ఒక ఆడది మగాడి వద్ద నుంచి కోరుకునేది ఇదే..! @chanakyaneethi1226
Author Name:CHANAKYANEETHI
Youtube Channel Url:https://www.youtube.com/@chanakyaneethi1226
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6RPkiH7gQ1s
Transcript:
(00:00) హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు చానక్యస్ నీతి జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. కానీ తిరిగి రావడం పొందడం అనేది మన చేతుల్లో ఉండదు. అది నమ్మకమైన మర్యాద అయినా సరే ఆఖరికి ప్రేమైనా కూడా చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బునా సరే నిజమే కదండీ సెంట్ పిలిస్తే మంచి వాసన వస్తుంది కదా అని తాగితే బలం వస్తుంది అనుకోవడం నీ అమాయకత్వం అలాగే డబ్బు అవసరాలు తీర్చే
(00:49) వస్తువులను ఇచ్చింది కదా అని ప్రేమించే మనుషులను కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు అలాగే పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుని పోలేము.
(01:20) పుట్టుక చావు మధ్య వెలిగేది మన మంచితనమే అందుకే అందరితో మంచిగా ఉండాలి. ఆ మంచితనమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అదే మనకు శ్రీరామ రక్ష ఎందుకు అంటే ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం. అది మన చేతుల్లో ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాల్ని ఆనందంగా ఓడించు చివరికి ఒక గుండె అయినా సరే నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు అర్థమైంది కదండీ ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడంటే ఒక కారు ఉంటే ఇంకొక కారు
(02:06) కావాలని ఒక సెల్ ఫోన్ ఉంటే ఇంకో సెల్ ఫోన్ కావాలని అలాగే ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారు. నిజమే కదా మనిషి ఎదిగే కొద్ది అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకే ఎక్కువగా నడవలేక ఎడ్లు బండిని కనిపెట్టాడు. అది సరిపోదని కారు కూడా కనిపెట్టారు. ఆ తర్వాత వేగం సరిపోలేదని ఏరోప్లేన్ బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ కూడా కనిపెట్టారు.
(02:41) కానీ మనిషి ఏది కనిపెట్టినా సరే ఏది ఎక్కినా సరే చివరికి దిగాల్సింది నేల మీదే నడవాల్సింది కాళ్ళతోనే ఇదే జీవిత సత్యం గుర్తుంచుకోండి చెప్పులను ఎవరూ కొనకముందు అద్దాల షాప్ లో ఏసీ రూమ్లో ఉంటాయి. ఎవరో [గురకలు] ఒకరు కొన్న తర్వాత వాటి బ్రతుకు ఎప్పుడూ కూడా ఇంటి బయటే ఉండిపోతుంది. సరిగ్గా నువ్వు కూడా నువ్వు నీలానే బ్రతికినన్ని రోజులు కూడా నువ్వు రాజువే ప్రేమ దోమ అని ఎవరో ఒకరికి బానిసగా మారిన తర్వాత నీ స్థానం వారి గుండెల్లో ఉంటుందని అనుకుంటావు కానీ
(03:27) వాళ్ళు చెప్పు చేతల్లో ఉంటుందన్న సంగతి మరిచిపోతున్నావు మరిచిపోయి అలానే బ్రతికేస్తున్నావ్. అమ్మ నాన్నలు ఉన్నంతవరకు కూడా జీవితం సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేకపోతే నీకు బ్రతుకంటే ఏంటో తెలిసి వస్తుంది. అందుకే సులువుగా లభించే గెలుపు కన్నా కష్టపడి సాధించిన విజయానికే విలువ ఎక్కువ అంటారు.
(04:03) ఏదైనా సరే ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు. అందులో మొదటిది మనం సంపాదిస్తే ఓర్వలేని వాళ్ళు రెండో రకం మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాడికేంటి బాగా డబ్బు ఉంది బ్రతికితే వాళ్ళా బ్రతకాలి అని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. నిజమే కదండీ ఇక మనిషిగా పుట్టడం గిట్టడం మన చేతుల్లో లేదు.
(04:37) బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి అనేది మాత్రం మన చేతుల్లో ఉంటుంది. ఒక మనిషి ఎలా బ్రతకాలో తెలుసా రేపు మనం పోయాక నలుగురి దృష్టిలో మంచి వ్యక్తిగా మనం మిగిలిపోవాలి. నలుగురు వచ్చి పిడికెడు మట్టి వేసేలా బ్రతకాలి. కానీ బ్రతికినన్ని రోజులు నువ్వు మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురితో తిట్టించుకుంటూ మాత్రం అస్సలు బ్రతకకూడదు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు.
(05:10) కానీ అదే బ్రతుకుంటే ఇంకా పోలేదా అంటారు. రేపన్నదాన్ని చూస్తామో లేదో తెలియని మన బ్రతుకులు ఈ బ్రతుకులకి పగలు, కక్షలు, పంతాలు ఎందుకు అర్థమైంది కదండీ ఎవరు తిండి తినలేదు. ఇక పోయి సాధించేది లేదు ఉన్నంత కాలం అందరితో కలిసి సంతోషంగా జీవించండి. జీవితంలో మనం ఏం చేయలేని రోజులు రెండే రెండు ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు అందుకే ఏం చేయాలన్నా సరే మిగిలింది ఈరోజే కాబట్టి నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి అనుభూతిని ఆస్వాదించండి
(05:58) ముఖ్యంగా నవ్వుతూ జీవించండి గుర్తుంచుకోండి ఒక్క విషయం గుర్తుపెట్ట పెట్టుకోండి ఏంటి అంటే ఏదైనా సరే ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా సరే ఉండు ఎంత చనువుగా అయినా సరే ఉండు ఎంత నమ్మకంగా అయినా సరే ఉండు చివరికి ఎంత ప్రేమ చూపించినా సరే ఒక్కరోజు ఒకే ఒక్క రోజు నీ కర్మకాలి బిజీగా ఉండు లేదా ఏదైనా పనిలో ఉండు పొరపాటున వాళ్ళు చేసిన కాల్ లిఫ్ట్ చేయలేదే అనుకో ఇక ఇక అంతే నీ నమ్మకం నీ ప్రేమ నీ అభిమానం ఇవేవి కూడా వారికి గుర్తురావు ఆ క్షణమే నువ్వు
(06:45) వాళ్ళ దృష్టిలో చెడ్డవాడివైపోతావు. చెప్పుడు మాటలు వినే ముందు నిజ నిజాలు తెలుసుకో పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మి ఎదుటివారి మనసు బాధపడేలా ఏ మాట కూడా అనకండి. ఎందుకు అంటే అవే మాటలు బాధ మీరు పడిన రోజు ఖచ్చితంగా వస్తుంది. అది కూడా రెండింతలగా కాబట్టి 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని కోరుకోవడం చాలా ఉత్తమం.
(07:19) 100 కుక్కలు ఒక్కసారి ఒక్కటే మొరిగినా ఒక్క సింహ గర్జనకు సమానం కాదు కదా ఎంత గట్టిగా అరిచి నీ మీద ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ కూడా నిజం కాదు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి కాపాడుతుంది. అర్థమైంది కదండీ మెట్లు చూస్తూ నిలబడిపోతే నువ్వు మేడ ఎక్కలేవు ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే జీవితంలో విజయాన్ని సాధించలేవు.
(07:55) ఒక్క అడుగు ముందు వేసి కార్యచరణ మొదలు పెట్టు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలి వెళ్ళిపోవాలో అప్పుడే వెళ్ళిపోతుంది. ఇందులో నువ్వు దేని గురించి కూడా ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని ఇక జీవించడమే నీకున్న ఓడిపోతాననే భయం నిన్ను సగం చంపేస్తుంది.
(08:34) గెలుస్తానని నమ్మకం లక్ష్యం ఎంత పెద్దనైనా సరే చివరివరకు కూడా పోరాడేలా చేస్తుంది. నీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు. నీకు భయం ఉన్నప్పుడు దేని మీద కూడా ఆశ పడకూడదు. అర్థమైంది కదండీ ఏదైనా కావాలనుకున్నప్పుడు దానికోసం నువ్వు చివరివరకు కూడా పోరాడు కానీ వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించే ఆలోచించొద్దు. అప్పుడే నువ్వు నీ జీవితంలో ప్రశాంతంగా ఉంటావు.
(09:10) నువ్వు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే అస్సలు లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే అలాగే నువ్వు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే అస్సలు లాభం లేదు లేచి కష్టపడాల్సిందే విజయం ఎవరికీ కూడా సులువుగా రాదు. దాన్ని మనమే వేటాడి వెంటాడి సాధించాలి. అర్థమైంది కదండీ అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఒక మగాడైనా ఆడదైనా సరే రెస్పెక్ట్ అంటే గౌరవం ఇవ్వని ఆడదైనా మగాడైనా సరే ఎప్పటికీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించలేరు.
(09:53) ఒక మగాడైనా ఆడదైనా సరే ఎవరి నుంచి ఎవరికైనా సరే కోరుకునేది గౌరవం. నమ్మకం ఈ రెండు ఉన్నప్పుడు వారిద్దరిని విడదీయడం ఎవ్వరి తరం కూడా కాదు ఇద్దరూ కూడా ఒకరి నుంచి ఒకరు కోరుకునేది ఇదే ప్రేమ నమ్మకం గౌరవం ఇచ్చుకుంటే వాళ్ళు పక్కన వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉంటే జీవితంలో వాళ్ళని వేరు చేసే ఆలోచన కూడా పక్కవాళ్ళకి రాదు విడి విడిపోలేరు కూడా నిజమే కదండీ.
(10:35) సో చూశారు కదా ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే [గురకలు] చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.
No comments:
Post a Comment