Sunday, May 10, 2026

ఈజాతికి మాతృ దినోత్సవం మరియు పితృ దినోత్సవం అని ఎక్కడా లేదు.

 *ఈజాతికి మాతృ దినోత్సవం మరియు పితృ దినోత్సవం అని ఎక్కడా లేదు.ఈ జాతిలో ప్రతి క్షణం అమ్మకి, నాన్నకి నమస్కారం.ఒకరోజు అమ్మని,నాన్నని తలచుకొని నమస్కారం చేయడం ఈజాతి లక్షణం కాదు...మూఢనమ్మకాలు అని పేరు చెప్పి అవి విశాల హృదయాలు అని తీసుకొచ్చి పిల్లలమీద రుద్ది వాళ్ళ భవిష్యత్తు పాడుచేస్తున్నది మనమే.అమ్మల రోజేమిటండీ ? అమ్మల రోజుందా ? నాన్నల రోజుందా?తల్లితండ్రులు ఆయుర్దాయం పోసుకొని మనల్ని బ్రతకమని అంటుంది... అటువంటి అమ్మ, నాన్నని తలచుకోవడానికి సంవత్సరానికి ఒక రోజు ఉంటుందా?ప్రతిక్షణం తలచుకోవడం ఈజాతి సంస్కారం.ఉదయం లేస్తే మాతృదేవో భవ,పితృదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిథి దేవోభవ అవీ...నా జాతి జీవనాడులు.ఒక్కరోజు అమ్మని, నాన్నని తలచుకోవడం,ఒక్కరోజు నాన్న గారిని తలచుకోవడం 364 రోజులు తిరస్కరించడం మనకి తెలీదు.అమ్మను, నాన్నను దైవ స్వరూపంగా చూడడమే మన సంస్కృతి...*


No comments:

Post a Comment