Wednesday, May 6, 2026

🤯 భయానికి మూలం అజ్ఞానం..! జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అజ్ఞానం తొలగించు 🚨 E-01

🤯 భయానికి మూలం అజ్ఞానం..! జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అజ్ఞానం తొలగించు 🚨 E-01

Author Name:My Journey Sg

Youtube Channel Url:https://www.youtube.com/@SaiGaneshRudrakshala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=h13NDhO70hs



Transcript:
(00:00) మంచిగా ఇప్పుడే పూజ చేసుకున్నా దీపం వెలుగుతూనే ఉంది. మంచిగా దేవుడి దగ్గర కూర్చొని రికార్డ్ చేస్తున్నా ఇకపై ఎడిటింగ్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటా చాలా వీడియోస్ కి మనం చాలా వీడియోస్ డిస్కస్ చేసుకోవచ్చు చాలా టాపిక్స్ మనం కవర్ చేసుకోవచ్చు. మీలో కూడా చాలా మందికి స్పిరిచువల్ ఈ పాత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా ఆ టాపిక్ నేమ్ గాని మీ సమస్య గాని లేదంటే మీరేం తెలుసుకోవాలి మీరు ఎక్కడ స్ట్రక్ అయి ఉన్నారో అలా ఏమైనా ఉంటే కామెంట్ లో పిన్ చేయండి.
(00:33) సో మీరు కామెంట్ పెడితే నేను కామెంట్ లోనే రిప్లై ఇస్తా లేదు ఇది చాలా మందికి యూస్ అవుతది కదా అని వీడియోన చేస్తా సో ఈరోజు మన టాపిక్ అజ్ఞానం భయానికి కారణం జనరల్ గా అజ్ఞానం అంటే మనం ఏంటో బ్రహ్మజ్ఞానం వచ్చేసేసి ఆ అంటే అల్టిమేట్ గా మనం దేన్ని పట్టించుకోకుండా ఉండడానికి జ్ఞానం అనుకుంటారు. అజ్ఞానం అంటే ఏంటి ఆ అంటే మొత్తం మతిస్థిమితం పోయేసి ఎవడో పిచ్చోలా తిరుగుతాఉంటే వాడిని మనం అజ్ఞాని అనుకుంటాం.
(01:03) అంటే బేసిక్ గా మన మనం చూసేవాళ్ళు అలాగే ఉంటారు కదా ఇప్పుడు మనందరం ఏమనుకుంటాం అంటే మనం రోజు పొద్దున్నే లేస్తాం ఆ ఇంట్లో టిఫిన్ చేసేస్తాం అది ఉద్యోగాలకి వెళ్లేస్తాం వస్తాం మన ఈ భౌతిక వ్యవహారాల్లో మనం అందరం ఉంటాం ఇప్పుడు మనం అజ్ఞానులమా జ్ఞానులమా అనే ప్రశ్న వేస్తే మీరు ఎంతమంది అజ్ఞానులో ఉన్నామ అనుకుంటాం మనం లేదు మనం అందరం బాగనే ఉన్నామని ఎంతమంది అనుకుంటున్నారు అదే ఒక సాధువుని గాని లేదంటే ఒక పిచ్చివాడిని తీసుకుందాం అతని ఏంటంటే అంటే తిరుగుతా ఉంటాడు.
(01:34) భిక్షమ చేస్తూ తిరుగుతా ఉంటాడు. ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు పిల్ల పాపాలు అవసరం లేదు నాకు ఆ ఒంటి మీద సరిగా గుడ్డలు కూడా ఉండవన్నమాట. సో ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఎవరు జ్ఞాని ఎవరు జ్ఞాని అంటే ఏమని చెప్తాం మనం ఇప్పుడు మన దృష్టిలో ఏంటి ఆ అతను ఒక పిచ్చివాడు తినడానికి దిక్కు లేదు అని మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో అతను కూడా జ్ఞాని అవ్వచ్చు.
(01:56) ఈ భౌతిక వ్యవహారాల మీద విరక్తి కలిగి అతను బ్రహ్మజ్ఞానం కోసం పరితపిస్తున్నాడేమో కొన్ని కర్మల వల్ల అలా భిక్షటం చేస్తున్నాడేమో ఇది ఎవరికి తెలుస్తది అంటే ఆ ఈశ్వరుడికి అండ్ అలా భిక్షణ చేసే వ్యక్తికి మాత్రమే తెలుస్తది. అలా అతని లైఫ్ ఎందుకు ఉంది అని మరి మనం మన సంగతి ఏంటి మనమందరం రోజు మన భౌతిక వ్యవహారాల్లో కొట్టి మిట్టాడుతున్నాం కదా మరి మనం మనం సాధన చేస్తున్నామా? మనక ఎందుకు భయాలు ఉన్నాయి మనకు దేని వల్ల భయం ఉంది మనందరికీ చాలా వరకు ఉండే సమస్యలలో రెండు సమస్యలు చాలా క్లియర్ అన్నమాట ఒకటి డబ్బు అంటే అప్పులు అవుతాయేమో అని చాలా మందికి అప్పులు కూడా ఉండే ఉంటాయి అప్పులు
(02:34) గాని ఈఎంఐలు గాని సో ఇలా నడుస్తూనే ఉంటది. పిల్లలు వీళ్ళందరూ ఉంటే మాత్రం వాళ్ళ చదువులకి ఖర్చు ఇప్పుడున్న ప్రెజెంట్ సొసైటీలో చదువుకోవడానికి డబ్బు పెట్టాలి మంచిగా బతకడానికి డబ్బు పెట్టాలి. అసలు మనం పుట్టడం పుట్టడమే డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉంటాం భూమి మీదకి రాకముందే అదే కదా ఇప్పుడు హాస్పిటల్లో గర్భిణి స్త్రీ ఖర్చు అని చూస్తే నార్మల్ గా తొమ్మిది నెలలకు అటు ఇటు ఒ లక్ష రూపాయలు ఈజీగా అవుతాయి.
(03:01) అంటే మనం పుట్టకముందే మనం ఖర్చు పెట్టేస్తున్నాం మనం అంత డబ్బుని సో చూడండి మనందరికీ కామన్ ఉండే భయాలు ఇవే డబ్బు గురించో ఆరోగ్యం గురించో లేదా మన ఫ్యూచర్ ఎలా ఉంటది అంత బాగానే ఉంటామా ఏమనా రోగం వస్తదా లేదంటే రేపటికి ఇప్పటికి ఇప్పుడు ఏమనా అవితే ఏంటి సో ఇవన్నీ భయాలే అంటే ఇవన్నీ భయాలు మరి ఉండకపోతే ఎలాగా మనం ఎట్లా పడితే అట్లా ఉండేసి ఆ మంత మంచిగా ఉంటది అనుకుంటే ఉంటామా సరిగా తినకపోతే ఎలాగా డబ్బులు సంపాదించుకోకపోతే ఎలాగా ఇద ఈ క్వశ్చన్ వస్తది అంటే ఇవన్నీ వదిలేస్తేనే జ్ఞాని అవుతాడా 100 కి 100% ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి అంత అలా మనం సాధనలో కూర్చున్న మనం
(03:39) జ్ఞానులం కాం అది కూడా అజ్ఞానమే మరి జ్ఞానం అంటే ఏంటి భయం అన్నాం కదా సో భయం ఎందుకు అని వస్తది అజ్ఞానం వల్ల వస్తది. ఈ భయం అనేదాన్ని కరెక్ట్ గా అబ్సర్వ్ చేయండి మీరు మనకి రేపు ఎగ్జామ్ ఉంది ఈరోజు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే మనకు భయం రేపు పొద్దున ఏ క్వశ్చన్ వస్తదో మనం సరిగ్గా ఆన్సర్ చేయలేమేమో అని భయం ఉంటది.
(03:59) అది మనం ప్రిపేర్ అయ్యామ అనుకోండి ఏ ప్రశ్న వచ్చినా రాసేస్తాం అంటే భయం ఉండదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒక స్టూడెంట్ మంచిగా ప్రిపేర్ అయ్యాడు అన్ని తెలుసు అంటే అతనికి జ్ఞానం ఉందనుకుందాం. రేపు పొద్దున్న ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అతను రాసేస్తాడు ఈజీగా అది టఫ్ అవ్వని ఈజీగా ఉంది ఎందుకంటే అతను ప్రిపేర్ అయ్యాడు కాబట్టి అదే ప్రిపేర్ అవ్వని ఒక పిల్లగాని చూడండి ఎలా ఈ ఎగ్జామ్ నుంచి ఎలా బయట పడాలి ఎలా పాస్ అవ్వాలి అంటే కంగారు కంగారు చేస్తా ఉంటాడు ఎందుకంటే ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి సేమ్ ఇదే లాజిక్ మన లైఫ్ కి అప్లై చేద్దాం సమస్యలు రాకుండా ఏ జీవుడు ఉన్నాడు
(04:31) కన్నీరు పెట్టకుండా ఏ జీవుడు కడతీరడు. సో మరణం ఫిక్స్ అయిపోయింది మనకి ఉన్న కర్మలు ఫిక్స్ అయిపోయాయి ఈ బంధాలు బాధ్యతలు ఇన్నీ ఉన్నాయి ఇది క్వశ్చన్ పేపర్ అనుకుందాం అంటే ఒకొకళక ఒక కల వస్తుంది అనుకుందాం ఇది ఫిక్స్ మరి నువ్వు ఎందుకు భయపడుతున్నావ్ భయం ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం వల్ల వచ్చింది అంటే ఇవన్నీ నువ్వే చేస్తాను నువ్వు చేయకపోతే ఇదంతా పోద్ది అనుకుంటున్నావ్ చూడు ఇది అజ్ఞానం నిష్కల్మషంగా కర్మ చేయడం అనేది జ్ఞానం కిందకి వస్తది నిష్కల్మషంగా కర్మ ఎలా చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి చూడండి సేమ్ ఇదే ఎగ్జాంపుల్
(05:08) తీసుకుందాం చూడండి ఇతను మంచిగా ప్రిపేర్ అయ్యాడు ఒక 100 క్వశ్చన్లు లేదంటే అన్ని ఆ బుక్ మొత్తం ప్రిపేర్ అయిపోయాడు. రేపు పొద్దున్న తనకి ఏ క్వశ్చన్ వచ్చినా చాలా హ్యాపీగా రాసుకుంటాడు కంగారుపడ్డు కదా అలాగే సిద్ధమైపోయింది మీ జీవితం మీరు పుట్టినప్పుడే సిద్ధమైపోయింది అంతా కర్మ అనేది మనం ఇప్పుడు అందరం నమ్ముతా ఉంటాం కర్మ ఉంటది కర్మ సిద్ధాంతం ఉంటది.
(05:28) సో దాని కోసం మనం వచ్చాం మనం అందరం బతుకుతున్నాం. సో ఇలా అనుభవిస్తున్నాం చాలా వరకి అలాంటప్పుడు నీ సాధనలో నీ సాధనలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ మనం గంటలు గంటలు ధ్యానం చేయటమో లేదంటే జపం చేయటమో ఇదిఒక్కటే కాదు మన భావోద్వేగాలు ఎమోషన్స్ ఇవి కూడా మన సాధన మీద ప్రభావం చూపితాయి. సాధన అంటే మనం ఓన్లీ ఒక దగ్గర కూర్చొని ఇంత ఎక్కువ సేపు కూర్చుకుంటే అంత జ్ఞానం వచ్చింది అన్నట్టు కాదు కదా ఎప్పుడైతే నీ భావోద్వేగాలు అదే నీ ఎమోషన్స్ నీ ఫీలింగ్స్ నీ ఆలోచనలు స్థిరమవుతాయో ఎప్పుడైతే నీ ఆలోచనలు అవన్నీ స్థిరంగా ఉంటాయో అప్పుడు నీ సాధన ఫలించినట్టు
(06:11) నువ్వు మంచిగా గంటసేపు ధ్యానం చేశవు ఎవడో చెప్పారు అరే మీ అమ్మగారు చనిపోయారు అని ఇమ్మడి నువ్వు ధ్యానంలో నుంచి బయటిక వచ్చేసి ఆ బోరు బోరుమని ఏడుస్తు ంటే అక్కడ నీ ధ్యానానికి అర్థమే లేదు అలాని బండరా అయిపోమని కాదు అక్కడ మీ అమ్మగారు అంటే నీకు మీ అమ్మగారికి తేడా ఏమి లేదని గ్రహించే అంత శక్తి ఉండడం ఇది నేను స్వామి వివేకానంద గారి బుక్కులో చదివాను సో చూడండి రామకృష్ణులు లాస్ట్ డేస్ లో ఉన్నప్పుడు సో అతను చనిపోతారు అన్నమాట గురువుగారు చనిపోయారు అని చెప్పి శిష్యులందరికీ ఇన్ఫార్మ్ చేస్తా ఉంటారు.
(06:46) స్వామి వివేకానంద కూడా వస్తాడు బాధపడతా ఉంటాడు. వాళ్ళ శిష్యులలో ఇంకొక్క శిష్యుడు రాడన్నమాట అతను ఏంటంటే హిమాలయాల సైడ్ ధ్యానం చేసుకుంటూ అతని సాధనలో అతను ఉంటాడు. సో అతనికి వెళ్లి చెప్పండి అతను కూడా వస్తాడు అతనికి చాలా ఇష్టం గురువుగారు అంటే అని చెప్పేసి చెప్పేస్తాడు అన్నమాట. సో స్వామి వివేకానంద ఏంటంటే అతన్ని పంపిస్తాడు ఒక ఫ్రెండ్ ని పంపిస్తాడు.
(07:07) అక్కడ తపస్సు చేసుకుంటున్న అతనికి ఇలా చెప్తాడు అన్నమాట. ఇలా మన గురువుగారు చనిపోయారు. సో నువ్వు చివరి షెప్ చూసుకోవడానికి రావాలి అనేది అంటే అవునా గురువుగారు చనిపోయారా చనిపోవడం అంటే ఏంటి గురువుగారు నాతోనే ఉన్నారు. అంటే మీరు గమనించండి అక్కడ ఏంటి అతనికి గురువుగారి మీద ఇష్టం లేక కాదు నేను రాను అని చెప్పడం కాదు అక్కడ అంటే ఒక్క స్థాయికి వెళ్ళాక బ్రహ్మజ్ఞానం అనేది మనకి అవగాతం అయ్యాక మనకు అర్థమయ్యాక రెండోది లేదు కదా ఇప్పుడు నువ్వు నేను అనే ద్వంద భావంతో చూస్తున్నామ అంటే మనకు విషయం అర్థం కాలేదు అక్కడ శిష్యుడు ఏమన్నాడు నేను రాను నువ్వు వెళ్ళిపో
(07:45) గురువుగారు నాతోనే ఉన్నారు అన్నాడు నాతో అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా సాధన పాతులో వెళ్ళేటప్పుడు మాకు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో అతనే మన అందరిలో ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మ అతనిలో ఉన్న ఆత్మ ప్రతి ఒక్క జీవిలో ఈ జీవరాశుల అన్నిటిలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో అదే అది అల్టిమేట్ నీలో కల నాలో కల కనిపించడం అనేది ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిందే కానీ మరణం అనేది వేరు చేశక ఆ ఆత్మకు ఉన్న శక్తి ఆ పరబ్రహ్మానికి ఉన్న శక్తి ఒకటే కదా సో ఆ విషయాన్ని అతను గ్రహించాడు ఆ సాధనలో సో అతను పెద్దగా దాన్ని ఎలా అంటే నేను వస్తాను అని ఎమోషనల్
(08:24) గా చెప్పటం గాని లేదా కదా నేను రాను అవసరం లేదు నాకు ఇష్టం ఇలా కాదు అది అంటే గురువుగారు నాతోనే ఉన్నారు నాలోనే ఉన్నారు ఈ విశ్వమంతా విశ్వనాధుడే అయినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క జీవిలోన ఉన్నది ఆస్తత్వమే కదా సో అక్కడ ఆ కాన్సెప్ట్ ప్రకారం చూస్తే అతను అతను బెదరలేదు అన్నమాట అంటే ఇట్లా మనకి ఒక ఎమోషనల్ ఇంబాలెన్స్ అంటాం చూడండి అది లేదు అతనికి ఆ శిష్యుడికి సో వివేకానందకి ఈ విషయం చెప్పాక అతనికి అర్థమయింది నిజం అవును కదా గురువుగారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళలేదు తన శరీరాన్ని త్వజించారు అంతే గురువుగారు మనందరితోనే ఉన్నారని వివేకానంద కూడా ఆ
(08:56) విషయం అర్థం అవుద్ది. సో ఇక్కడ ఈ స్టోరీలో తీసుకున్న పాయింట్ మన లైఫ్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మనకు కూడా చాలా విషయాలు ఇలాగే ఉంటాయి భయం మనం మెయిన్ గా భయపడేది మరణం గురించి మరణం అంటే ఏంటి అంటే మన ఆత్మ చనిపోవటమా ఆత్మ చనిపోతే దానికి అర్థమే లేదు ఆత్మ అనేది శరీరాలు మారుస్తూ ఉంటది మనం మోక్షం పొందేవరకి ఈ మోక్షం అనే కాన్సెప్ట్ ఏంటంటే మోక్షం అంటే మనం ఆ పరబ్రహ్మంలో ఐక్యం కావటం [గొంతు సవరించుకోవడం] ముక్తి అంటే అదే స్థితిని మనం బ్రతుకుండగానే అనుభవించడం రామాన మహర్షి గాని స్వామి వివేకానంద గాని రామకృష్ణ పరమహంస గాని చాలా గొప్ప గొప్ప గొప్ప యోగులు అనుభవించిన
(09:31) స్థితి ముక్తి అది అల్టిమేట్ అన్నమాట అంటే అంటారు చూడండి తామరకు మీద నీటి బొట్టులో వాళ్ళు ఉంటారు అంటే కర్మలు చేస్తారు ప్రతి ఒక్క కర్మ చేస్తారు వాళ్ళకు ఉన్నన్ని అనుభవిస్తారు అందుకే కదా రామకృష్ణులకు క్యాన్సర్ వచ్చినా కూడా అతను చలించలేదు. ఇది ఆ శరీరానికి వచ్చింది నాకు కాదు కదా అని చెప్పేసి అలా ఉన్నాడు అంతే ఆయన సో ఇది అల్టిమేట్ అలాంటి స్థితి అంటే అలాంటి స్థితి మనకు వచ్చినప్పుడు మనం చలించకూడదు.
(09:57) అంటే చలించలేని స్థితి ఆ స్థితి కదా రామకృష్ణ పరమహంసకి ఇలా క్యాన్సర్ వచ్చిందంటే గొంతు క్యాన్సర్ అది అని చెప్పేసి మనం కంగారుపడిపోయాం తప్ప అతను పట్టించుకోలేదు ఇది ఆ శరీరానికి వచ్చిన ఒక కర్మ ఆ కర్మకే నాకు సంబంధం లేదు అన్నట్టున్నాడు ఆయన సో అది జ్ఞానం అలా ఉన్నప్పుడు దేనికి భయపడరు అందుకే వాళ్ళు భయపడలేదు మనం ఏంటంటే మన లైఫ్ లో అలాంటి సంఘటనలు ఏమనా వస్తే భయపడతా ఉంటాం.
(10:18) సో మీకు అర్థమైింది అనుకుంటా సో భయం అనేది ఎప్పుడు వస్తది మనకు జీవితంలో అంటే అజ్ఞానం వల్ల వస్తది. ఇప్పుడు ఇంత చెప్పా కదా నాకు కొన్ని భయాలు ఉన్నాయి అంటే మా ఇంట్లో గాని లేదంటే నాకు గాని హెల్త్ పరంగా ఏదనా నవ్వితే భయం అనేది కంపల్సరీ వస్తది. అలాని మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఉండం కదా ఈ కర్మ సిద్ధాంతాన్ని ఈ అజ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని ఇవన్నీ ఎప్పుడైతే మన సాధనలో ఇంక్లూడ్ చేసుకుంటామో తెలుసుకుంటా ఉంటామో అప్పుడే మనకి ఇంబాలెన్స్ అనేది ఉండదన్నమాట చలించం ఎవరికన్నా అయిపోతే ఎమ్మంటే కంగారు పడిపోయి ఆ అంటే నావాళ్ళు నావాళ్ళు అనుకునేది మమకారం ఏదైతే ఉంటదో ఆ మమకారం ఏదైతే ఉందో
(10:53) అది నీకంటే ఎక్కువ ఆ ఈశ్వరుడుకు ఉంటది కదా సో ఆయనకు తెలియదా ఎవరిని ఎందుకు పంపించానో ఎవరు ఏ కర్మ మీద వచ్చారో ఎవరు ఎన్ని అనుభవించాలో ఆయనకు తెలుసు కదా నువ్వు నీ సాధన చేసుకుంటూ వెళ్ళాలి ఇవి కూడా తెలుసుకుంటూ ఉండాలి. సో మమకారం అహంకారం ఎప్పుడైతే నశిస్తాయో అప్పుడు జ్ఞానం దొరుకుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఈరోజు అహంకారం గురించి భయం గురించి నా వాళ్ళు నావాళ్ళు అనే ఒక మమకారం ఏదైతే ఉందో అది అటాచ్మెంట్ కిందకి వస్తది.
(11:22) ఆ అటాచ్మెంట్ వల్ల మనకు భయం ఉంటది. అటాచ్మెంట్ అంటే ఓన్లీ మనుషులకనే కాదు కదా ఇది నా వస్తువు ఈ వస్తువు కనిపించకుండా పోతే నేను గోలగోల చేస్తా సో ఇది కూడా ఒక మాయ సో ఈ వస్తువు పోకుండా కాపాడుకోవడంలో ఉన్నది కూడా భయమే బంగార ఆభరణాలు చేపించుకుంటాం బీరవాలో పెట్టుకుంటాం మన ఎప్పుడైనా ఇంట్లో నుంచి ఎప్పుడనా ట్రిప్ కి వెళ్ళాం తిరుపతికి వెళ్ళాం లేదంటే విజయవాడకి వెళ్ళామ అనుకోండి భయం వేస్తా ఉంటాం అమ్మ దొంగల దొంగలు పడదు ఏంటి భయం ఇది ఎందుకంటే ఆ ఆభరణానికి ఉన్న దానితో బంధం ఆభరణానికి కాకపోయినా బంగారం ఉంద అనుకోండి అది ఒక 10 లక్షలు అనుకోండి ండి ఆ బంగారం ఇప్పుడు బంగారం రేట్లు పెరిగాయి కదా అది 10 లక్షలు
(11:54) లేదంటే ఒక 5 లక్షలు ఆ నక్లేసిపోద్దేమో అని భయం సో ఈ భయం ఎందుకు వస్తుంది అజ్ఞానం వల్ల సో ఇక్కడ మనం ఏం చేయాలి మనం ఎలా చూడాలి అంటే ద్వైతం అనేది లేదు అద్వైతమే అద్వైతం అంటే ఏంటి సో అంతా ఒకటే ఇప్పుడు ఆ దొంగలో కూడా నువ్వు ఆ ఈశ్వరుని చూసి నాకు ఇచ్చినవాడు ఆ ఈశ్వరుడు ఇప్పుడు ఆ దొంగకి ఈ రూపంలో ఇచ్చాడు ఆ దొంగలో కూడా ఈశ్వరుని చూసిన రోజు అప్పుడు మనకి జ్ఞానం ఉందన్నమాట చాలా చాలా మంది అంతే కదా మీరు గమనించండి ఆదిశంకరాచార్యులు గాని స్వామి వివేకానంద గాని చాలా కర్మలు అనుమదించారు వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇక్కడ అంటే మనక వచ్చేదే మనకు వస్తది మన కానిది మన
(12:32) దగ్గరికి రాదు. అంతా ఒకటే అన్న భావన ఉన్నప్పుడు సో మనకు భయపడడానికి ఆప్షన్ ఉండదు. భయం అనేది ఎందుకో జ్ఞానం ఉన్నాగా సో జ్ఞానం ఉన్నది ఆబ్వియస్ గా నీకు భయం అనేది రాదు. సో అలా మనం కూడా కర్మలని నిష్కల్మషంగా తామరకు మీద నీటి బొట్టలు అనుభవిస్తా ఉంటాం. ఎప్పుడైతే మనకి ఈ భేదభావం ఉంటదో లేదంటే ఈ మమకారాలు అహంకారాలు ఉంటాయో సో ఆటోమేటిక్గా భయం ఉంటది అంటే ఆ వ్యక్తి నా నుంచి వెళ్ళిపోతాడేమో అని లేదంటే నా దగ్గర నుంచి డబ్బులు వెళ్ళిపోతే ఎలా బతకాలి ఇవన్నీ ఉంటాయి ఒక్క రూపాయి సంపాదించకుండా వివేకానంద రామకృష్ణ పరమహంస రమణులు ఎలా బ్రతికారు అంటారు అంటే వాళ్ళకి భయం
(13:10) లేదంటారా అమ్మో నా దగ్గర నేను సంపాదించట్లే ఉద్యోగం చేయట్లేదు కదా నా దగ్గర డబ్బులు లేవు కదా నా ఆకలి ఎలా నేను తిండి ఎలా తినాలి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఇవన్నీ లేవంటారా వాళ్ళకి భయాలు పయాలు 100కి 100 శాతం ఉండవు ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది. ఆ ఈశ్వరుడే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ సమకూరుస్తాడు. నేను ఒక బుక్లో మహాశివ పురాణంలోనూ ఆర్ స్వామి వివేకానంద బుక్లోన ఉంటది ఇది కూడా ఏంటంటే మనల్ని పంపియకముందే అంట అంటే ఏదైతే జీవుడు కర్మలు అనుభవించడానికి వస్తా ఉంటాడో భూమి మీదకి ఆ జీవుడికి ఏమేమో సమకూర్చాలో అవన్నీ ఆ భగవంతుడు ఇచ్చి
(13:45) పంపిస్తాడంట వాడికి ఆకలి అవుతుంది అనుకోండి బాగా వాడికి ఎలా అయినా ఆ ఆకలి తెర్చడానికి పరమేశ్వరుడు ఏదో ఒక దారి పెట్టే ఉంటాడు అక్కడ వాడికి ఆ తినే ఆహారం ఆ టైం కి వచ్చేస్తది. సో ఇలా ఆ పరమేశ్వరుడు ప్రతి ఒక్క జీవి బాధ్యత తీసుకొని మనల్ని పంపించక ముందే మన బాగోగులు చూసుకుంటాడంట. సో అదే అంటారు చూడండి ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటే అది వచ్చేస్తది మనం ఆశించాల్సిన అవసరమ లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు.
(14:10) సో ఈ విషయం తెలిసిన వాళ్లే అలా ముక్తి అనుభవించుకుంటూ అలా ఉంటారు ఎన్ని వచ్చినా అలా ఉంటారు అంతే రమణలు చూడండి ఎంత బాగుంటారు అసలుకి సింపుల్ గా బుచ్చి కూడా కట్టుకొని ఉంటారు అది ఎందుకు ఉన్నారు అలాగ అంటే ఆయనకు తెలుసు నిజం ఏంటో ఆయన జ్ఞానం ఉంది. ఆ స్థితిలో ఆయన మంచిగా హ్యాపీగా ఉన్నాడు చలించకుండా సో అలాంటి స్థితికి మనమందరము వెళ్ళాలి చేరుకోవాలి అలాంటి స్థితి మనం బతుకున్నప్పుడే అట్లీస్ట్ ఒక్క రోజైనా మనం అనుభవించాలి అంటే సో మన సాధనలో ఇవి కూడా ఇంపార్టెంటే సో ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని తలుచుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో
(14:47) జరిగిన సన్నివేశాలని మనం తెలుసుకోవడం వల్ల మనకి అర్థంవుతా ఉంటాయి. ఆహా ఇలా ఉంటదా ఇలా ఉంటదా సో ప్రతిది మనం ఎక్స్పీరియన్స్ చేయలేం కదా సో వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనం పంచుకోవడం వల్ల ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఇలా మీరు వినటం వల్ల మీకు అనిపిస్తా ఉంటది ఆహ ఇలా జరిగిందా ఆహ ఇలా జరిగిందంటే అమ్మో అంటే మనకి ఆ స్థితి రావడానికి మనము సాధన చేస్తా ఉంటాం.
(15:10) సాధన అంటే ఒక దగ్గర కూర్చొని గంటలు గంట కూర్చోవడం ఒకటే కాదు మన భావద్వేగాలు ఒక సమతుల్యమైన స్టేట్ లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి మీకే మీరే ఇంకొకళకి చెప్పే స్థితిలో వెళ్తారన్నమాట అర్థమవుతుందా సో ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం అజ్ఞానం భయం గురించి మాట్లాడుకున్నాం కదా రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా మీకు సో వేరే అంటే వేరే ఉంటది అది కూడా స్వామి వివేకానంద జరిగిన లైఫ్ లోనే ఉంటది.
(15:37) అండ్ నేను పర్సనల్గా ఒక ఎక్స్పీరియన్స్ చేశ సో దాని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటా సో మరి మళ్ళీ కలుసుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి జస్ట్ అలా వింటూ ఉండండి. మీకు ఏదో ఒక స్టోరీ ఎవరో ఒకరి అనుభవం నా అనుభవం అయినా అవ్వచ్చు లేదంటే కామెంట్ లో ఎవరైనా పెట్టారనుకోండి వాళ్ళ అనుభవం మీతో షేర్ చేసుకున్నప్పుడైనా అవ్వచ్చు లేదంటే మీ అనుభవమే మళ్ళీ నేను మీకు చెప్పినప్పుడు సో మీకు గుర్తవస్తది కదా అప్పుడు మీకే అనిపిస్తది ఆహా ఇంత ఇలా చూడాల దీన్ని అలా ఏదో ఒక మూమెంట్ లో మీకు ఒకనొక చిన్న మూమెంట్ లో మీకు చిన్న సత్యం తెలుస్తది ఒక 15 నిమిషాలు లేదంటే ఒక 20
(16:14) నిమిషాలు మనం వింటూ ఉన్నామండి ఇదంతా ఒక్క మాట ఉపయోగపడదు ఒక్క మాట ఉపయోగపడి మీ మనసుని కొంచెం కదిలిచ్చి దారి మల్లి ఇచ్చినా అది మీ సాధారణకి హెల్ప్ అవుతది. సో అలా ఈ మనం మాట్లాడుకునే టాపిక్స్ హెల్ప్ అవుతే పక్క సో హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఓం నమఃశివాయ సర్వం శివం జగత్ [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment