఏదో ఒక విషయం అడుగుతాడు. అప్పుడు వాళ్ళు తెలియదు అంటారు. అంటే మీకు పూర్తి జ్ఞానం లేనట్టుగా అంటాడు. అట్ట రకరకాల ప్రశ్నలు అడుగుతూ పోతాడు. సో సోక్రటీస్ పుట్టిన ప్రతి పిల్లవాడు సోక్రటీస్ే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తా ఉంటారు అదంటే ఏంది ఇదంటే ఏంది ఎందుకు అట్లా ఉంది దానికి తోక ఎందుకుఉంది నాకఎందుకు లేదు అది ఎందుకు అరుస్తుంది నేను ఎందుకు మాట్లాడుతున్నాను నేను తెల్లగా ఎందుకున్నాను నేను నల్లగా ఎందుకున్నాను ఇంకొకడు నల్లగా ఎందుకున్నాడు పిల్లలు ఎక్కడి నుంచి బయటికి వస్తారు నాకు చెప్పు మా ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు పిల్లలు ఎలా పుడతారు అని అడిగితే ఎవరు
(04:06) చెప్పలేకపోయేవాళ్ళు అందరూ మొహాలు చూసుకునేవాళ్ళు ఒక వ్యక్తి చెప్పాడు అతన్ని పిలిచి వాళ్ళ అమ్మ కొట్టింది వాడిని వీడు పిచ్చి ప్రశ్నలు వేస్తూ వాడు అడిగింది పిచ్చి ప్రశ్న కాదమ్మ మనం జవాబు చెప్పడానికి సిగ్గుపడే ప్రశ్న అది దానికి సరిగ్గా చెప్ితే వాడికి అర్థం అవుతుంది. అప్పుడు అతను అన్నాడు ఇప్పుడు ఆకలి వేస్తుందా అంటే వేయట్లేదు.
(04:28) ఎప్పుడు వేస్తుంది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం వేసినప్పుడు తింటావు కదా ఆ తింటాను అట్లాగే ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు దొరుకుతుంది అప్పటివరకు వదిలేయి తప్పకుండా జవాబు ఉంది కదా వీళ్ళే ఇవ్వాలని ఏముంది అంటే ఆ ప్రశ్న అక్కడితో పోయింది. సో సోక్రటీస్ ఒక విషయం తెలుసుకున్నాడు చాలా మంది తెలుసు అన్న భ్రమలో మాట్లాడుతున్నారు కానీ నిజానికి వాళ్ళకి ఏమి తెలియదని.
(04:49) ఎట్లీస్ట్ నాకు తెలుసు నాకు తెలియదని అన్నాడు. ఐ నో దట్ ఐ డోంట్ నో ఇది మానవజాతి పరిణామ క్రమంలో ఒక గొప్ప రెవలేషన్ సో సోక్రటిస్ అడిగిన ప్రశ్నలు గొప్ప ప్రశ్నలు కావు సాధారణ ప్రశ్నలే కానీ అవి మొట్టమొదటిసారి ఒక వ్యక్తి నేరుగా ప్రశ్నించేసరికి వాటికి ఒక సిగ్నిఫికెన్స్ వచ్చింది ఒక లెజిటమసీ వచ్చింది. అందరూ అడగడం మొదలు పెట్టారు ఊర్లో చెప్పు జవాబు తెలిస్తే అన్నారు.
(05:16) ఎగ్జాంపుల్ ధైర్యం అంటే అని అడిగాడు. మంచి మనిషి అంటే ఎవరు మంచి చెడు అంటే ఏమిటి అని అడిగాడు. ఏదైనా నమ్మితే ఎందుకు నమ్ముతున్నావు నీకు తెలియనప్పుడు అని అడిగాడు. న్యాయం అంటే నిజమైన న్యాయం అంటే ఏంటి అని అడిగాడు. బాధించడం కరెక్టేనా అని అడిగాడు తప్పు అని చెప్పారు అప్పుడు డాక్టర్ కోస్తాడు కదా అప్పుడు బాధ కలుగుతుంది కదా అక్కడ కరెక్టే కదా అన్నాడు.
(05:38) సో ఈ తికమక ప్రశ్నలకి అంతులేని ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఎథెన్స్ నగరం చేతులు ఎత్తేసింది. అప్పుడు సోక్రటీస్ మొట్టమొదటిసారి తను చెప్పడం మొదలు పెట్టాడు. ఎవరైనా చెప్పారని నమ్మొద్దు నువ్వే ఆలోచించు అన్నాడు. ఈవెన్ అరిస్టాటిల్ కూడా మనిషి ఆలోచించే ప్రాణి నువ్వు ఆలోచించి తీరాలి అన్నాడు. కానీ సరైన దిశలోనా వ్యతిరేక దిశలోనా అన్నది నీ యొక్క వివేకం మీద ఆధారపడి ఉంటుంది.
(06:01) యువత అతన్ని ఇష్టపడ్డారు. అతను వెంటపడ్డారు హి వాస్ ద సెలబ్రిటీ ఆన్ దోస్ డేస్ ఏ సోషల్ మీడియా లేకుండా అతని పేరు మారుమోగింది. చాలామంది యువత వచ్చి అతని పక్కన కూర్చున్నారు. సో అతను యువతకు ఒక కొత్త మార్గం చూపించాడు భయపడకుండా ప్రశ్నించండి కానీ వినయంతో ఆలోచించండి కానీ సరైన దిశలో సత్యాన్ని వెతకండి నువ్వు ఎవరో తెలుసుకో నేను తెలుసుకున్నాను నాకేం తెలియదని సో ఒకసారి ఒక యువకుడు సోక్రటీస్ దగ్గరికి వచ్చాడంట అతనికి వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకోమని చెప్పారు.
(06:35) సోక్రటీస్ భార్య జంతేపే చాలా గయ్యాలి అని పేరు సో సోక్రటీస్ దగ్గరికి వెళ్తే ఎలాగో జంతేపే లాంటి భార్య ఉన్న వ్యక్తి గనుక చేసుకోకురా బాబు అంటాడేమో అనుకొని వెళ్ళాడు. ఎందుకంటే సోక్రటీస్ గనుక చెప్తే అది ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ అవుతుంది దానికి ఒక ఆథెంటిసిటీ వస్తుంది. సో సోక్రటీస్ దగ్గరికి వెళ్ళే సమయంలో జంతేపే వచ్చి సోక్రటీస్ మీద నీళ్లుు పోసిందట చెప్తారు అట్లా అప్పుడు సోక్రటీస్ ఆ యువకుడితో అన్నాడు ఇంతదాకా అరిచింది అంటే మెరుపులు ఇప్పుడే వర్షం పడ్డది అన్నాడంట యువకుడు వచ్చి అడిగాడు నేను పెళ్లి చేసుకోవాలని అంటున్నారు మా పేరెంట్స్ చేసుకోవాల వద్దా
(07:10) ఆ యువకుడికి తెలుసు వద్దని అంటాడని కానీ ఆశ్చర్యం సోక్రటీస్ చేసుకో అన్నాడంట ఎందుకు అని అడిగితే మంచి భార్య దొరికింది అనుకో వెరీ గుడ్ చెడ్డ భార్య దొరికింది అనుకో నా భార్య లాంటిది అంటే గయ్యాలి దొరికింది అనుకో నువ్వు సోక్రటీస్ అవుతావ్ ఎట్లా చూసుకున్నా నీకు మంచిదే అన్నాడట. సో అట్లాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఆ జీవన విధానాన్ని సోక్రటీస్ పరిచయం చేశాడు.
(07:34) సో నిజానికి అతను చేసిన నేరం ఒక్కటే ప్రజలని ఆలోచింపజేయడు. ఆ తర్వాత అందరూ కుట్రబన్ని సోక్రటీస్ ని కోర్టుకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇతను భయపడతాడు అనుకున్నారు కానీ అతను ప్రశాంతంగా నిలబడ్డాడు. అతను చెప్పిన మాట ఈ చరిత్రలో నిలిచిపోయింది. మీరు నన్ను చంపవచ్చు కానీ సత్యాన్ని చంపలేరు అన్నాడు. కోర్టు చెప్పింది మీరు ఇతను విషం తాగి మరణించాలని అతని శిష్యులు క్రిటో అరిస్టాటిల్ ప్లేటో ఇట్లాంటి వాళ్ళంతా ఆ జనరేషన్ లో ఏడుస్తున్నారు.
(08:02) అప్పుడు అందులో క్రిటో చెప్పాడు నేను మిమ్మల్ని తప్పిస్తాను పారిపోదామా అన్నాడు. అప్పుడు సోక్రటీస్ చెప్పాడు నేను గనుక పారిపోతే వాళ్ళు చెప్పింది సత్యం అవుతుంది. నేను న్యాయం గురించి జీవితం అంతా మాట్లాడి ఇప్పుడే నేనే చట్టం నుంచి పారిపోతే నా తత్వానికి అర్థం ఏంటి? కాబట్టి మీరేం భయపడొద్దు. మరి మీరు మరణించిన తర్వాత మీ శిష్యుడు ఎవరు? ప్రధాన శిష్యుడు ఎవరు మీ గుడి కట్టించాలా విగ్రహం పెట్టాలా అప్పుడు సోక్రటీస్ చెప్పాడు మీరు ఏం చేసినా చేయకపోయినా నేను ఏ క్షణం అయితే ఈ శరీరాన్ని వదిలేస్తానో ఆ క్షణం నుంచి ఈ భూమి ఉన్నంతవరకు నేను సజీవంగా ఉంటాను. ఈ సోక్రటీస్ అనే పేరుని
(08:35) ఎవ్వరు ఈ భూమి నుంచి తీసేయలేరు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు నా పేరు ఉచ్చరిస్తారు. ఇదిగో ఈరోజు ఈ రీసా అనే వ్యక్తి సోక్రటీస్ అనే పేరుని ఉచ్చరిస్తున్నాడు. ఆ విధంగా అతను సజీవంగా ఉన్నాడు. సోక్రటీస్ చనిపోయే వరకు అధ్యయనం చేస్తూ ఉన్నాడు ప్రశాంతంగా ఉన్నాడు. చావంటే భయం లేదా అదేంటో నాకు తెలియదు కదా నేను దాంట్లోకి అడుగు పెడుతున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుసుకుంటాను అది భయావహం అయిందా లేకపోతే ప్రశాంతమైందా ప్రస్తుతానికి అయితే నా మనసు ప్రశాంతంగా ఉంది అన్నాడు ఆ తర్వాత విషం ఇచ్చారు తాగాడు శరీరం మెల్లగా చల్లబడింది మెల్లగా శరీరం పడిపోయింది.
(09:11) చివరిగా అన్న మాట ఏంటంటే ఏదైతే ఆత్మ అనేది ఉందో అది శరీరానికి బానిస కాదు. సోక్రటీస్ అనేవాడు శరీరం కాదు అని చెప్పి చచ్చిపోయాడు. సో సోక్రటీస్ ఈ ప్రపంచానికి మూడు విషయాలు నేర్పించాడు. ఒకటి ప్రశ్నించడం పాపం కాదు కానీ వినయం. తెలియదని ఒప్పుకో బుకాయించకు. మూడోది పరిశీలన చేస్తూ జీవించు. సో అందుకని ప్రపంచంలో ఎవరు ఏ గొప్ప విషయం చెప్పినా అది సాధారణమైన వ్యక్తి అయినా సెలబ్రిటీ అయినా ఒక తత్వవేత్త అయినా మనం దాన్ని పరిశీలన చేసి మన జీవితానికి అడాప్ట్ చేసుకొని దాన్ని ఆచరించి చూడడం వల్ల అది మనదే అవుతుంది అని మీకు చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్న సోక్రటీస్ కి
(09:56) ఇక్కడి నుంచి శిరస్సు వంచి నమస్కారం అట్లాగే మీ అందరిలో ఉన్న ప్రశ్నించే తత్వానికి శిరస్సు వంచి నమస్కారం మళ్ళీ చివరిగా బాయ్ చెప్తూ చెప్తున్నాను ప్రశ్నించి చండి కానీ అహంకారంతో కాదు వినయంతో శ్రీ సరస వయసు

No comments:

Post a Comment