*ఈ రోజు “ మదర్స్ డే “ అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతన్నాయి...“ ఫాథర్స్ డే “ రోజు కూడా అంతే...*
*ఇక్కడే చిన్న సందేహం స్త్రీ అయినా, పురుషుడయినా వాళ్ళు భార్యభర్తలైనప్పుడు ఒకేరోజు తల్లిగా,తండ్రిగా నిర్ణయింపబడతారు కదా!!!మరి రెండు వేరువేరు తేదీలు ఎందుకో !! దీన్ని మన తెలుగువాళ్ళయితే "దినోత్సవమా" ని మరీ ఘోరంగా అనువదించేసున్నారు. "దినాలు“ అనే పదాన్ని మనం వేరే సందర్భం లో వాడుతుంటాం !! మరి ఈ దినోత్సవాలేమిటి ?? పైగా తల్లికి ఒకరోజు , తండ్రి కి ఒక రోజు ... వాళ్ళు తల్లిదండ్రులైంది ఒకేరోజు కదా !! మరణించేది మాత్రం వేరు వేరు రోజులు .. ఈ దినోత్సవాలు అందుకా ??మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులను దైవాలుగా భావించి ప్రతినిత్యంపూజించాల్సిన సంస్కారానికి వారసులం !!*
*ఏదో దేశంలో,ఎవరో ఈ రోజు ఇది అని నిర్ణయిస్తే మనకు యీ “దినాలు “ ఎందుకు ?? పోనీ తల్లిదండ్రులు మరణించి ఉంటే కనీసం కొంచెమైనా అర్థముందేమో కాని బతికే ఉన్న తల్లిదండ్రులకు “ దినాలా“ ?? చదువుకున్న వాళ్ళం కదా,ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది..*
No comments:
Post a Comment