*(నేటి ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)*
*నేపాల్ లో ఒకపుడు పఠాన్ అనే రాజ్యముండేది. ఓ కుర్రవాడు ఏదో పని మీద అటుగా వెళ్ళినపుడు అక్కడ ఒక వృద్దుడు ఎద్దుకు బదులుగా తానే గానుగ చుట్టూ తిరగి నూనె తీయడం చూస్తాడు. పాపం అనిపిస్తుంది.* *ఇలా ఎన్నాళ్ళు తిరుగుతారండి కష్టం కధా అన్నాడు.*
*దిగులు పడకబ్బాయ్ రేపటికల్లా అంతా మారిపోవచ్చు అన్నాడు ఆ వృద్దుడు.*
*కోన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళాడు ఆ అబ్బాయి. అక్కడ ఆ వృద్దుడు గానుగకు యజమాని స్ధానంలో ఉండటం చూసి సంతోషంగా దగ్గరికి వెళ్ళి అభినందనలు తెలియజేసాడు.* *"కృతజ్ఞతలు అబ్బాయి కానీ రేపటికల్లా అంతా మారిపోవచ్చు అన్నాడు చిరునవ్వుతో.*
మరో సారి ఆఊరు వెళ్ళాల్సిన పని పడుతుంది ఆ యువకుడికి. ఈసారి ఆ వృద్దుడు ఆ ఊరికి రాజని తెలిసి దిగ్ర్బాంతి చెందుతాడు. రాజుని కలిసి ఇది ఎలా జరిగింది? అని అడుగుతాడు.
వృద్దుడు ఎప్పటిలానే నవ్వుతూ ఏముంది మా ఊరి రాజుకి పిల్లలు లేరు. ఆయన చనిపోయాక సాంప్రదాయం ప్రకారం రాజుగారి ఏనుగు గజమాలతో ఊరి మధ్యకు వచ్చింది, అందరితో పాటే నేనూ అక్కడ నిల్చుని ఉన్నాను. అది నాదగ్గరకోచ్చి నా మెళ్లో గజమాల వేసే సరికి రాజునయ్యాను అని మామూలుగా అన్నాడు వృద్దుడు.
ఎలా జరిగితేనేం. నాకు మాత్రం అమితానందంగా ఉంది అని కుర్రాడనగానే, దానిదేముందిలే రేపటికల్లా అంతా మారిపోవచ్చు అని వృద్దుడు వెళిపోతాడు.
ఇంకోంత కాలం గడుస్తుంది మళ్ళీ ఆ కుర్రవాడు వ్యాపార నిమిత్తం ఆ ఊరికికి వస్తాడు. కాని అక్కడ మనుషులు, భవనాలు, రాజు, కోట ఎవరూ కనిపించరు. ఒకరిద్దరు దిగులుగా తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తే ఏమైందని అడుగుతాడు ఆ కుర్రవాడు.
పెద్ద భూకంపం వచ్చి ఊరంతా ధ్వంశం ఐపోయిందని చెపుతారు. యువకుడు దిగులు పడతాడు.
👉రేపటికల్లా అంతా మారిపోవచ్చు అని పదే పదే చెప్తూ వచ్చిన వృద్దుడు గుర్తుకు వస్తాడు. రేపటికల్లా ఇదంతా మారిపోయి మళ్ళీ మునుపటి అందాలను సంతరించుకోవచ్చు అని అనుకున్నాక స్ధిమితపడతాడు.🍁.
No comments:
Post a Comment