Wednesday, May 6, 2026

నీ మాటలే నీకు శత్రువులు జాగ్రత్త! | Why Silence is More Powerful Than Words | Satyagrahi

నీ మాటలే నీకు శత్రువులు జాగ్రత్త! | Why Silence is More Powerful Than Words | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=huJataB-yWk



Transcript:
(00:04) మీరు గమనించారో లేదో మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన నోరు ఆడుతూనే ఉంటుంది. అంటే మాట్లాడుతూనే ఉంటుంది. ఒకవేళ నోరు ఆగినా లోపల బుర్రలో మాటలు ఆగుతున్నాయా అస్సలు ఆగట్లేదు. నిజం ఏంటంటే మనం ఒక శబ్ద కాలుష్యంలో బతికేస్తున్నాం. ప్రతి చిన్న విషయానికి ఓవర్ రియాక్షన్. ప్రతి పోస్ట్ కి ఒక కామెంట్. ప్రతి వాదనలో గెలవాలనే తాపత్రాయం.
(00:31) అవతలవాడు ఏమన్నాడో వినడం కంటే మనం ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచించడమే ఎక్కువైపోయింది. మనం మాట్లాడే 90% మాటలు అనవసరం. అసలు మాటలు లేకపోయినా ప్రపంచం ఆగిపోదు. మీ లైఫ్ పాడైపోదు కానీ మనం మాట్లాడుతున్నాం. ఎందుకో లోపల ఏదో ఒక తెలియని టెన్షన్ అన్నమాట. ఆ టెన్షన్ ని కవర్ చేయడానికి ఆ భయాన్ని దాచడానికి అనవసరమైన మాటల కవచాన్ని వేసుకుంటున్నాం.
(00:58) మనం ఎంతలా వాగుతున్నాం అంటే ఎదుటి మనిషి మౌనంగా ఉంటే భయం వేస్తుంది మనకి ఏంటి సైలెంట్ గా ఉన్నావు ఏదో ఒకటి మాట్లాడు అంటాం అంటే నిశశబ్దం మనల్ని భయపెడుతుంది. మనకి మనం ఫేస్ చేసుకోవడం ఇష్టం లేక ఈ మాటల గోడల వెనుక దాక్కుంటున్నాం. అతిగా మాట్లాడటం అంటే మీ లోపల ఉన్న ఎనర్జీ రోడ్ మీద పారబోయడం లాంటిది. మీరు ఎంత ఎక్కువ వాగుతుంటే అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం.
(01:27) మన మనసు ఎప్పుడైనా సరే అశాంతికి లోన అవ్వడానికి మొదటి కారణం బయట వినిపించే శబ్దం కాదు. మీ లోపల మీరు క్రియేట్ చేసుకున్న అనవసరమైన మాటల గోల. అసలు ఈ వాగుడు రోగం మనక ఎందుకు అంటుకుంది? సింపుల్ మనకి అటెన్షన్ కావాలి. మనం ఒకటి చెబితే నలుగురు వినాలి 10 మంది మెచ్చుకోవాలి 100 మంది లైకులు కొట్టాలి. మనం దేనికోసం అయితే తాపత్రాయ పడుతున్నామో అది మనల్ని నాశనం చేసిద్ది.
(01:54) రమణ మహర్షి గారు ఒక మాట అంటారు మౌనం అనేది మాటల కంటే శక్తివంతమైనది అని. కానీ మనం రివర్స్ లో వెళ్తున్నాం. మాటలతో యుద్ధాలు గెలవచ్చు అనుకుంటున్నాం కానీ నిజం ఏంటంటే మాటలతో వచ్చే గెలుపు తాత్కాలికం. మీరు గమనించండి ఒక రోజంతా ఎవరితోనో వాదించి లేకపోతే అనవసరమైన విషయాల మీద డిస్కషన్ చేసి ఇంటికి వెళ్ళాక చూడండి బాడీ కంటే మైండ్ ఎక్కువ అలసిపోతుంది.
(02:21) ఎందుకు మీ ఆత్మకు కావాల్సిన శక్తిని మాటల ద్వారా వృధా చేశారు కాబట్టి ఒక బ్యాటరీని షార్ట్ సర్క్యూట్ చేస్తే ఏమవుతుంది? లోపల పవర్ అంతా ఒక్కసారిగా బయటకు వచ్చి ఖాళీ అయిపోతుంది. మీ మాటలు కూడా అంతే. అవి మీ లోపల ఉండాల్సిన కాన్సంట్రేషన్ ని క్లారిటీని బయటికి లాగేస్తున్నాయి. మనం అనుకుంటాం ఎక్కువ మాట్లాడితే తెలివైన వాళ్ళమని కానీ హిస్టరీలో గొప్ప వాళ్ళందరూ తక్కువ మాట్లాడిన వాళ్లే ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎనర్జీని ఎక్కడ దాచుకోవాలో అని ఈ కాలం యువతకి అసలు ప్రాబ్లం ఏంటంటే ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నేను ఏదో ఒకటి మాట్లాడకపోతే నన్ను ఎవరు గుర్తించరేమో అని
(03:00) భయం. ఈ భయం నుండి అసలు అశాంతి మొదలవుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోవాలా అక్కడ ఎవరు ఉండరు కదా అడవుల్లో కూర్చోవాలా అక్కడ కూడా ఎవరు ఉండరు కదా అలాంటి అవసరం ఏమీ లేదు రమణ మహర్షి గారు చూపించిన మార్గం ఉంది. అది చాలా సింపుల్ అలాగే పవర్ఫుల్ అదే మౌన ధ్యానం. మౌనం అంటే కేవలం నోరు మూసుకోవడం కాదు మౌనం అనేది ఒక భాష.
(03:24) అది ఆత్మను శుద్ధి చేసే ఒక మందు మీకు తెలుసా మీరు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే మీ అంతరాత్మ మీకు వినిపిస్తుంది. బయట గోల తగ్గినప్పుడే లోపల క్లారిటీ పెరుగుతుంది. రమణ మహర్షి గారు గంటల తరబడి మౌనంగా ఉండేవారు. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆయన మాటల ద్వారా కంటే మౌనం ద్వారా ఎక్కువ సమాధానాలు దొరికేవి. చూడండి రోజు మనం చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం.
(03:51) కానీ రోజుకి కనీసం ఒక అరగంట పాటు ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చోండి, ఫోన్ పక్కన పెట్టేయండి, టీవీ కట్టేయండి, ఇయర్ ఫోన్స్ తీసేయండి జస్ట్ మీరు మీ నిశశబ్దం. మొదట్లో పిచ్చెక్కుతుంది లోపల వేల ఆలోచనలు వస్తాయి. పాత గొడవలు గుర్తొస్తాయి. రేపటి టెన్షన్లు గుర్తొస్తాయి. కానీ వదలకుండా కూర్చోండి. ఆ నిశశబ్దాన్ని భరించండి. అది మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
(04:16) కానీ ఒక్కసారి ఆ స్టేజ్ దాటితే మీకు ఒక అద్భుతమైన ప్రశాంతత దొరుకుతుంది. అప్పుడు మీకు అర్థంవుతుంది నేను ఇంతకాలం అనవసరంగా వాగాను అనవసరంగా టెన్షన్ పడ్డాను అని మౌనం మిమ్మల్ని శక్తిమంతుడిని చేస్తుంది. మాటలు మిమ్మల్ని బలహీన పరుస్తాయి. కాబట్టి ఛాయిస్ మీదే గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం మిమ్మల్ని మాట్లాడమనే ఫోర్స్ చేస్తుంది.
(04:40) మార్కెట్ కి మీ మాటలు కావాలి. సోషల్ మీడియాకి మీ కామెంట్స్ కావాలి కానీ మీకు కావాల్సింది మాత్రం నిశశబ్దం మీరు మౌనాన్ని ప్రాక్టీస్ చేస్తే మీలో ఒక విచిత్రమైన కంట్రోల్ వస్తుంది. ఎదుటివాడు మిమ్మల్ని తిట్టిన మిమ్మల్ని విమర్శించినా మీరు మౌనంగా ఉండగలిగితే ఆ తిట్టిన వాడి తిట్టు ఏదైతే ఉందో అది వాడి దగ్గరే ఉండిపోతుంది.
(05:04) మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నంతవరకు అది మీది కాదు. అది కదా అసలైన పవర్ అంటే మనం బతికేది కొన్నాళ్లే ఈ తక్కువ టైంలో అనవసరమైన వాదనలు పనికి రాని చర్చలతో ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి రమణ మహర్షి గారు చెప్పినట్లు మౌనం సర్వశ్రేష్టం అది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. నేటి యువతకి నేను చెప్పవచ్చేది ఒకటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రండి.
(05:27) మీ ఫోన్ల నుండి మీ సోషల్ మీడియా వాదనల నుండి బయటికి రండి. రోజుకి ఒక అరగంట మౌనంగా ఉండడం నేర్చుకోండి. అది మిమ్మల్ని కొత్త మనిషిగా మారుస్తుంది. మీ ఆలోచనల్లో పదును పెంచుతుంది. మీ పనిలో వేగాన్ని పెంచుతుంది. మీరు అనుకోవచ్చు కనీసం సోషల్ మీడియా కూడా చూసుకోవద్దు అని చెప్పేసి నేనేమంటానంటే సోషల్ మీడియాలో మీకు ఏదైతే ఉపయోగాన్ని ఇస్తుందో మిమ్మల్ని ఏదైతే ఒక మెట్టు ఎక్కిస్తుందో దాన్ని చూడండి తప్పులేదు.
(05:59) కానీ మీ పని మీరు మానేసుకొని మీ టైం ని మీరు వేస్ట్ చేసుకొని వేరే పనిలోకి లాగేసే కంటెంట్ చూస్తే ఎవరికి ఉపయోగం ఆ కంటెంట్ చేసిన వాళ్ళకా చూసిన వాళ్ళకా కాబట్టి మీరు డైవర్ట్ అవ్వద్దు. ఎవరి కోసమో సోషల్ మీడియాలో వాదించొద్దు. ఇంకెవరికో మీరు జేజేలు కొట్టాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఒక మెట్టెక్కించే కంటెంట్ చూడండి తప్పులేదు. మిమ్మల్ని నాలుగు మెట్లు దించే కంటెంట్ చూడకండి.
(06:25) అది మీకే ప్రమాదం. అందులోనూ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక గుంపు ఉందనుకోండి ఆ గుంపులో ఎక్కువ మాట్లాడేవాడు ఉన్నాడనుకోండి వాడందరికీ లోకువే కానీ అదే గుంపులో తక్కువ మాట్లాడేవాడు ఉన్నాడనుకోండి వాడికి ఆ గుంపులో గౌరవం దొరుకుతుంది. ఎందుకంటే వాడు అనవసరమైనప్పుడు మాత్రమే నోరు విప్పుతాడు కాబట్టి సో ఆ విలువ మీకు కావాలంటే మౌనం అనే ఆయుధాన్ని వాడటం నేర్చుకోండి.
(06:53) సముద్రం పైన అలల హోరు ఉంటుంది. కానీ లోతుకు వెళ్లే కొద్దీ నిశశబ్దం ఉంటుంది. మీరు కూడా మీ జీవితంలో లోతు పెంచుకోవాలంటే ఆ అలల హోరు తగ్గాలి. ఆ నిశశబ్దాన్ని ప్రేమించండి. చివరిగా ఒక మాట మీరు పుట్టినప్పుడు ఏడవడానికి నోరు తెరిచారు. అది కరెక్టే కానీ బతికున్నంత కాలం ఏడుస్తూనే ఉండకూడదు కదా ఇకనైనా ఆ నోరు మూసి లోపల ఉన్న నిశశబ్దాన్ని వినండి.
(07:19) అక్కడ దేవుడు ఉంటాడో లేదో తెలియదు కానీ మీ నిజమైన మీరు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. అందులోనూ మీ నిజమైన మీకు మీరు కనిపిస్తారు. కాబట్టి ఆలోచించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను.
(07:43) అందులోనూ ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్

No comments:

Post a Comment