Friday, May 8, 2026

Can Normal People attain Soul Consciousness ? - Ramana Maharshi

Can Normal People attain Soul Consciousness ? - Ramana Maharshi

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=s8HM2eHvISY



Transcript:
(00:01) బ్రహ్మజ్ఞానం పొందడం నాలాంటి సామాన్యుడికి అసాధ్యం కదా దాన్ని సంపాదించడం వల్ల సంతోషాన్ని పొందటానికి బ్రహ్మజ్ఞానం అనేది ఏదో సంపాదించవలసింది ఏమీ కాదు విడిచిపెట్టవలసిందల్లా అజ్ఞానాన్నే సాక్షాత్కరింప చేసుకోవాలి అని నువ్వు అనుకునే ఆత్మ నిజానికి నువ్వే నీకు అజ్ఞానం ఉందనుకని దుఃఖిస్తున్నావు నీకుొక కథ చెప్ తాను నీ విషయం కూడా అట్లాగే ఉందని గ్రహిస్తావు.
(00:35) పది పది మంది మూర్ఖులు ఒక నదిని దాటారు అవతలి ఒడ్డుకు చేరిన తరువాత అందరూ వచ్చారో లేదో నని చూసుకుందాం అనుకున్నారు ఒకడు లెక్క పెట్టడం మొదలు పెట్టాడు తనని మాత్రం లెక్క పెట్టుకోకుండా నాకు తొమ్మండుకురే కనపడుతున్నారు పదవవాడు తప్పిపోయాడు వాడు ఎవడై ఉంటాడు అన్నాడు మరొకడు నువ్వు సరిగ్గా లెక్కపెట్టావా అని అడుగుతూ తాను కూడా లెక్కపెట్టాడు. ఇతను కూడా తనని లెక్క పెట్టుకోకుండా మనం తొమ్మండుగరమే ఉన్నామ అన్నాడు.
(01:03) మిగిలిన వాళ్ళు దీన్నే ఒప్పుకొని తప్పిపోయిన వాడు ఎవడై ఉంటాడని వాళ్ళల్లో వాళ్లే అనుకున్నారు. ఎంత ప్రయత్నించినా తప్పిపోయాడని వాళ్ళు అనుకున్నవాడు దొరకలేదు ఎంతో ఆప్యాయత ఉన్న మూర్ఖుడు ఎవడైతేనే వాడు నదిలో మునిగిపోయాడు అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. మిగిలిన వాళ్ళు అలాగే చేశారు. నది ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న వీళ్ళని చూచి ఆ దారినే పోతున్న వాడుఒకడు ఎంతో సానుభూతితో సంగతి ఏమిటని విచారించాడు.
(01:31) వాళ్ళు విషయాన్ని చెప్పి ఎన్నిసార్లు లెక్కపెట్టిన తొమ్మండుగురమే ఉన్నామని అతనితో అన్నారు. ఆ కథను విని ఎదురుగా పది మంది కనపడుతుండడం చూపి ఆ కొత్త మనిషి జరిగింది ఏమిటో గ్రహించారు. కాళ్ళంతా నదిని దాటారని వాళ్ళకి తెలిసి రావాలని అతను వాళ్ళతో నేను ఒక్కొక్కడికి ఒక్కొక్క దెబ్బ వేస్తుంటాను మీరు మాత్రం ఎవరికి వారే వరుసగా లెక్క పెట్టుకోండి.
(01:57) ఒకటి రెండు మూడు అట్లా దీనివల్ల అందరూ లెక్కలోకి వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కసారే లెక్కలోకి వస్తారు కూడా అప్పుడు తప్పిపోయిన పదోవాడు దొరుకుతాడు అన్నాడు ఇది విని తప్పిపోయిన తమ స్నేహితుడు దొరుకుతాడని సంబరపడుతూ ఆ బాటసారి చెప్పిన పద్ధతికి వాళ్ళంతా ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్క దెబ్బ వేస్తుంటే ఆఖరివాడు 10 అన్నాడు.
(02:19) దెబ్బ తగలగానే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఒకరి ముఖ ఒకరు చూసుకున్నారు మనం పది మంది ఉన్నామే అని అందరూ ఒక్కసారిగా అన్నారు. వాళ్ళు తమ దుఃఖాన్ని పోగొట్టినందుకు బాటసారికి కృతజ్ఞత తెలుపుకున్నారు. అది కథ పదవ వాడిని ఎక్కడి నుంచి తెచ్చారు అసలు అతను తప్పిపోయాడా తమతో పాటే ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు కొత్తగా ఏదైనా గ్రహించారా వాళ్ళ దుఃఖానికి కారణం ఎవడు తప్పిపోవడం కాదు వాళ్ళ అజ్ఞానం తమలో ఒకడు తప్పిపోయాడని వాళ్ళు ఊహించుకోవడం నీ విషయము అంతే నువ్వు విచారంతో దుఃఖంతో ఉండాల్సిన కారణం ఏమి లేనేలేదు నీవు అనంతుడివి కానీ నువ్వే పరిమితులను విధించుకొని పరిమితుడని అనుకని
(02:56) ఏడుస్తున్నావు ఎక్కడా లేని ఆ పరిమితులను దాటాల అంటూ ఏ ఆధ్యాత్మిక సాధనో మొదలు పెడతావు వాటిని దాటటానికి అవి ఎట్లా ఉపయోగపడతాయి కాబట్టి నువ్వు అనంతమైన శుద్ధ రూపానివి ఆత్మవి అని తెలుసుకో ముందు నేను చెప్పేది ఇదే నీకు ఆత్మ గురించి తెలియకపోవటం అంటూ ఏమీ లేదు నీ అజ్ఞానం కేవలం కల్పితమైన అజ్ఞానం ఆ కథలో పది మంది మూర్ఖులకు తప్పిపోయిన పదవ వాని గురించి ఉన్న అజ్ఞానం వంటిదే ఇదేమో ఆ అజ్ఞానమే వాళ్ళ దుఃఖానికి కారణం సరైన జ్ఞానం నీకుొక కొత్త జీవితాన్ని కొత్త జీవితాన్ని ఇవ్వదని తెలుసుకో నీ అజ్ఞానాన్ని మాత్రమే అది తొలగిస్తుంది.
(03:36) నీ తత్వానికి సంతోషాన్ని కొత్తగా చేర్చదు నీ అసలు తత్వం అదేనని తెలియజేస్తుంది. అదే నిత్యము అదే అవ్యయము నీ దుఃఖాన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక మార్గం నీ ఆత్మని తెలుసుకోవడం ఆత్మగానే ఉండటం

No comments:

Post a Comment