మీ ఫ్రెండ్స్ నిజమైనవారా లేక Fake ఆ? ఈ 5 లక్షణాలతో కనిపెట్టండి! | 5 Signs of Fake Friends
Author Name:Psychology Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PsychologyTelugu-l8v
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fgdQqrbpybM
Transcript:
(00:05) అందరికీ నమస్కారం ఓ విషయం ఆలోచించండి. మన జీవితంలో ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఫ్రెండ్సే మనకి తెలియకుండా మనల్ని వెన్నుపోటు పుడిస్తే అబ్బా ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది కదు కానీ ఒక్కోసారి ఇది నిజం కావచ్చు. ఈరోజు మనం ఫ్రెండ్షిప్ లో ఉండే ఓ డార్క్ సైడ్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. మనల్ని ఎంతగానో ఇష్టపడే క్లోజ్ ఫ్రెండే మనకు తెలియని ఓ పెయిన్ కి కారణం అవుతున్నారేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఈ ప్రశ్న కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ ఒక్క క్షణం ఆలోచించడం చాలా అవసరం ఎందుకంటే మన మంచి కోరుకుంటున్నట్టు నటించే ముసుగు
(00:42) వెనుక మనల్ని కిందకి లాగే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈరోజు ఈ మిస్టరీ ఏంటో తేల్చేద్దాం. రైట్ ఇక మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ మధ్య వచ్చే మామూలు గొడవలు చిన్న చిన్న మనస్పర్ధల గురించి కాదండోయ్ ఇది ఒక స్పెసిఫిక్ అయిన సైకలాజికల్ పాటర్న్ అంటే పదే పదే రిపీట్ అయ్యే ఒక ప్రవర్తన అన్నమాట దీన్ని మనం కరెక్ట్ గా గుర్తుపట్టగలగాలి.
(01:05) సైకాలజిస్టులు ఇలాంటి వాళ్ళని ఫేక్ ఫ్రెండ్ అంటారు. అంటే నకిలి స్నేహితుడు. వీళ్ళు చాలా సెల్ఫిష్ గా మోసపూరితంగా ఇంకా చెప్పాలంటే డబల్ గేమ్ ఆడే టైప్ అన్నమాట. వాళ్ళకి మన మీద కన్నా మన వల్ల వాళ్ళక ఏం ఉపయోగం ఉంది అనే దాని మీదే ఫోకస్ అంతా ఉంటుంది. నిజంగా ఒక్కసారి మన ఫ్రెండ్ సర్కిల్ ని గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి వాళ్ళు ఎవరైనా తగులుతారేమో ఓకే మన ఇన్వెస్టిగేషన్ లో ఫస్ట్ క్లూ ఏంటో చూద్దాం దీన్ని సటిల్ అండర్ మైనింగ్ అంటారు అంటే మనల్ని పైకి తెలియకుండానే తక్కువ చేయడం ఇది ఒక ఫ్రెండ్షిప్ ఫౌండేషన్ లో వచ్చే చిన్న చిన్న పగుళ్ళ లాంటిది
(01:41) మొదట్లో అస్సలు కనపడవు కానీ వాటిని పట్టించుకోకపోతే మాత్రం మొత్తం రిలేషన్షిప్ కూలిపోతుంది. నిజమైన ఫ్రెండ్ ఎప్పుడూ మన పరుగు తీయడు. మనల్ని నలుగురిలో తక్కువ చేయడు. కానీ ఈ ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారే మనం లేనప్పుడు మన వెనుక మన గురించే చెడుగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా నమ్మకంతో ఒక సీక్రెట్ మన ఫ్రెండ్ కి చెప్పామ అనుకోండి రెండంటే రెండు రోజుల్లో ఆ విషయం ఊరందరికీ పాకిపోయింది.
(02:06) అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఆ ఫీలింగ్ ఆ నమ్మక ద్రోహం ఎంత హర్టింగ్ గా ఉంటుందో కదా ఇది ఇంకొంచెం ట్రిక్కీ వినడానికి పొగడతలాగే ఉంటుంది. కానీ దాని వెనకాల మనల్ని కించపరిచే ఒక హిడెన్ మీనింగ్ ఉంటుంది. దీన్నే బ్యాక్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటారు. అంటే పరోక్షంగా అవమానించడం అన్నమాట. డైరెక్ట్ గా తిట్టే ధైర్యం లేక ఇలా పొగడత ముసుగులో దెప్పి పొడుస్తారు అంతే.
(02:33) ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఫ్రెండ్ మనతో వావ్ రోజు ఉండేదానికన్నా ఈరోజు చాలా బాగున్నావ్ అన్నారనుకోండి వినగానే మనకు హ్యాపీగా అనిపించొచ్చు. కానీ ఒక్క సెకండ్ ఆలోచించండి. దాని అర్థం ఏంటి? అంటే రోజు బాలేనా అని చూసారా ఇది పొగడత కాదు తెలివైన అవమానం ఇంకో ఎగ్జాంపుల్ అరే నువ్వు ఇంత బాగా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వావ్ భలే పొగిడారు కదా అనిపిస్తుంది.
(02:58) కానీ దాని వెనుక ఉన్న అసూయని ఆ జడ్జ్మెంట్ ని గమనించారా నీ మీద మాకు పెద్దగా నమ్మకం లేదులే అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. ఫస్ట్ క్లూ కొంచెం సటిల్ గా కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. కానీ ఈ సెకండ్ క్లూ మాత్రం చాలా క్లియర్ గా పక్కగా కనిపిస్తుంది. అదే వన్ సైడెడ్ రిలేషన్షిప్ అంటే ఆ స్నేహంలో ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండవు కేవలం తీసుకోవడమే ఉంటుంది. అదిఒక వన్ వే ట్రాఫిక్ అన్నమాట.
(03:22) ఇప్పుడు నేను చెప్పేవి మీకు బాగా తెలిసినట్టుగా అనిపిస్తున్నాయేమో చూడండి. లాస్ట్ మినిట్ లో ప్లాన్స్ క్యాన్సల్ చేయడం కావాలనే గ్రూప్ పార్టీలకు పిలవడం మర్చిపోవడం ఓ పెద్ద హెల్ప్ కావాలి అన్నప్పుడు మాత్రమే గుర్తొచ్చి ఫోన్ చేయడం ఎప్పుడు మాట్లాడినా సరే వాళ్ళ గురించే వాళ్ళ గొప్పల గురించే చెప్పుకోవడం హ్ ఇవన్నీ ఏం చెప్తున్నాయి వాళ్ళ దృష్టిలో మనం ఒక ఫ్రెండ్ కాదు అవసరానికి వాడుకునే ఒక వస్తువు మాత్రమే ఈ తేడా చాలా సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ ఒక రియల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళకి మనపై కేర్ ఉంది. కానీ ఒక
(03:58) ఫేక్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి మనతో పని పడింది. ఒకటేమో రిలేషన్షిప్ ఇంకోటేమో ట్రాన్సాక్షన్ అంతే తేడా సరే ఇప్పుడుదాకా మనం చూసినవి కేవలం అనుమానాలు చిన్న చిన్న ఆధారాలు అనుకుందాం. కానీ ఇప్పుడు మనం చూడబోయేది ఫైనల్ ప్రూఫ్ దీనికి తిరుగు లేదు. ఇక్కడ ఆ స్నేహం అనే ముసుగు పూర్తిగా పగిలిపోతుంది.
(04:26) వాళ్ళు మనల్ని బలి పశువును చేస్తారు అంటే ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి మొత్తం నింద మన మీదకు తోసేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే దే విల్ త్రో యు అండర్ ద బస్ వాళ్ళు సేఫ్ గా బయట పడటానికి మన ఫ్రెండ్షిప్ ని కూడా పణంగా పెట్టేస్తారు. వాళ్ళకి వాళ్ళ సేఫ్టీనే ముఖ్యం. ఫ్రెండ్షిప్ కాదు.
(04:47) సో మన ఇన్వెస్టిగేషన్ చివరికి వచ్చేసింది. ఈ ప్రవర్తనలన్నీ చూశాక దీని వెనకున్న అసలు నిజంఏంటి ఈ ఫేక్ ఫ్రెండ్షిప్ లో అసలు ఏం మిస్ అవుతోంది కొన్ని కీ ఎలిమెంట్స్ అంటే కొన్ని అత్యంత ముఖ్యమైన విషయాలు పూర్తిగా లోపించాయి. ఏంటవి? అవే నిజాయితి, నమ్మకం, ఒకరిపై ఒకరికి ఉండే కేర్, ఇంకా మ్యూచువల్ రెస్పెక్ట్.
(05:15) ఈ నాలుగు పిల్లర్స్ లేకుండా ఏ బంధమైనా సరే అది ఫ్రెండ్షిప్ అయినా మరేదైనా అస్సలు నిలబడలేదు. ఈ ఫేక్ ఫ్రెండ్షిప్స్ లో ఇవి కంప్లీట్ గా మిస్సింగ్ మరి ఇన్ని తెలిసాక కూడా అలాంటి ఫ్రెండ్షిప్ లోనే కంటిన్యూ అయితే మనం కట్టే మూల్యం ఏంటి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని మన మెంటల్ పీస్ ని పణంగా పెట్టడమేనా ఈ చివరి మాట చాలా పవర్ఫుల్ ఈ నిజాన్ని ఫేస్ చేయడం చాలా పెయిన్ఫుల్ గా ఉండొచ్చు కానీ అబ్బే అదేం లేదులే అని మనల్ని మనం మోసం చేసుకుంటూ బతకడం అంతకన్నా ఎక్కువ బాధ పెడుతుంది.
(05:48) సో ఈ నిజాన్ని గుర్తించడం అనేది ఎండ్ కాదు అది మన మెంటల్ వెల్ బీయింగ్ వైపు మనం వేసే మొదటి ధైర్యమైన అడుగు ఈరోజు మనం మాట్లాడుకునే ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారు మీ అనుభవాలు ఆలోచనలు తప్పకుండా కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి
No comments:
Post a Comment