Jai srimannarayana:
*మనం దేవాలయమునకు*
*వెళ్ళినపుడు అక్కడ మనకు దేవగతామూర్తి దర్శనం కలుగుతుంది*
*ఆ దేవతా మూర్తి దర్శనం వల్ల మనలో బుద్ధి వికసిస్తుంది*
*మనకు తెలియకుండానే అప్రయత్నంగా ఆ దేవతా మూర్తికి నమస్కరిస్తాము*
నమస్కరించడం వలన ఆ దేవతామూర్తి పై ప్రేమ (యిష్టం ) కలుగుతుంది .
ఆ ప్రేమ వలన మనకు ఆ దేవతా మూర్తి లో దైవం వున్నదని నమ్మకం కలుగుతుంది .
ఆ నమ్మకం తో మనం సమర్పించిన పువ్వులు వలన అది పూజ అవుతుంది .
పూజ ను శ్రద్ధగా చేయడం వలన మనలో భక్తి కలుగుతుంది .
భక్తితో మనం ఆహారాన్ని స్వీకరిస్తే అది ప్రసాదం అవుతుంది .
భక్తితో మనం నీటిని సేవిస్తే అది తీర్ధం అవుతుంది .
భక్తితో మనం పాటలు పడితే అది భజన అవుతుంది .
భక్త్గితో శిరస్సు వంచి అంజలి ఘటిస్తే , అది శరణాగతి అవుతుంది .
భక్తి గురించి నలుగురు కలసి చర్చిస్తే , అది సత్సంగం అవుతుంది .
ఆ సత్సంగం వలన మనలో తత్త్వ విచారణ కలుగుతుంది
తత్వవిచారణ తీవ్రత వలన మనకు సద్గురువు సాన్నిధ్యం లభిస్తుంది .
సద్గురు సాన్నిధ్యం లో మనకు జ్ఞాన బోధ జరిగి జిజ్ఞాస పెరుగుతుంది .
సద్గురువు కరుణ వలన మనకు సంపూర్ణ జ్ఞానము తెలియబడుగుతుంది .
ఆ జ్ఞానము వలన మనలో తీవ్ర సాధన జరుగుతుంది .
ఆ తీవ్ర సాధన వలన మనలను మనము శోధించడం జరుగుతుంది .
ఆ శోధన లోనే మనము ఎవరో మనకు తెలియబడుతుంది .
అపుడు దేహభావన మనలను వీడి పోతుంది .
మనము ఎవరో మనకు తెలియడం వలన మనకు మోక్షం సిద్ధిస్తుంది .
ఆ మోక్షం వలన మనము జీవన్ముక్తులము అవుతాము .
No comments:
Post a Comment